అన్వేషించండి

Sir Madam OTT Release Date: లవ్ మ్యారేజ్... చిన్న చిన్న గొడవలు... డివోర్స్ కోసం అప్లై - ఆ కపుల్ ఒక్కటయ్యారంటారా?

Sir Madam OTT Platform: విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ సార్ మేడమ్. ఈ నెల 1న విడుదలైన మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Vijay Sethupathi's Sir Madam OTT Release On Amazon Prime Video: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'తలైవన్ తలైవి' తెలుగులో సర్ మేడమ్. ఈ నెల 1న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా... తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ తాజాగా ఓ పోస్టర్ పంచుకుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. 'ఆకాశవీరయ్య, రాణిలతో ప్రేమలో పడేందుకు రెడీగా ఉండండి.' అంటూ అమెజాన్ ప్రైమ్ తెలిపింది.

ఈ మూవీకి పాండిరాజ్ దర్శకత్వం వహించగా... విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌లతో పాటు కమెడియన్ యోగిబాబు, రోషిని హరిప్రియన్, మైనా నందిని, దీప శంకర్, శరవణన్, కాళీ వెంకట్, వినోద్ జోస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

Also Read: మీ ఇల్లు కాదు... ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్లండి - ఫోటోగ్రాఫర్లపై ఆలియా భట్ ఆగ్రహం

స్టోరీ ఏంటంటే?

ఆకాశ వీరయ్య (విజయ్ సేతుపతి) చుట్టు పక్కల గ్రామాల్లో చేయి తిరిగిన పరోటా మాస్టర్. సొంతూరిలోనే ఫ్యామిలీతో కలిసి హోటల్ నడుపుతూ జీవిస్తుంటాడు. వీరయ్య కోసం పక్క ఊరిలోనే ఓ మంచి సంబంధం చూస్తారు అతని పేరెంట్స్, బంధువులు. ఆ అమ్మాయి పేరు రాణి (నిత్యా మేనన్). ఆమెను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు వీరయ్య. తొలుత వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకొన్నా... ఆ తర్వాత వాళ్ల కుటుంబాల గురించి తెలిసి వద్దనుకుంటారు.

అయితే, అప్పటికే రాణి, వీరయ్య ఇష్టంలో మునిగి తేలుతుంటారు. తమ కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారిని కాదని ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన కొత్తలో కొంతకాలం బాగానే ఉన్నా... ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఓ దశలో అవి చిలికి చిలికి గాలివానలా మారడంతో పెద్దలు ఎంటర్ అవుతారు. కపుల్ మధ్య గొడవలు పెద్దలకు చేరడంతో ఇరు కుటుంబాల మధ్య కూడా గొడవ మొదలవుతాయి. ఈ క్రమంలోనే రాణి వీరయ్య ఇద్దరూ డివోర్స్ తీసుకోవాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వారిద్దరి మధ్య గొడవలకు కారణమేంటి? పెద్దలు ఎందుకు వీరిద్దరి పెళ్లికి ఒప్పుకోలేదు? వీరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? చివరకు వీరిద్దరూ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అమెజాన్‌లో చూసెయ్యండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget