అన్వేషించండి

Save The Tigers Season 2: మళ్లీ నవ్వించేందుకు వస్తున్న 'సేవ్ ది టైగర్స్’ - సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Save The Tigers Season 2: ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్వించిన ‘సేవ్‌ ది టైగర్స్’ సీజన్ 2 త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలకు సిద్ధమవుతుంది.

Save The Tigers Season 2 Update: భార్యభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను తెరపై చూపిస్తూ నవ్వులు పండించిన వెబ్ సిరీస్ ‘సేవ్‌ ది టైగర్స్’. ప్రియదర్శ్‌, అభినవ్, గోమఠం, చైతన్య కృష్ణ నటించిన ఈ కామెడీ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ని ఓ ఊపు ఊపేసింది. తాజాగా ఈ సిరీస్ సీజన్‌ 2కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్‌ను పంచుకున్నారు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్ టీమ్.  

ఆడియన్స్‌ను మరో సారి తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించేందుకు ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 2’ సిద్ధమవుతుంది. కిడ్నాప్ మిస్టరీతో మంచి ట్విస్ట్ ఇచ్చి.. మొదటి సీజన్‌ను ముగించిన మూవీ మేకర్స్ ఇప్పుడు.. పార్ట్ 2కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ రెండో సీజన్లో మర్డర్ మిస్టరీ చూట్టూ కథ ఉండనుంది. ఇక ఈ సీజన్‌లో సీరత్ కపూర్ తన నటనతో అలరించనుంది. ఆగస్ట్ మూడు లేదా నాలుగు వారాల్లో ఈ సేవ్ ది టైగర్స్ సీజన్‌ 2ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి ‘సేవ్ ది టైగర్స్’ ఆర్ బ్యాక్ అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు మేకర్స్. త్వరలో ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2ను డిస్ని ప్లస్ హాట్‌ స్టార్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కడుపుబ్బా నవ్వేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి అని పేర్కొన్నారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ సిరీస్ గతేడాది రిలీజ్ అయింది. తేజ కాకుమాను దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా ఈ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. సీజన్ 1 ముగ్గురు భార్యా బధితులు కథ. ఇందులో గంటా రవిగా ప్రియదర్శి తెలంగాణ యాషలో అదరగొట్టాడు. ఇక ఆయనకు జోడీగా జోర్దార్ సుజాత అదే రేంజ్‌లో నటించి మాస్ ఆడియన్స్‌ని మెప్పించారు. ఇక రాహుల్ పాత్రలో నటించిన అభినవ్ గోమఠం, పనిమనిషి క్యారెక్టర్‌ రోహిణిల మధ్య వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.

విక్రమ్‌ పాత్రలో చైతన్య కృష్ణ నటించారు. ముగ్గురు హీరోలు డ్రింక్ చేసి కారు నడుపుతూ పోలీసులకు చిక్కుతారు. ఇక ముగ్గురు పార్టీలు అంటూ చేసే సందడి భార్యకు భయపడే భర్తగా విక్రమ్ కష్టాలు నవ్వు తెప్పించాయి. సీజన్ 1ను సక్సెస్ చేయడంలో క్రియేటర్స్ మహి.వి రాఘవ, ప్రదీప్‌లు డైరెక్టర్ తేజ కాకుమాను సక్సెస్ సాధించారు. ఎపిసోడ్ మొదటి నుంచి చివరి వరకు నవ్వులు పంచేలా ప్రతి సన్నివేశం తీర్చిదిద్దారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనుషుల జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలను అద్భుతంగా చూపించారు. ఇక రోహిణి, రాహుల్ మధ్య జరిగే లోదుస్తుల యాడ్ స్క్రిప్ట్ సీన్, జిమ్ చేస్తూ చేయి పట్టేస్తే రోహిణి డ్రైవింగ్ చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లే సీన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Also Read: ‘భ్రమయుగం’లో విల‌న్ లేడు, హీరో లేడు - ఆసక్తికర విషయాలు చెప్పిన మెగాస్టార్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget