అన్వేషించండి

Munjya OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన 'ముంజ్యా'... వంద కోట్ల హారర్‌ కామెడీ కావాలా, అయితే చూసేయండి

ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో హారర్ కామెడీల జోరు నడుస్తోంది. శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ ఫ్రాంచైజీలో తెరకెక్కిన మరో సినిమా 'ముంజ్యా'. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సినిమాటిక్‌ యూనివర్స్‌ల గురించి మీరు వినే ఉంటారు. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలోఇటువంటి యూనివర్స్‌లు చాలానే ఉన్నాయి. అయితే  మీకు మ్యాడ్‌ డాక్‌ సూపర్‌ నేచురల్‌ యూనివర్స్‌ గురించి తెలుసా? ఈ యూనివర్స్‌ 2018లో మొదలైంది. అందులో 'స్త్రీ 2' సినిమా వచ్చి రికార్డుల మీద రికార్డులు కొడుతోంది. అయితే ఇప్పుడు చెబుతున్నది ఆ సినిమా గురించి కాదు. ఆ యూనివర్స్‌లోనే తెరకెక్కిన మరో సినిమా ఓటీటీ విడుదల గురించి.

హాట్‌స్టార్ ఓటీటీలో 'ముంజ్యా' స్ట్రీమింగ్!
అభయ్‌ వర్మ, శర్వరీ వాఘ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన హిందీ చిత్రం 'ముంజ్యా'. యూనివర్స్‌కి పేరు తగ్గట్టుగా హారర్‌ కామెడీ జోనర్‌లోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. జూన్‌ 7న థియేటర్లలో విడుదలై భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సూపర్ సక్సెస్ కొట్టడమే కాదు, ఓటీటీలోనూ ఆ సక్సెస్ కంటిన్యూ చేస్తోంది. 

అసలు ఈ 'ముంజ్యా' సినిమా కథేంటంటే?
పుణెలో బిట్టు అనే కుర్రాడు సెలూన్‌లో పని చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుండి బేలా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. చదువు కోసం విదేశాలకు వెళ్లిన ఆమె తిరిగి వచ్చాక తన ప్రేమ గురించి చెబుదాం అనుకుంటాడు. కానీ అక్కడ ఆమె వేరకొరిని ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అదే సమయంలో బిట్టు తన బంధువుల వివాహం కోసం కొంకణ్‌ వెళ్తారు. అప్పటివరకు అతని కలల్లోకి వచ్చే పీపల్‌ చెట్టు అక్కడే ఉందని తెలుస్తుంది. ఆ దెయ్యాల చెట్టు వల్లే తన బంధువులు చాలా మంది చనిపోయారని బిట్టుకు తెలుస్తుంది.


అసలు ఇన్నాళ్లూ ఆ చెట్టు బిట్టు కలలోకి ఎందుకు వచ్చింది. దాని గురించి తెలిసిన తర్వాత బిట్టు ఏం చేశాడు, చెట్టు సంగతేంటి? అలాంటి ఆసక్తికర అంశాలతో సినిమా తెరకెక్కించింది. కావాల్సినంత వినోదం, మిస్టరీ, కొంత కామెడీ కూడా ఉండటంతో ఈ సినిమాకు థియేటర్లలో మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో కూడా ఆదరణ దక్కించుకుంటోంది. వినోదానికి తోడు చిన్నపాటి భయం కావాలి అనుకుంటే మీరు కూడా ఈ సినిమా చూడొచ్చు. సినిమా క్లైమాక్స్‌లో చిన్న సర్‌ప్రైజ్‌ కూడా ఉంటుంది అనుకోండి.

Also Read: డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వస్తే రెమ్యూనరేషన్ ఇచ్చేస్తానన్న హరీష్ శంకర్ - రూమర్లకు 'మిస్టర్ బచ్చన్' నిర్మాత చెక్!


బాక్సాఫీస్ బరిలో 100 కోట్లు కొల్లగొట్టిన సినిమా
రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిందిన ఈ సినిమా థియేటర్లలో రూ. 132 కోట్లు వసూళ్లు అందుకుని రూ. 100 కోట్ల సినిమాగా నిలిచింది. రీసెంట్‌గా థియేటర్లలో విడుదైన భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘స్త్రీ 2’ సినిమాకు దీనికి కూడా లింక్‌ ఉంది. ఆ సినిమానే కాదు మడ్యాడ్‌ డాక్‌ సూపర్‌నేచురల్‌ యూనివర్స్‌లో సినిమాలకు కూడా లింక్‌ ఉంటుంది. మరెందుకు ఆలస్యం డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో సినిమా చూసి మీ వీక్‌ను స్టార్ట్‌ చేసేయండి.

Also Readచిరంజీవి మంచి మనసుకు మరో సాక్ష్యం... సీనియర్‌ జర్నలిస్టు కష్టం తెలిసి గంటలో రెండు లక్షలు పంపి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget