Sarkaar 4 Latest Promo: ఆహా... హీటెక్కిస్తున్న పవన్ వర్సెస్ రోజా కామెంట్స్ - సుధీర్‌ను ఆటాడుకున్న Anasuya, బాబా భాస్కర్!
Pawan Kalyan Vs Roja: ఏపీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆహా ఓటీటీలోని 'సర్కార్ 4' గేమ్ షోలో హాట్ టాపిక్ అయ్యింది.
![Sarkaar 4 Latest Promo: ఆహా... హీటెక్కిస్తున్న పవన్ వర్సెస్ రోజా కామెంట్స్ - సుధీర్‌ను ఆటాడుకున్న Anasuya, బాబా భాస్కర్! Sarkaar 4 Latest Promo Watch Anasuya punch dialogues on Sudigali Sudheer Pawan Vs Roja Comments Sarkaar 4 Latest Promo: ఆహా... హీటెక్కిస్తున్న పవన్ వర్సెస్ రోజా కామెంట్స్ - సుధీర్‌ను ఆటాడుకున్న Anasuya, బాబా భాస్కర్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/7250bac56e72193e4a52b339c7e947d01719291187438313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికలు కనీవినీ ఎరుగని రీతిలో మాటల యుద్ధానికి దారి తీశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీ అధినేతలకు వైసీపీ నేతలు సవాళ్లు విసిరారు. నెట్టింట అవి వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని నటి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్ ఆహా గేమ్ షోలో కాక పుట్టించింది.
ఆహా ఓటీటీలో ఎన్నికల నేపథ్యంలో ప్రశ్నలు
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న గేమ్ షో 'సర్కార్'. ఇప్పుడు సీజన్ 4 నడుస్తోంది. దీనికి సుడిగాలి సుధీర్ హోస్ట్. లేటెస్టుగా 11వ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో 'ఈ ఎమ్మెల్యే ఎవరు అయితే ఉన్నారో? వాళ్ళ అన్నయ్య కూడా హీరోనే' అని ఒక ప్రశ్న అడిగాడు సుధీర్. ఆ తర్వాత బాలకృష్ణకు సంబంధించి మరొక ప్రశ్న అడిగారు. ప్రోమో చివర్లో పవన్ మీద రోజా చేసిన కామెంట్స్ చెప్పి ఊరుకున్నారు. మరి, ఆ ప్రశ్న ఏమిటి? అనేది ఆహాలో చూడాలి.
సుధీర్ ఆట కాదు... అతడిని ఆట ఆడించిన స్టార్స్!
'సర్కార్ 4'కు ఎవరు వచ్చినా సరే... వాళ్ళందరూ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)ను ఒక ఆట ఆడుకుంటున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కూడా అది కంటిన్యూ అయ్యింది.
'సర్కార్ 4' 11వ ఎపిసోడ్ కోసం అనసూయ భరద్వాజ్, డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్, సింగర్స్ మనో, గీతా మాధురిలను తీసుకు వచ్చారు. షోలో అనసూయ ఎంట్రీ ఇచ్చినప్పుడు 'ఏంటండీ మీరు ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చారు' అని సుధీర్ కాంప్లిమెంట్ ఇవ్వగా... 'యాంకర్ నువ్వు అని తెలియక' సెటైర్ వేసింది. ఆ తర్వాత వచ్చిన బాబా భాస్కర్ అయితే 'ప్రదీప్ ఎక్కడ' అంటూ కామెడీ చేశారు
Also Read: 'జబర్దస్త్' ఫైమా ముగ్గరితో ట్రాక్ నడిపిందా? ప్రవీణ్ కంటే ముందు అతడితో...
అసలేంటి సార్ ఈ ఫైరు..🔥ప్రోమో ఎండ్ లో ఇచ్చారు అసలైన ఫియరు..!
— ahavideoin (@ahavideoIN) June 24, 2024
Watch #SarkaarS4 Episode 11 PROMO
📷https://t.co/Cw83QMsP3J
@sudheeranand @anusuyakhasba @SingerGeethaMadhuri #SingerManu #BabaBhaskar @mostbet_india @ShaadiDotCom pic.twitter.com/AYcim8NGf3
లేటెస్టుగా ఈ షోకు వచ్చిన గెస్టులు అందరితో సుధీర్ ఇంతకు ముందు వర్క్ చేశాడు. 'జబర్దస్త్', 'ఢీ' వంటి వాటిలో వాళ్లకు పరిచయం ఉంది. ఆ చనువుతో అతడి మీద మరిన్ని పంచ్ డైలాగ్స్ వేశారు. సుధీర్ ప్లే బాయ్ ఇమేజ్ ఈ షోలో కూడా కంటిన్యూ అవుతోంది.
Also Read: టాప్ విప్పేసిన అనసూయ... ముద్దులతో అయేషా... ఏడ్చిన అమర్ దీప్... ఏందిరా మీ రచ్చ!
'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్' గేమ్ షో ప్రోమో... అందులో అనసూయ బ్లేజర్ విప్పడం వంటివి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. కొందరు ఆమె చేసిన పని మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. ఎప్పటిలా అనసూయ సమాధానాలు ఇస్తున్నారు. ఈ సమయంలో అనసూయ వచ్చిన ఈ షో కూడా పాపులర్ అయ్యేలా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)