అన్వేషించండి

Sushmita Konidela: మా బాబాయ్ నాగబాబును చూస్తే నాకే భయమేస్తుంది - చిరు కూతురు సుష్మిత కొణిదెల కామెంట్స్

Sushmita Konidela: సుష్మిత కొణిదెల నిర్మించిన ‘పరువు’ వెబ్ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నాగబాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడింది.

Sushmita Konidela: మెగా ఫ్యామిలీ నుంచి కేవలం హీరోలు మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చినవారు కూడా ఉన్నారు. అందులో ఒకరు చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లు, వెబ్ మూవీస్ నిర్మించారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి తర్వాత వస్తున్న సిరీసే ‘పరువు’. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతున్న సందర్భంగా టీమ్ అంతా ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అందులో ‘పరువు’ గురించి, ఇందులో పనిచేసిన ప్రతీ ఒక్కరి గురించి, ముఖ్యంగా నాగబాబు గురించి స్పెషల్‌గా మాట్లాడారు సుష్మిత కొణిదెల.

వారికి థ్యాంక్స్..

‘‘కంటెంట్ గురించి అందరూ చెప్పారు. మేము పరువు స్టోరీని ఎందుకు సెలక్ట్ చేశామని ఇప్పుడు మీకు తెలుసుంటుంది. ఇందులో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన కథ. దీని గురించి మన సమాజానికి ఎంత చెప్పినా సరిపోదు. ఇలాంటి విషయాలపై అందరికీ అవగాహన రావాలి. ఇలాంటివి సామాజిక వర్గాలపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి, దానివల్ల రాష్ట్రంలో రాజకీయాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, వీటివల్ల అమాయకుల జీవితాలు ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుంది అని తెలుసుకోవాలి. ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్‌తో ముందుకు వచ్చినందుకు, దానిని మంచిగా హ్యాండిల్ చేసినందుకు దర్శకులకు థ్యాంక్స్ చెప్పాలి’’ అని ‘పరువు’ సబ్జెక్ట్ గురించి మాట్లాడారు సుష్మిత కొణిదెల.

అదిపెద్ద సపోర్టర్..

‘‘దర్శకులకు రియల్ లైఫ్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏం జరగలేదు. కానీ వాళ్లు ట్విస్టులు, పాత్రల విషయంలో చాలా బాగా డిజైన్ చేశారు. స్క్రీన్‌పై చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు ఈ పాత్ర ఎందుకు అని ఎప్పుడూ అనిపించదు. ప్రతీ ఎపిసోడ్‌కు మీ ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంటుంది. ఇక పవన్ సాధినేని లేకుండా ఇదంతా జరిగేది కాదు. ఆయన గోల్డ్ బాక్స్‌లో మాకు అతిపెద్ద సపోర్టర్. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చాలు ముందు ఆయనకే ఫోన్ చేస్తాం. పరువు కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరూ తమ వల్ల అయినదానికంటే మించి పనిచేశారు. గోల్డ్ బాక్స్ టీమ్ లేకుండా నా బండి కొంచెం కూడా కదలదు’’ అంటూ తన టీమ్‌లో ప్రతీ ఒక్కరి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు సుష్మిత కొణిదెల.

సర్‌ప్రైజ్ చేస్తుంది..

‘‘పరువులో క్యారెక్టర్ల గురించి చెప్పాలి. ముందుగా మా బాబాయ్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్‌లో మా బాబాయ్‌ను చూస్తుంటే అప్పుడప్పుడు నాకే భయమేస్తుంది. నివేదా అయితే అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. తన గ్లామర్‌ను వ్యానిటీ వ్యాన్‌లో వదిలేసి వచ్చి పెర్ఫార్మ్ చేసింది’’ అంటూ ‘పరువు’ క్యాస్ట్ గురించి చెప్పుకొచ్చారు సుష్మిత. ఇక ఈ ఈవెంట్ కోసం స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన వరుణ్ తేజ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పుకున్నారు. ‘‘మా రిలేషన్ ఎలా ఉంటుందో చాలామంది తెలిసుండదు. కానీ మేము చాలా క్లోజ్’’ అని బయటపెట్టారు. ఇక తను నిర్మించిన ‘పరువు’ సిరీస్.. జూన్ 14 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతోంది.

Also Read: ఒకరిది ‘పరువు’, ఇంకొకరిది ఆత్మరక్షణ - చివరకు హంతకులుగా మారిన ప్రేమ జంట?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget