Shruti Hassan: శృతి హాసన్ సింగిలే - బాయ్‌ఫ్రెండ్ శాంతనుతో బ్రేకప్ కన్ఫర్మ్ చేసిన కమల్ కుమార్తె
Shruti Haasan BreakUp: హీరోయిన్ శృతి హాసన్ తన రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను సింగిల్ అని కన్ఫర్మ్ చేశారు. సో, శాంతనుతో ఆవిడ లేరన్నమాట.
యస్... ఇప్పుడు శృతి హాసన్ సింగిల్. ఆయన జీవితంలో ప్రేమికుడు ఎవరూ లేరు. ఈ మాట ఎవరో చెప్పింది కాదు, స్వయంగా శృతి హాసన్ నోటి నుంచి వచ్చింది. ఆ మాట కూడా వీడియోలో చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పను కానీ...
ప్రజెంట్ శృతి హాసన్ ముంబైలో ఉన్నారు. ఓ హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నారు. స్టూడియోకి వెళ్లేటప్పుడు ఆవిడ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఫ్రీ టైం దొరకడంతో 'ఆస్క్ మీ ఎనీథింగ్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కండక్ట్ చేశారు.
'సింగిల్ ఆర్ కమిటెడ్' అని ఓ నెటిజన్ అడిగాడు. అప్పుడు శృతి హాసన్ ''నాకు ఈ తరహా ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు. కానీ, ఇప్పుడు నేను సింగిల్. మింగిల్ అవ్వటానికి రెడీగా ఉన్నాను. ఓన్లీ వర్కింగ్, ఎంజాయింగ్ మై లైఫ్. బై! చాలా'' అని వీడియోలో పేర్కొన్నారు. దాంతో అందరికీ క్లారిటీ వచ్చింది.
Also Read: మలయాళ సినిమా టర్బో రివ్యూ: మమ్ముట్టి యాక్షన్ కామెడీ ఎలా ఉందంటే?
నాలుగేళ్ల డేటింగ్ కథకు ఫుల్ స్టాప్ పడింది!
డూడుల్ ఆర్టిస్ట్ & ఇల్లు స్ట్రేటర్ శాంతను హజారికా (Santanu Hazarika)తో శృతి హాసన్ డేటింగ్ కహాని ప్రేక్షకుల అందరికీ తెలుసు. తన లవ్, రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ రహస్యంగా ఉండాలని ఆవిడ అనుకోలేదు. శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. కొన్నాళ్లుగా శృతి హాసన్ సైలెంట్ అవ్వడంతో జనాలకు డౌట్ వచ్చింది. ఆరా తీయగా... శాంతనుతో ఆవిడ బ్రేకప్ న్యూస్ నెల క్రితం బయటకు వచ్చింది. ఇప్పుడు అది నిజమని ఆవిడ చెప్పింది.
శాంతనుతో ఫోటోలు అన్నీ డిలీట్ చేసేసిందిగా!
శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శాంతను హజారికా ఫోటోలను డిలీట్ చేసింది. అంతే కాదు, అతడిని అన్ ఫాలో అవుతోంది. అతడు కూడా శృతిని అన్ ఫాలో అయ్యాడు. విడాకులు అనౌన్స్ చెయ్యడానికి ముందు మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. అక్కినేని నాగ చైతన్యను సమంత అన్ ఫాలో అయ్యింది. ఇలా చేసిన ముంబై సినీ జనాలు ఇంకొందరు ఉన్నారు.
Also Read: మూడు రోజులు... రోజుకు ఐదు గంటలు... బుజ్జి ఈవెంట్ కోసం ప్రభాస్ కష్టం!
శాంతనుతో ప్రేమలో పడటానికి ముందు ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్స్ లేని శృతి హాసన్ (Shruti Hassan Second Break Up) కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఇది ఆవిడకు సెకండ్ బ్రేకప్. ఇప్పుడు శృతి హాసన్ చేతిలో 'సలార్ 2', అడివి శేష్ 'డెకాయిట్', సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలి'తో పాటు ఓ హిందీ సినిమా కూడా ఉంది. ఇప్పుడు ఆవిడ కాన్సంట్రేషన్ అంతా సినిమాలపై ఉందని సన్నిహితులు చెబుతున్నారు. మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో బిజీ కావాలని చూస్తోందట.