అన్వేషించండి

OTT Releases Today: అలియా ‘జిగ్రా’ నుంచి మున్నాభాయ్ ‘అగ్ని’ సినిమా వరకూ... ఏయే ఓటీటీల్లో ఏం వచ్చాయో తెలుసా?

OTT Today Releases: అలియా భట్ నటించిన ‘జిగ్రా’తో పాటు శివకుమార్ రామచంద్రపు, నితిన్ ప్రసన్న, శ్రుతీ జయన్  కీలక పాత్రలు పోషించిన ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాలు ఓటీటీల్లో ఈ రోజు విడుదల అయ్యాయి.

OTT Releases Today: అలియాభట్  ‘జిగ్రా’ నుంచి మున్నాభాయ్ ‘అగ్ని’ సినిమా వరకూ ఏయే ఓటీటీల్లో చూసేయచ్చో తెలుసా?

నరుడు బ్రతుకు నటన

నటుడిగా తనను తాను నిరూపించుకోవానికి ప్రయత్నించే ఓ వ్యక్తి కథే 'నరుడు బ్రతుకు నటన'. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించిన ఈ  చిత్రంలో శివకుమార్ రామచంద్రపు, నితిన్ ప్రసన్న, శ్రుతీ జయన్  కీలక పాత్రలో పోషించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.  గత అక్టోబర్ లో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. డిసెంబర్ 6 నుంచి ఆహా తెలుగు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

అలియా భట్ యాక్షన్

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత్ బాలీవుడ్ కథనాయిక అలియా భట్ నటించిన సినిమా కావడంతో ‘జిగ్రా’ సినిమా పై ఇక్కడ కాస్త అంచనాలున్నాయి. పైగా ’జిగ్రా’ మూవీకి అలియా భట్ నిర్మాత కూడా. తెలుగు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు లోనూ ఈ మూవీ రిలీజ్ చేశారు. అలియా భట్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి వెళిపోయారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫైట్స్ తో అదరగొట్టారు కూడా. అయితే ఫలితం మరో లా ఉంది. రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఏడాదే విడుదలైన ‘సావి’ సినిమా కథలో కాస్త మార్పులు చేసి తీశారని బాలీవుడ్ హీరోయిన్ దివ్యా ఖోస్లా ఆరోపించారు. ‘సావి’ లో ఆమెనే హీరోయిన్. డిసెంబర్ 6 నుంచి ‘జిగ్రా’ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 

మున్నాభాయ్ కొత్త సినిమా

మీర్జాపూర్ వెబ్ సిరీస్ ‘మున్నాభాయ్’గా బాలీవుడ్ నటుడు దివ్యేందు ఓటీటీ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆర్సీ 16’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన కొత్త చిత్రం ‘అగ్ని’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో షారూక్ ఖాన్ తో ‘రాయీస్’ సినిమా తెరకెక్కించిన రాహుల్ డొలాకియా ఈ చిత్రానికి దర్శకుడు. ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో హర్షద్ మెహతా పాత్ర చేసి క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ ఈ సినిమా హీరో. ఇందులో ఆయన నిజాయతీ గల విఠల్ అనే ఫైర్ ఫైటర్ గా కనిపిస్తారు. సాయి ధరమ్ తేజ్ తో ‘రేయ్’, నాగార్జునతో ‘వైల్డ్ డాగ్’ సినిమాలతో పరిచయమైన సయామీ ఖేర్ ఇందులో కూడా విఠల్ తో పనిచేసే ఫైర్ సిబ్బంది గా నటించారు. దివ్యేందు ఓ పోలీసు అధికారి సమిత్ పాత్రలో నవ్విస్తారు. ముంబయి లో వరుస అగ్ని ప్రమాదాలు  జరుగుతూ ఉంటాయి. వీటి వెనుక కుట్ర కోణం ఉందని విఠల్ (ప్రతీక్ గాంధీ) గ్రహిస్తాడు. సమిత్, విఠల్ అన్నదమ్ములు. అయితే ఇద్దరూ భిన్న ధ్రువాలు. ఒకరంటే ఒకరికి పడదు. మొదట్లో సమిత్ కూడా విఠల్ చెప్పిన కుట్ర కోణాన్ని లైట్ తీసుకుంటాడు. అయితే పరిస్థితి చేయి దాటడంతో ఇద్దరూ కలసి ఈ ఫైర్ మిస్టరీని ఎలా చేధించాన్నదే కథ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా డిసెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఈ సినిమా నిర్మాత.

ఇది వెట్రిమారన్ సినిమా

ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాతగా మారిన సంగతి తెలిసింది. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘సర్’. బోస్ వెంకర్ దర్శకరచయితగా తెరకెక్కించిన ఈ సినిమా లో విమల్, చాయా దేవి కన్నన్ కీలక పాత్రలో పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. వెట్రిమారన్ సినిమా శైలిలో సాగే విలేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ, ఆహా ఓటీటీలో తమిళ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

డిసెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న మరిన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లు

నెట్ ఫ్లిక్స్

ఎ నాన్ సెన్స్ క్రిస్మస్ విత్ సబీనా కార్పెంటర్ (ఇంగ్లిష్)

బిగ్గస్ట్ హైస్ట్ ఎవర్ (డాక్యుమెంటరీ ఇంగ్లిష్)

క్యాంప్ క్రాషర్ (సినిమా- ఇంగ్లిష్)

ఎకోస్ ఆఫ్ ద పాస్ట్ (సినిమా-  ఇంగ్లిష్)

హయాయో మియాజకీ అండ్ ద హెరోన్  (డాక్యుమెంటరీ జపనీస్)

మేరీ(ఇంగ్లిష్)

అమెజాన్ ప్రైమ్ వీడియో

మొహ్రె (హిందీ) వెబ్ సిరీస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget