Sharmin Segal: తను మంచి నటి - ‘హీరామండి’లో షర్మిన్‌పై వస్తున్న ట్రోల్స్‌పై యాక్టర్ కామెంట్స్
Sharmin Segal: ‘హీరామండి’లో లీడ్ రోల్స్ చేసిన నటీమణులు.. తమ యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ షర్మిన్ మాత్రమే ట్రోల్స్‌ను ఎదుర్కుంది. తాజాగా తన కో యాక్టర్ ఈ ట్రోల్స్‌పై స్పందించాడు.
Taha Shah Reacts On Trolls On Sharmin Segal: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరామండి’ వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యి దాదాపు నెలరోజులు అయ్యింది. అయినా ఇంకా చాలామంది ప్రేక్షకులు దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. చాలామంది విమర్శకులు.. ‘హీరామండి’ని తెరకెక్కించిన తీరుపై సంజయ్ లీలా భన్సాలీని విమర్శించారు. కానీ నటనపరంగా ఇందులో లీడ్ రోల్స్ చేసిన అందరికీ మంచి మార్కులు పడ్డాయి. ఒక్క షర్మిన్ సెగల్‌కు తప్పా. అలంజేబ్ పాత్రలో కనిపించిన షర్మిన్‌పై విపరీతంగా ట్రోల్స్ వచ్చినా కూడా అవన్నీ తను పట్టించుకోలేదని తన కో యాక్టర్ తాహా షా బాదుషా బయటపెట్టాడు.
ఎక్స్‌ప్రెషన్స్ లేవు..
‘హీరామండి’లో లీడ్ రోల్స్‌లో నటించిన నటీమణుల్లో షర్మిన్ సెగల్ కూడా ఒకరు. అలంజేబ్ పాత్రలో షర్మిన్ కోసం ఒక మంచి కథను సిద్ధం చేశారు సంజయ్ లీలా భన్సాలీ. కానీ షర్మిన్.. ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయిందని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. అందుకే తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. అసలు ఎక్స్‌ప్రెషన్ లేకుండా నటించడం ఎలా సాధ్యమయ్యింది అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో తనపై వచ్చే ట్రోల్స్‌ను భరించలేక ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్‌ను కూడా తీసేసింది షర్మిన్. కానీ ‘హీరామండి’ సక్సెస్ పార్టీ సమయంలో తను చాలా సంతోషంగా కనిపించిందని ఈ సిరీస్‌లో తనకు జోడీగా నటించిన తాహా షా చెప్పుకొచ్చాడు.
ఎవరి చేతిలో ఉండదు..
‘‘సక్సెస్ పార్టీలో నేను తనతో మాట్లాడాను. అప్పుడు తను చాలా సంతోషంగా ఉంది. తను చాలా ధైర్యవంతురాలు. తను ఏం చేస్తుందో తనకు బాగా తెలుసు. తను దీని నుండి బయటపడుతుంది. తన పర్ఫార్మెన్స్‌ను ఇష్టపడినవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. నేను తనతో కలిసి వర్క్ చేసిన ప్రతీసారి తను బెస్ట్ ఇవ్వడమే నేను చూశాను. అంతకంటే ఒక వ్యక్తి నుండి మీరు ఎక్కువ డిమాండ్ చేయలేరు. ఆడియన్స్ ఒక విషయాన్ని ఎలా తీసుకుంటున్నారు అని చెప్పడానికి నేను ఎవరిని? అది ఎవరి చేతిలోనూ ఉండదు. నేను కూడా అదంతా దాటుకొని వచ్చారు. ఒకప్పుడు నన్ను కూడా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు చేశారు. ఇదంతా ఒక ప్రయాణం లాంటిది’’ అని తెలిపారు తాహా షా.
అందమైన ప్రేమకథ..
ఇప్పుడు మాత్రమే కాదు ఇంతకు ముందు కూడా షర్మిన్ సెగల్‌పై వస్తున్న ట్రోల్స్‌పై తాహా షా స్పందించాడు. ‘‘తను నటిగా తన బెస్ట్ ఇచ్చింది. నా పాత్రకు ఇంత ఆదరణ లభిస్తుందని నేను ఊహించలేదు. ప్రేక్షకుల మనసు తెలుసుకోవడం కష్టమే. షర్మిన్ ఎప్పుడూ టైమ్‌కు సెట్స్‌కు వచ్చేది. ఎప్పుడూ తన బెస్ట్ ఇవ్వాలని చూసేది. కానీ ప్రేక్షకులు దానిని ఎలా తీసుకుంటారు అనేదాని గురించి నేను మాట్లాడలేను’’ అని చెప్పుకొచ్చాడు తాహా షా. ‘హీరామండి’లో తాషా షా.. తజ్దార్ అనే పాత్రలో కనిపించాడు. ఈ సిరీస్‌లో నటించిన ఇతర హీరోయిన్ల పాత్రలకు ఎలాంటి ప్రేమకథను యాడ్ చేయని సంజయ్ లీలా భన్సాలీ.. అలాంజేబ్, తజ్దార్ పాత్రల కోసం ఒక స్పెషల్ లవ్ స్టోరీని రెడీ చేశారు.
Also Read: శృతి హాసన్ సింగిలే - బాయ్‌ఫ్రెండ్ శాంతనుతో బ్రేకప్ కన్ఫర్మ్ చేసిన కమల్ కుమార్తె