Sumathi Valavu OTT: రోడ్ టర్నింగ్‌లో దెయ్యం మిస్టరీ... ఓటీటీలోకి సూపర్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sumathi Valavu OTT Platform: మలయాళం బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'సుమతి వలవు' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ 'జీ5'లో తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

Arjun Ashokan's Sumathi Valavu OTT Release On Zee5: హారర్, కామెడీ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా మరో హారర్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతోంది. మలయాళంలో రీసెంట్‌గా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన హారర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మలయాళంలో ఆగస్ట్ 1న రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ 'సుమతి వలవు'. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ దాదాపు రూ.25 కోట్లు వసూళ్లు సాధించింది. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అర్జున్ అశోకన్, మాళవిక మనోజ్, సైజు కురుప్, గోకుల్ సురేశ్, బాలు వర్గీస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'జీ5' సొంతం చేసుకోగా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీ అందుబాటులో ఉండనుంది. ఐఎండీబీలో ఈ సినిమా 7.7 రేటింగ్‌తో దక్కించుకుంది.
വരുന്നു, "സുമതി വളവ്". സെപ്റ്റംബർ 26 മുതൽ നമ്മുടെ ZEE5 മലയാളത്തിൽ#SumathiValavu Premieres 26th September on ZEE5#ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada pic.twitter.com/NGNr99ihOA
— ZEE5 Malayalam (@zee5malayalam) September 18, 2025
స్టోరీ ఏంటంటే?
డిఫరెంట్ స్టోరీ లైన్‌తో రియల్ సంఘటనల ఆధారంగా 'సుమతి వలవు' మూవీ తెరకెక్కింది. కేరళలోని తిరువనంతపురంలో ఓ రోడ్డు మలుపు వద్ద ఓ ప్రెగ్నెంట్ అమ్మాయి చనిపోయి దెయ్యంగా మారుతుంది. దీంతో అక్కడికి వచ్చిన వారికి ఏదో అదృశ్య శక్తి అక్కడ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లేందుకు ఎవరు సాహసం చేయరు. ఆ తర్వాత కొన్ని వరుస సంఘటనలు అదే ప్లేస్‌లో జరుగుతాయి. అసలు ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎలా చనిపోయింది? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. హారర్‌కు కామెడీ జోడించి అద్భుతంగా మూవీని రూపొందించారు.





















