Rekhachithram OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'రేఖాచిత్రం' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా..?, మర్డర్ మిస్టరీ తెలుగులోనూ చూసేయండి!
Rekhachithram OTT Platform: ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రేఖాచిత్రం' ఓటీటీలోకి వచ్చేసింది. సోనీ లివ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.

Asif Ali's Rekhachithram Mystery Thriller OTT Streaming On SonyLIV: క్రైమ్, హారర్, మిస్టరీ థ్రిల్లర్ కంటెంట్‌పై ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న క్రమంలో మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాదిలో మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మూవీ 'రేఖా చిత్రం' (Rekhachithram). ఈ సినిమా శుక్రవారం నుంచి 'సోనీ లివ్' (SonyLIV) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. 'కొన్ని రహస్యాలు మసకబారడం లేదు' అంటూ సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. జోఫిన్ టి చాకో దర్శకత్వం వహించిన సినిమాలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. రూ.6 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.55 కోట్లకు పైగా వసూలు చేసింది. మలయాళ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు సృష్టించింది. ఆసిఫ్ అలీ ఇటీవలే 'కిష్కింద కాండం' మూవీతో మరో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇది కూడా మర్డర్ మిస్టరీగా రూపొందగా.. బాక్సాఫీస్ వద్ద రూ.77 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
Some secrets refuse to fade away.
— Sony LIV (@SonyLIV) March 6, 2025
Experience #Rekhachithram, now streaming on SonyLIV!#Rekhachithram #AsifAli #AneswaraRajan #JofinTChacko #ManojKJayan #ZarinShihab #BhamaArun #meghathomaslatest pic.twitter.com/7g4F6gllId
Also Read: ఈ రోజు (శుక్రవారం, మార్చి 07) టీవీలలో వచ్చే సినిమాలు ఇవే... ఆ ఐదూ అస్సలు మిస్ కావొద్దు
'రేఖాచిత్రం' మర్డర్ మిస్టరీ కథేంటంటే..?
నగరంలో సీఐ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) ఓ ఆత్మహత్య కేసును విచారిస్తుంటాడు. అయితే, అతను ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అవుతాడు. అనంతరం ఉన్నతాధికారులు అతన్ని అటవీ ప్రాంతానికి బదిలీ చేస్తారు. ఈ సూసైడ్ కోసం కోసం మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సీఐ కేసు విచారణ క్రమంలో 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో తాజా హత్యకు లింక్ ఉన్న విషయాన్ని గుర్తిస్తాడు. 1985 టైంలో ఓ షూటింగ్ లోకేషన్ నుంచి ఓ బాలిక కూడా మిస్ అవుతుంది. ఆ కేస్ కూడా గోపీనాథ్ దగ్గరకి చేరుతుంది. అయితే ఇలా ఒక్క కేసుకే ఎన్నో ట్విస్టులు ఉంటాయి. అసలు 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఇప్పటి ఆత్మహత్యకు సంబంధమేంటి? ఆ అమ్మాయి ఎలా తప్పిపోయింది? ఫైనల్‌గా ఆ చిక్కు ముడులను విప్పి, ఈ కేసును సీఐ ఎలా చేధించాడు ? అనేది తెలియాలంటే 'రేఖా చిత్రం' మూవీని చూడాల్సిందే. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఊహించని విధంగా ఉంటుంది. మరి ఆ థ్రిల్లింగ్ మీకూ కావాలంటే వెంటనే సినిమాను 'సోనీలివ్' ఓటీటీలో చూసేయండి.
Also Read: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన విశ్వక్ సేన్ 'లైలా' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

