అన్వేషించండి

Animal Movie: ‘అన్‌స్టాపబుల్’ షోకు ‘యానిమల్’ హీరో, నెట్టింట్లో బాలయ్య - రణబీర్ ఫోటో వైరల్

Animal Movie: ర‌ణ్‌బీర్‌ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'యానిమల్'. ఈ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చిన రణబీర్ బాలయ్య టాక్ షోలో పాల్గొన్నారు.

Ranbir Kapoor Balakrishna : 'అర్జున్ రెడ్డి' సినిమాతో సందీప్ రెడ్డి వంగా సంచలన విజయం అందుకున్నారు. స్టోరీ టెల్లింగ్ పరంగా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి, అక్కడా భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ర‌ణ్‌బీర్‌ కపూర్ హీరోగా 'యానిమల్' సినిమా  చేస్తున్నారు.  ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీపై బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో విడుదల చేసి మాంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలని దర్శకుడు భావిస్తున్నారు.

ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసిన చిత్రబృందం

డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే హీరో రణబీర్ కపూర్ ముంబై నుంచి హైదరాబాద్ లో అడుగు పెట్టారు. ‘బ్రహ్మాస్త’ సినిమాతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన, ఈ సినిమాతో మరింత ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని భావిస్తున్నారు.  అందుకే ‘యానిమల్’ సినిమాను గట్టిగా ప్రమోట్ చేయబోతున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా పలు రియాలిటీ షోలతో పాటు టాక్ షోలలోనూ పాల్గొనబోతున్నారు.

‘అన్ స్టాపబుల్’ షోలో పాల్గొన్న రణబీర్

ప్రస్తుతం తెలుగులో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో కొనసాగుతోంది. ‘యానిమల్’ ప్రమోషన్ లో భాగంగా ఆయన ‘బిగ్ బాస్’ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అటు బాలయ్య హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో పాల్గొన్నారు. బాలయ్యతో కలిసి ఈ షోలో సందడి చేశారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘యానిమల్’ సినిమాలో భీకరంగా కనిపించిన రణబీర్ బాలయ్యను కలిసిన సందర్భంగా చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే రణబీర్ తో బాలయ్య ఇంటర్వ్యూ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. బాలయ్య, రణబీర్ టాక్ షో చాలా ఫన్నీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రణబీర్ ను బాలయ్య ఏ ప్రశ్నలు అడిగారు? ఆయన ఏం చెప్పారు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు సరిగా రాని రణబీర్ తో బాలయ్య హిందీలో ఎలా మాట్లాడారు? రణబీర్ తెలుగు ఎలా మాట్లాడారు? అనేది తెలుసుకునేందుకు ఆత్రంగా చూస్తున్నారు. ఈ షో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ కాగా, ఇకపై జాతీయ స్థాయిలో పాపులర్ కానుంది.  

డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

అటు ‘యానిమల్’ మూవీ డిసెంబరు 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్‌, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని కలసి నిర్మిస్తున్నారు.

Read Also: స్విమ్ సూట్ ఫోటోలు పంపితే, సిస్టర్ క్యారెక్టర్ చేయమన్నారు: ‘భారతీయుడు’ సినిమాపై సీరియల్ నటి నటి కస్తూరి కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Embed widget