Upcoming Telugu Movies : కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ To హాలీవుడ్ వండర్ వరకూ... - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో మూవీస్ ఫుల్ లిస్ట్ ఇదే!
This Week Movies : ఏడాది చివర్లో ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మూవీస్ రెడీ అవుతున్నాయి. కామెడీ నుంచి ప్యామిలీ ఎంటర్టైనర్స్ వరకూ ఈ వారం థియేటర్లలో రానున్నాయి.

This Week Telugu Movie In Theaters OTT New Releases List : గత వారం 'అఖండ 2' తాండవంతో థియేటర్లలో మోత మోగిపోయింది. బాలయ్య రుద్ర తాండవానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ వారం కూడా అంతే స్థాయిలో ఎంటర్టైన్ చేసేందుకు మూవీస్ వచ్చేస్తున్నాయ్. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుంచి మిస్టరీ థ్రిల్లర్, హాలీవుడ్ విజువల్ వండర్స్ వరకూ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...
ఫ్యామిలీతో 'సఃకుటుంబానాం'
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సఃకుటుంబానాం'. ఉదయ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ కథాంశం, ఎమోషన్ బ్యాక్ డ్రాప్‌గా హెచ్.మహాదేవ గౌడ నిర్మించారు. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కామెడీ జర్నీ 'గుర్రం పాపిరెడ్డి'
పాతిపెట్టిన శవాన్ని తీసుకొచ్చేందుకు శ్రీశైలం ఫారెస్ట్‌లోకి వెళ్లిన ఓ గ్యాంగ్‌కు ఎదురైన పరిణామాలేంటి? అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది 'గుర్రం పాపిరెడ్డి'. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన మూవీకి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించగా... వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ప్రదీప్ రంగనాథన్ రొమాంటిక్ ఫాంటసీ 'LIK' రిలీజ్ వాయిదా - ఇట్స్ అఫీషియల్... అసలు రీజన్ ఏంటంటే?
సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్ టీరియస్'
రోహిత్ సహానీ, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ పుత్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్ టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది.
హాలీవుడ్ వండర్ 'అవతార్ 3'
హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు మూవీస్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ ఎంతో ఆసక్తిగా ఉంటుందని కామెరూన్ తెలిపారు. ఫస్ట్ పార్ట్‌లో భూమి, రెండో పార్ట్‌లో సముద్రం చూపించగా... ఈ కొత్త మూవీలో చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీల్లో మూవీస్ / వెబ్ సిరీస్‌ల లిస్ట్
- అమెజాన్ ప్రైమ్ వీడియో - థామా (డిసెంబర్ 16), ఏక్ దివానే కీ దివానీయత్ (హిందీ మూవీ - డిసెంబర్ 16), ఫాలౌట్ (వెబ్ సిరీస్ - డిసెంబర్ 17), ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (వెబ్ సిరీస్ - డిసెంబర్ 19)
- నెట్ ఫ్లిక్స్ - ప్రేమంటే (తెలుగు మూవీ - డిసెంబర్ 19), రాత్ అఖేలీ హై (హిందీ మూవీ - డిసెంబర్ 19), ఎమిలీ ఇన్ పారిస్ 5 (వెబ్ సిరీస్ - డిసెంబర్ 18)
- జీ5 - నయనం (తెలుగు వెబ్ సిరీస్ - డిసెంబర్ 19), డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (మలయాళ మూవీ - డిసెంబర్ 19)
- జియో హాట్ స్టార్ - మిసెస్ దేశ్ పాండే (హిందీ వెబ్ సిరీస్ - డిసెంబర్ 19)
- ఈటీవీ విన్ - రాజు వెడ్స్ రాంబాయి (డిసెంబర్ 18)





















