News
News
X

Rana Naidu trailer: ‘రానా నాయుడు’ ట్రైలర్: వెంకీ నోట ఆ బోల్డ్ డైలాగ్, అస్సలు ఊహించలేరు!

వెంకీ, రానా నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రానా నాయుడు’ వెబ్ సీరిస్ ట్రైలర్ వచ్చేసింది. అయితే, పెద్దలకు మాత్రమేనండోయ్!

FOLLOW US: 
Share:

వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న ఫస్ట్ వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’. ఈ సీరిస్ ట్రైలర్ కోసం ఇటీవల గట్టిగానే ప్రమోషన్ చేశారు. ఈ సందర్భంగా వెంకీ, రానాలు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుని ఉత్కంఠ పెంచేశారు. బుధవారం ముంబయిలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ‘రానా నాయుడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సీరిస్‌లో తండ్రి కొడుకులుగా నటిస్తున్న రానా, వెంకీల మధ్య పోరు మామూలుగా లేదు. అయితే, ఇందులో ఎవరు ప్రతినాయుడు, ఎవరు హీరో అనేది మాత్రం కాస్త గందరగోళంగానే ఉంటుంది.

‘‘ఎవరైనా సెలబ్రిటీకి సమస్య వస్తే.. ముందు నీకే ఫోన్ వెళ్తుంది. ఫిక్సర్ ఫర్ ద స్టార్స్’’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.‘‘ ప్రతి బాలీవుడ్ స్కాండల్‌లో రానా నాయుడు పేరు వస్తుంది. రానా ఉన్నాడంటే ఆ స్కాండల్ పెద్దదని అర్థం’’ అనే డైలాగ్‌తో రానా పాత్రేమిటనేది చూపించారు. అలాగే, జైల్లో ఉండే వెంకటేష్ (నాగా నాయుడు) పాత్రను కూడా పవర్‌ఫుల్‌గా చూపించారు. తన కుటుంబాన్ని కాపాడుకొనే పాత్రలో వెంకీ కనిపించారు. అయితే, రానాకు అతడి తండ్రి నాగాకు మధ్య ఎందుకు గొడవలు జరుగుతాయనేది మాత్రం బుల్లితెరపైనే చూడాలి. అయితే, చివర్లో వెంకటేష్ చెప్పే డైలాగ్ వింటే తప్పకుండా అభిమానులు ఆశ్చర్యపోతారు. ఆ డైలాగ్ వెంకీ నోటి నుంచి వచ్చిందంటే అస్సలు నమ్మలేరు. మరి ఇంకెందు ఆలస్యం మీరూ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి. 

‘రే డోనోవర్’ వెబ్‌సీరిస్‌కు రీమేక్ ఇది

పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' స్ఫూర్తితో ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. మన నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. ఈ వెబ్ సీరిస్‌ను క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల కాబోతోంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మార్చి 10 వరకు వేచి చూడాల్సిందే. ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీలో ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ కానుంది. సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు వీరు ‘మీర్జాపూర్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్‌లకు పనిచేశారు. 

ట్రైలర్‌కు ముందు వెరైటీ ప్రమోషన్

ఈ ట్రైలర్ విడుదలకు ముందు వెంకీ, రానాలు సరికొత్త ప్రమోషన్‌కు తెరతీశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మొదట వెంకటేష్ ఈ సిరీస్ పేరును మార్చాలని నెట్‌ఫ్లిక్స్‌ను హెచ్చరించగా, ఇప్పుడు రానా కూడా దానికి ప్రతి సవాలు విసిరాడు. ‘‘నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్‌లో హీరో ఎవరు? నేను. అందరికంటే పెద్ద స్టార్ కూడా నేనే. అందంగా ఉంది కూడా నేనే. ఫ్యాన్స్ కూడా నాకు సంబంధించిన వాళ్లే. కాబట్టి ఈ సిరీస్‌కు రానా నాయుడు అని కాదు నాగా నాయుడు అనే పేరు ఉండాలి. నాతో మజాక్‌లు వద్దు.’’ అని వార్నింగ్ ఇచ్చారు వెంకీ. ఆ తర్వాత రానా దానికి బదులుగా ‘‘ట్రైలర్ లాంచ్‌కు రా. అయితే నీకు గేట్ దగ్గర ఎంట్రీ దొరక్కపోతే అప్పుడు నువ్వు రానా నాయుడు తండ్రివని చెప్పు. నీ ఎంట్రీ సంగతి రానా చూసుకుంటాడు.’’ అని రిప్లై ఇచ్చాడు.  

Published at : 15 Feb 2023 08:39 PM (IST) Tags: Venkatesh Netflix Rana Naidu Rana Naidu trailer

సంబంధిత కథనాలు

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే

OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Surveen Chawla: ‘రానా నాయుడు’ బ్యూటీ సుర్వీన్ చావ్లా నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా?

Surveen Chawla: ‘రానా నాయుడు’ బ్యూటీ సుర్వీన్ చావ్లా నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా?

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!