Sshhh Web Series OTT Streaming: తెలుగులోకి వచ్చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Sshhh Web Series OTT Platform: తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకు బోల్డ్ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. 'ఆహా' ఓటీటీలో తాజాగా స్ట్రీమింగ్ అవుతోంది.

Sshhh Web Series OTT Streaming On Aha: హారర్, థ్రిల్లర్, రొమాంటిక్, కామెడీ ఇలా మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే కంటెంట్‌నే ఓటీటీలు ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నాయి. తమిళంలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న బోల్డ్ వెబ్ సిరీస్ తాజాగా తెలుగులో డబ్ అయ్యింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే..
ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో (Aha) బోల్డ్ వెబ్ సిరీస్ 'Sshhh' (ష్) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. లేడీ టీచర్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ రూపొందింది. తాజాగా, ఈ సిరీస్ తెలుగు డబ్‌తో అందుబాటులో ఉండగా.. ఫస్ట్ ఎపిసోడ్ టీజర్‌ను ఆహా రిలీజ్ చేసింది. 'వాళ్లు దాని గురించి మాట్లాడవద్దని చెప్పారు. మనం ఏమైనా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఆప్షన్ కాదు, అది చాలా అవసరం.' అని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. మొత్తం 4 ఎపిసోడ్లతో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
ఈ సిరీస్‌లో సోనియా అగర్వాల్ (Sonia Agarwal), ఇన్య, శ్రీకాంత్ నటించారు. నాలుగు వేర్వేరు కథల సమాహారంగా అంథాలజీ సిరీస్‌గా తెరకెక్కింది. మానవ సంబంధాలను అన్వేషించే స్టోరీస్ ఈ సిరీస్‌లో చూపించారు.
They told us not to talk about it. We’re talking anyway. Because sex education isn’t optional it’s essential.
— ahavideoin (@ahavideoIN) May 1, 2025
Watch #sshhh (telugu) only on aha pic.twitter.com/ZHqErWUeZz
నాలుగు ఎపిసోడ్స్ కలిసి డిఫరెంట్ స్టోరీస్‌తో ఈ సిరీస్ రూపొందించారు. ఇది గతేడాదే తమిళంలో రిలీజ్ అయ్యింది. తాజాగా తెలుగులో డబ్ చేశారు. ఓ సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయికి ఓ స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి సమయంలో ఆమె ఏం చేశారు?, పిల్లలకు అన్నీ సబ్జెక్టులతో పాటు ఇది కూడా ముఖ్యం అని చెప్పేలా.. ఇది ఆప్షనల్ కాదని.. తప్పనిసరి అని ఓ మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఫస్ట్ ఎపిసోడ్ రూపొందించారు.
తనకు ఇష్టం లేని ఓ పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి పడే ఇబ్బందులు.. ఇదే సమయంలో ఆమెకు మాజీ లవర్ ఎదురుపడితే జరిగే పరిణామాలేంటి? అనేది మరో ఎపిసోడ్‌లో చూపించారు. ఇక.. పెళ్లైన కొద్ది రోజులకే ఓ ఆపరేషన్ కోసం వెళ్లిన ఆర్మీ అధికారి అదృశ్యం అవుతాడు. దీంతో అతని భార్య ఆయన కోసం ఎదురుచూస్తుండగా తన పాత ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో పరిచయం అవుతాడు. దీంతో ఆమె జీవితంలో జరిగిన పరిణామాలేంటి? అనేది మరో ఎపిసోడ్.
ఇక చివరి ఎపిసోడ్‌లో ఐఏఎస్ కావాలని కలలు గనే ఓ యువకుడు.. ఓ అమ్మాయితో లవ్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? చివరికి ఏమైంది. అనేది చూపించారు.





















