OTT Telugu Movie: డైరెక్టుగా ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ETV Winలో హుషారు పోరి సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sammelanam OTT Platform: తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా 'సమ్మేళనం' స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తాజాగా ఈటీవీ విన్ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

తక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న కొన్ని కొత్త కొత్త సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. అందులో లవ్ జానర్లో వచ్చే సినిమాలపై యూత్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. తాజాగా మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ అఫిషియల్ గా వచ్చేసింది.
ఈటీవీ విన్ లో సినిమాల జాతర
ఫిబ్రవరి నెల మొత్తం ఏకంగా 40 సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అచ్చ తెలుగు ఓటీటీలలో ఒకటైన ఈటీవీ విన్ రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒక మూవీ ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. తాజాగా ఈటీవీ విన్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ 'సమ్మేళనం' స్ట్రీమింగ్ డేట్ ను రివిల్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఈటీవీ విన్ ఒరిజినల్ గా రాబోతున్న మూవీ 'సమ్మేళనం'. ఈ మూవీని ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నాం అన్న విషయాన్ని ఈటీవీ విన్ తాజాగా వెల్లడించింది.
"ప్రేమ, నవ్వులు, క్రేజీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, గందరగోళం స్టార్ట్... ఫిబ్రవరి 20 నుంచి ఈటీవీ విన్ లో సమ్మేళనం" అనే క్యాప్షన్ తో ఇవి మూవీ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇక ఆ పోస్టర్లో కొత్త నటీనటులు కనిపిస్తుండగా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాబట్టి స్టోరీపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పోస్టర్ ను చూస్తుంటే ఐదు మంది ప్రధాన పాత్రధారుల చుట్టూ సినిమా తిరుగుతున్నట్టు కనిపిస్తోంది.
View this post on Instagram
'సమ్మేళనం' రిలీజ్ డేట్ పోస్ట్ పోన్
వాస్తవానికి ఈటీవీ విన్ ఫిబ్రవరి నెలలో తమ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతున్న 40 సినిమాల లిస్ట్ ని ముందుగానే రిలీజ్ చేసింది. అందులో చాలా వరకు పాత సినిమాలు ఉంటే, కొన్ని కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ లో ఈ 'సమ్మేళనం' అనే ఒరిజినల్ మూవీ కూడా కనిపించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అందులో 'సమ్మేళనం' మూవీని ఫిబ్రవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ తాజా ప్రకటనలో మాత్రం ఫిబ్రవరి 13న కాకుండా ఫిబ్రవరి 20న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో 'సమ్మేళనం' మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 6 నుంచి ఈటీవీ విన్ లో సినిమాల జాతర మొదలు కాగా... 6వ తేదీనే మొత్తం 16 సినిమాలను ఈటీవీ విన్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసింది. ఇక ఫిబ్రవరి 20న ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అలాగే 28న 7 సినిమాలు ఈటీవీ విన్ లో అందుబాటులోకి రాబోతున్నాయి.
ఫిబ్రవరి 20న 15 సినిమాలు
తాజాగా ప్రకటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరి 'సమ్మేళనం'తో పాటు మరో 15 సినిమాలు ఫిబ్రవరి 15న ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ లిస్ట్ లో ఎవడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీరామదాసు, చింతకాయల రవి, స్టాలిన్, రామయ్య వస్తావయ్య, నాగవల్లి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మొగుడు, అదిరిందయ్యా చంద్రం, లవ్లీ, అదుర్స్, సోలో, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలు ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

