Rekhachithram OTT release date: ఓటీటీలోకి దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్... తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Rekhachithram OTT Platform : 2025లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ మర్డర్ మిస్టరీ 'రేఖాచిత్రం' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయ్యింది.

Mammootty and Asif Ali's Rekhachithram digital streaming date locked: 2025లో మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ 'రేఖా చిత్రం'. ఇటీవల కాలంలో మాలీవుడ్ సరైన హిట్స్ లేక, నష్టాలతో సతమతమవుతుంటే 'రేఖా చిత్రం' మాత్రం తక్కువ బడ్జెట్ తో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టడానికి సిద్ధం అవుతోంది.
'రేఖా చిత్రం' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్...
సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మలయాళ మర్డర్ మిస్టరీ 'రేఖా చిత్రం' మూవీని ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే రిలీజ్ అయిన రెండు నెలల గ్యాప్ తర్వాత ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా 'రేఖా చిత్రం' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మార్చ్ 14 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది.
మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన 'రేఖా చిత్రం' మూవీలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో 2025 లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. కేవలం 6 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ మూవీ, కలెక్షన్లు మాత్రం రూ.55 కోట్లకు పైగా రాబట్టింది. అయితే ఆసిఫ్ అలీ ఇటీవల కాలంలో 'కిష్కింద కాండం' మూవీతో మరో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇది కూడా మర్డర్ మిస్టరీగా రూపొందగా, రూ. 77 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
'రేఖా చిత్రం' స్టోరీ ఇదే
సిఐ వివేక్ గోపీనాథ్ ఒక ఆత్మహత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. నిజానికి అతను ఆన్లైన్ రమ్మీ ఆడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోతాడు. దీంతో అతన్ని సస్పెండ్ చేసి, అటవీ ప్రాంతానికి బదిలీ చేస్తారు. ఈ క్రమంలో 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో తాజా హత్యకు లింక్ ఉన్న విషయాన్ని ఆయన కనిపెడతాడు. 1985 టైంలో ఓ షూటింగ్ లోకేషన్ నుంచి బాలిక కూడా మిస్ అవుతుంది. ఆ కేస్ కూడా గోపీనాథ్ దగ్గరకి చేరుతుంది. అయితే ఇలా ఒక్క కేసుకే ఎన్నో మలుపులు ఉంటాయి. అసలు 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఇప్పటి ఆత్మహత్యకు సంబంధమేంటి? ఆ అమ్మాయి ఎలా తప్పిపోయింది? ఫైనల్ గా ఆ చిక్కు ముడులను విప్పి, ఈ కేసును ఆయన ఎలా చేధించాడు ? అనేది తెలియాలంటే 'రేఖా చిత్రం' మూవీని చూడాల్సిందే. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ట్విస్ట్ లు, టర్న్ లతో ఊహించని విధంగా ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

