అన్వేషించండి

OTT Thriller Movie: ఓటీటీలోకి దిమ్మతిరిగే ట్విస్ట్‌లున్న థ్రిల్లర్ మూవీ... వరలక్ష్మీ శరత్ కుమార్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sabari movie OTT streaming platform: వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టనుంది. ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసుకుందాం.

హీరోయిన్ కంటే విలన్ పాత్రలతోనే విలక్షణ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). ఈ హీరోయిన్ నటించిన థ్రిల్లర్ సినిమా ఒకటి ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యి దాదాపు ఐదు నెలలు పూర్తయ్యాక ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండడం గమనార్హం. ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చో తెలుసుకుందాం పదండి.

ఓటీటీలో శబరి పాన్ ఇండియా స్ట్రీమింగ్

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రను పోషించిన పాన్ ఇండియా మూవీ 'శబరి' (Sabari Movie). హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్ళికి ముందే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక లేడీ ఓరియంటెడ్ మూవీ. బిఎస్ గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కాట్జ్ ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కుండ్ల ఈ సినిమాను నిర్మించగా, బధునందన్, శశాంక్, గణేష్ వెంకట్రామన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా అన్ని అడ్డంకులను దాటుకొని, 5 నెలల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ 2024 మే 3న థియేటర్లలో రిలీజ్ కాగా, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆశించిన రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయిన 'శబరి' సినిమా అక్టోబర్ 11న దసరా కానుకగా సన్ నెక్స్ట్ అనే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. కూతురిని కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసింది? అనే స్టోరీ లైన్ తో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Read Also : Ratan TATA Movie: రతన్ టాటా చేసిన ఏకైక సినిమా... ఆయన మళ్లీ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? 

స్టోరీ విషయంలోకి వెళ్తే.. అరవింద్ అనే వ్యక్తిని సంజన ప్రేమించి పెళ్లాడుతుంది. కానీ కొన్నాళ్ల తర్వాత అతను మోసం చేశాడన్న విషయం తెలియడంతో తన కూతురు రియాను తీసుకొని ముంబై నుంచి వైజాగ్ కి వచ్చేస్తుంది. అయితే కూతురును చూసుకోవడానికి ఓ ఉద్యోగం వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత తన కాలేజీ ఫ్రెండ్, ప్రస్తుతం అడ్వకేట్ గా ఉన్న రాహుల్ హెల్ప్ తో ఓ కంపెనీలో జుంబా ట్రైనర్ గా చేరి కూతురిని, కుటుంబాన్ని పోషించుకుంటుంది. భర్త మోసం చేసినప్పటికీ ప్రస్తుతం సంతోషంగా ఉంటున్నాను అనుకున్న టైంలోనే సూర్యం అనే ఒక సైకో ఊడిపడతాడు. రియా నా బిడ్డ, నాకు అప్పగించాలంటూ సంజనను టార్చర్ చేస్తాడు. ఇంకో వైపు అరవింద్ తన కూతురు తనకు కావాలంటూ కోర్టుకెక్కుతాడు. మరి చివరికి ఆ పాప ఎవరి సొంతమైంది? కూతుర్ని కాపాడుకోవడానికి హీరోయిన్ ఏం చేసింది? హీరోయిన్ భర్తకి, ఈ సైకోకి ఉన్న లింక్ ఏంటి? అనే ట్విస్ట్ లతో సాగే ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఒకవేళ ఓటిటిలో ఎవరైనా ఈ సినిమాను మిస్ అయ్యి ఉంటే గనక ఇప్పుడు సన్ నెక్స్ట్ లో చూడండి. 

Read Also: ‘వేట్టయన్‌’ స్టోరీలో వేలు పెట్టిన సూపర్ స్టార్ - పట్టుబట్టి మరీ మార్పులు చేయించిన రజనీకాంత్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ratan Tata: రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Best Fridges under 10000: రూ.10 వేలలోపు మంచి ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నారా? - ఈ ఆప్షన్లు మీకోసమే!
రూ.10 వేలలోపు మంచి ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నారా? - ఈ ఆప్షన్లు మీకోసమే!
Andhra BJP : ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ratan Tata: రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Best Fridges under 10000: రూ.10 వేలలోపు మంచి ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నారా? - ఈ ఆప్షన్లు మీకోసమే!
రూ.10 వేలలోపు మంచి ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నారా? - ఈ ఆప్షన్లు మీకోసమే!
Andhra BJP : ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
Rafael Nadal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
Hyderabad: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Milton update: హుదూద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?
హుదూద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?
Ratan Tata: భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
Embed widget