Varanasi : రాజమౌళి 'వారణాసి'లో న్యూ రోల్ - 'రుద్ర' ఫాదర్‌గా సీనియర్ యాక్టర్!
Prakash Raj : మహేష్ 'వారణాసి' మూవీలో మరో కొత్త రోల్ ఎంట్రీ అయ్యింది. మహేష్ తండ్రి పాత్ర కోసం రాజమౌళి టెస్ట్ షూట్ చేసి ఫైనల్‌గా సీనియర్ యాక్టర్‌ను సెలక్ట్ చేశారట.

Prakash Raj Foot On The Set In Rajamouli Varanasi Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబో పాన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'వారణాసి'. ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి కేవలం మూడే మూడు పాత్రలు రివీల్ చేశారు రాజమౌళి. టైటిల్ గ్లింప్స్‌లోనూ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అయితే, తాజాగా మరో కొత్త క్యారెక్టర్ మూవీలో ఎంటర్ కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది.
మహేష్ బాబు తండ్రిగా..
మూవీలో సాహస అన్వేషకుడు 'రుద్ర'గా పవర్ ఫుల్ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. టైటిల్ గ్లింప్స్‌లో ఆయన లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆయనే ఓ పవర్ అంటే ఇక ఆయన తండ్రి పాత్ర అంటే ఇంకెంత పవర్ ఫుల్‌గా ఉండాలి అనేందుకు తగ్గట్లుగా ఈ రోల్ కోసం జక్కన్న కొందరిపై టెస్ట్ షూట్ చేసి సీనియర్ యాక్టర్‌ను ఫైనల్ చేశారు.
విలక్షన్ నటుడు ప్రకాష్ రాజ్‌ను మహేష్ తండ్రి పాత్ర కోసం రాజమౌళి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన షూటింగ్ సెట్‌లో అడుగు పెట్టారట. గతంలో ఇద్దరు నటులపై టెస్ట్ షూట్ చేసినా జక్కన్న సంతృప్తి చెందకపోవడంతో ప్రకాష్ రాజ్ వద్దకు ఈ పాత్ర చేరింది. ప్రస్తుతం ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. రుద్రగా మహేష్, మందాకినిగా ప్రియాంక చోప్రా, విలన్ 'కుంభ'గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా వీరి లుక్స్ కూడా రిలీజ్ చేశారు. మరి మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ తెలియాల్సి ఉంది.
Also Read : పూనకంతో ఊగిపోయిన మహిళ - బాలయ్యకు చేతులెత్తి మొక్కిన చిన్నారి... 'అఖండ 2' థియేటర్ సిత్రాలు
ఇంతకు ముందు మహేష్, ప్రకాష్ రాజ్ కలిసి చాలా సినిమాలు చేశారు. కొన్నింటిలో విలన్ రోల్ చేస్తే మరికొన్నింటిలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. మురారి, బ్రహ్మోత్సవం, ఒక్కడు, దూకుడు, ఖలేజా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతడు, బిజినెస్ మ్యాన్, పోకిరి, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, గుంటూరు కారం మూవీస్‌లో కలిసి నటించారు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో మహేష్ తండ్రిగా నటించారు. ప్రతిష్టాత్మక 'వారణాసి'లోనూ తండ్రి క్యారెక్టర్‌గా ఆయనైతేనే సరిపోతారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ప్రకాష్ రాజ్ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు.
ఇంటర్నేషనల్ ప్రమోషన్స్
ఈ మూవీ 2027 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఏడాది ముందు నుంచే మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 'అవతార్ ఫైర్ అండ్ యాష్'లో 'వారణాసి' సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా ఈ నెల 19న అవతార్ రిలీజ్ కానుండగా ఈ మూవీతో పాటే 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ కూడా ప్లే చేయనున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో కేఎల్ నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.





















