By: ABP Desam | Updated at : 13 Jun 2022 03:46 PM (IST)
'స్క్విడ్ గేమ్' ఈజ్ రిటర్నింగ్ - గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్
లాక్ డౌన్ సమయంలో పాపులర్ అయిన వెబ్ సిరీస్ లలో 'స్క్విడ్ గేమ్' ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ ను ఇంగ్లీష్ లో కూడా స్ట్రీమింగ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా జనాలంతా చూశారు. ఈ సిరీస్ కి విపరీతమైన క్రేజ్ రావడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రాంతీయ భాషల్లో కూడా డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. 'స్క్విడ్ గేమ్' ఇచ్చిన థ్రిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓటీటీల్లో వ్యూస్ పరంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఈ సిరీస్.
ఒక్కో ఎపిసోడ్ తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది. ప్రతీ క్యారెక్టర్ కి ఆడియన్ కనెక్ట్ అవుతాడు. వయిలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సిరీస్ సక్సెస్ అయింది. ఇప్పుడు 'స్క్విడ్ గేమ్' మీద చాలా గేమ్స్ కూడా వస్తున్నాయి. ఈ సిరీస్ చూసిన వారంతా సీజన్ 2 ఎప్పుడు వస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పారు 'స్క్విడ్ గేమ్' దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యూక్. సెకండ్ సీజన్ కి సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని.. తొలిసీజన్ కి ధీటుగా సెకండ్ సీజన్ ఉంటుందని చెప్పారు. సీజన్ 2లో పాత క్యారెక్టర్స్ తో పాటు కొన్ని కొత్త పాత్రలు కూడా ఎంటర్ అవ్వబోతున్నాయి.
నిజానికి ఈ సిరీస్ కాన్సెప్ట్ షాకింగ్ గా ఉంటుంది. మల్టీ మిలియనీర్స్ అయిన కొందరు వ్యక్తులు.. డబ్బు అవసరం ఉన్న వారిని ఎన్నుకొని.. వారితో డేంజరస్ గేమ్స్ ఆడిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ గేమ్ ప్రాసెస్ ను చూసి ఎంజాయ్ చేస్తుంటారు మిలియనీర్స్. ఆ గేమ్స్ సాగే తీరు చాలా ఉత్కంఠంగా ఉంటుంది. సీజన్1 అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి సీజన్ 2 ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి!
Also Read: ఆరోజు 'పంజా' ఈరోజు 'మేజర్' - పవన్ మాటలకు అడివి శేష్ రిప్లై
Also Read: పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదు కానీ - సాయిపల్లవి కామెంట్స్
OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?
Surveen Chawla: ‘రానా నాయుడు’ బ్యూటీ సుర్వీన్ చావ్లా నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా?
Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!
Movie Releases This Week: ఉగాది కానుకగా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల