News
News
X

The Gray Man Sequel : 'ది గ్రే మ్యాన్'కు సీక్వెల్ - యాక్షన్ ప్రియులకు పండగే 

ర్యాన్ గోస్లింగ్ కథానాయకుడిగా నటించిన 'ది గ్రే మ్యాన్'కు సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు. 

FOLLOW US: 

ర్యాన్ గోస్లింగ్ (Ryan Gosling) కథానాయకుడిగా రూసో బ్రదర్స్ (Russo Brothers) ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా 'ది గ్రే మ్యాన్'. ఇందులో గ్లోబల్ యాక్టర్ ధనుష్ (Dhanush Hollywood Movie) ఓ పాత్రలో కనిపించారు. 'కెప్టెన్ అమెరికా' ఫేమ్ క్రిస్ ఇవాన్స్ విలన్ రోల్ చేశారు. అనా డి ఆర్మాస్ కీలక పాత్ర పోషించారు.

'ది గ్రే మ్యాన్' మూవీ (The Gray Man Movie) కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల అయ్యింది. యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంది. సుమారు 92 దేశాల్లో డిజిటల్ రిలీజ్ కాగా... అద్భుతమైన స్పందన లభించిందని చిత్ర బృందం పేర్కొంది. ఇప్పుడీ సినిమా అభిమానులకు ఒక గుడ్ న్యూస్.

'ది గ్రే మ్యాన్'కు సీక్వెల్ (The Gray Man Sequel) తీస్తున్నట్లు లేటెస్టుగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రూసో బ్రదర్స్ మాట్లాడుతూ ''ది గ్రే మ్యాన్'కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల అంచనాలను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆసక్తికరమైన పాత్రలు ఉన్న ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీలా... కొత్త గూఢచారి ప్రపంచంలా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్న ఆలోచన మాకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌తో పాటు మేము త్వరలో ప్రకటించబోయే మరో చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం'' అని చెప్పారు.

Also Read : శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం - అంచనాల సరిహద్దులు చెరిపేస్తూ 'బింబిసార' రిలీజ్ ట్రైలర్

మార్క్ గ్రీనే రాసిన 'ది గ్రే మ్యాన్' బుక్ ఆధారంగా ఈ సినిమా సిరీస్ తెరకెక్కుతోంది. 'ది గ్రే మ్యాన్' చిత్రానికి పని చేసిన కో - రైటర్ స్టీఫెన్ ఇప్పుడీ సీక్వెల్‌కు కూడా వర్క్ చేయనున్నారు. పాపులర్ స్క్రీన్ రైటర్స్ పాల్ వెర్నిక్, రెట్ రీస్ 'ది గ్రే మ్యాన్' ప్రపంచంలో మరో కొత్త కోణం చూపించడానికి రెడీ అవుతున్నారు.

Also  Read : వాళ్ళ హార్ట్ బ్రేక్ చేయడం ఇష్టం లేదు - పెళ్లి గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

View this post on Instagram
 
A post shared by ABP Desam (@abpdesam)

Published at : 27 Jul 2022 05:29 PM (IST) Tags: dhanush Ryan Gosling russo brothers The Gray Man Sequel

సంబంధిత కథనాలు

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Whats On OTT This Week : తెలుగు 'హైవే', 'తమిళ్ రాకర్స్', హాలీవుడ్ 'షి హల్క్' - ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే

Whats On OTT This Week : తెలుగు 'హైవే', 'తమిళ్ రాకర్స్', హాలీవుడ్ 'షి హల్క్' - ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Hello World Web Series Review - హలో వరల్డ్ రివ్యూ: ఆర్యన్ రాజేష్, సదా నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Hello World Web Series Review - హలో వరల్డ్ రివ్యూ: ఆర్యన్ రాజేష్, సదా నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్