Show Time OTT Release: రెండు ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'షో టైమ్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Show Time OTT Platforms: యంగ్ హీరో నవీన్ చంద్ర లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'షో టైమ్' మరో ఓటీటీలోకి కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ కానుండగా మరో ఓటీటీలోకి రానుంది.

Naveen Chandra's Show Time OTT Release On SunNXT Amazon Prime Video: యంగ్ హీరో నవీన్ చంద్ర వరుస మూవీస్‌తో దూసుకెళ్తున్నారు. 'ఎలెవన్', 'బ్లైండ్ స్పాట్' మూవీస్ ఆడియన్స్‌కు మంచి థ్రిల్ పంచాయి. అదే క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో నవీన్ తాజాగా 'షో టైమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నెల 4న రిలీజ్ అయిన సినిమా అంతగా ఎలివేట్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
రెండు ఓటీటీల్లోకి...
ఈ మూవీని ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాజాగా మరో ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్'లోనూ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, డేట్ మాత్రం వెల్లడించలేదు. 'నిజం బయట పెట్టలేనంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు, మీరు ఎంతసేపు పరిగెత్తుతూనే ఉండగలరు?' అంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను నవీన్ చంద్ర షేర్ చేశారు. దీన్ని బట్టీ 'షో టైమ్' 2 ఓటీటీల్లో అందుబాటులో ఉండనుంది.
When the truth is too dangerous to reveal, how long can you keep running?#ShowTime, coming soon on Amazon Prime. @PrimeVideoIN#ShowTime #KamakshiBhaskarla @ItsActorNaresh @Rajaraveendar @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop… pic.twitter.com/Ptd0ilnxPG
— Actor Naveen Chandra (@Naveenc212) July 21, 2025
Also Read: ఎన్నాళ్లకెన్నాళ్లకు... స్టేజీపై 'వీరమల్లు' - పవన్ లుక్స్ అదుర్స్... వాచ్ ధర ఎంతో తెలుసా?
నవీన్ చంద్ర సరసన కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించగా... నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో కిషోర్ గరికపాటి నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
ఈ సినిమా ఒకే రోజులో ఓ ఇంట్లో సాగుతూ ఆద్యంతం థ్రిల్ పంచుతుంది. ఓ ఇంట్లో రాత్రి 11 గంటల టైంలో సూర్య (నవీన్ చంద్ర), శాంతి (కామాక్షి) తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటారు. అయితే, అక్కడకు సడన్‌గా వచ్చిన సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర) అర్ధరాత్రి న్యూసెన్స్ ఏంటంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో సూర్య, శాంతి ఇద్దరూ సీఐతో గొడవ పెట్టుకుంటారు. తమను ఏమైనా చేస్తాడేమోనని సూర్య భయపడతాడు.
అదే టైంలో ఊహించని విధంగా సూర్య, శాంతి ఇద్దరూ ఓ కేసులో ఇరుక్కుంటారు. అసలు సీఐకు వీరికి మధ్య ఏం జరిగింది? లాయర్ వరదరాజులు ఎందుకు వీరికి సహాయపడ్డాడు? సీఐకు, లాయర్‌కు సంబంధం ఏంటి? ఇద్దరూ కేసు నుంచి బయటపడ్డారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిదే.





















