News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి సీజన్ 3 పై అప్డేట్ ఇచ్చింది.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ది ఫ్యామిలీ మెన్'(The Family Man) వెబ్ సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యాయి. మూడో సీజన్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో 'ఫ్యామిలీ మెన్ సీజన్ 3' కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఇటీవల ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణికి ఫ్యామిలీ మెన్ సీజన్ 3 ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురవగా, ఆమె బదులిస్తూ.." రాజ్ అండ్ డీకే సార్ నిన్నే ఫ్యామిలీ మెన్ సీజన్ 3 గురించి నాకు చెప్పారు. త్వరలోనే సీజన్ 3 రాబోతుందని. కాబట్టి దానికోసం వేచి ఉండండి" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

ఆ తర్వాత ప్రియమణి మాట్లాడుతూ.." రాజ్ అండ్ డీకే సార్ 'ఫర్జీ'(Ferzi) సిరీస్ కోసం పనిచేస్తున్నప్పుడు నేను వారిని కలిశాను. అప్పటినుంచి సీజన్ 3 ఎప్పుడు వస్తుందని అడుగుతూనే ఉన్నాను. దానికి వాళ్లు త్వరలో.. త్వరలో.. త్వరలో.  వస్తుందని చెబుతూ వస్తున్నారు. కచ్చితంగా చెప్పాలంటే సీజన్ 3 షూటింగ్ ని వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నాం" అంటూ చెప్పుకొచ్చింది. ప్రియమణి చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెడితే అదే ఎడాది చివర్లో 'ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3' రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రియమణి 'జవాన్' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించారు. ప్రియమణి మరో ప్రధాన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఆమెతో పాటు సానియా మల్హోత్రా, ఆలియా ఖురేషి, లేహర్ ఖాన్ తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రూ.1000కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

'పఠాన్' తర్వాత ఇదే ఏడాది 'జవాన్' తో షారుక్ కి మరో వెయ్యి కోట్ల సినిమా పడడంతో షారుఖ్ ఫ్యాన్స్ డైరెక్టర్ అట్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు సెలబ్రిటీస్ కూడా జవాన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇండియా వైడ్ గా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

మరోవైపు 'జవాన్' తర్వాత ప్రియమణి మరో బాలీవుడ్ మూవీ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అజయ్ దేవగన్ నటిస్తున్న 'మైదాన్' సినిమాలో ప్రియమణి నటిస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది." అజయ్ సార్ మైదాన్ లో ఓ కీలక పాత్ర చేస్తున్నా. రీసెంట్ గా నా పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశా. ఈ సినిమా షూటింగ్ అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేను. అజయ్, అమిత్ సార్ లతో కలిసి పని చేయడం నాకు చాలా బాగా నచ్చింది" అంటూ ప్రియమణి తెలిపారు.

Also Read : అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 22 Sep 2023 07:11 PM (IST) Tags: Priyamani raj and dk The Family Man Web Series The Family Man Season 3 Manoj Bajpai Priyamani About Family Man Season 3

ఇవి కూడా చూడండి

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Hi Nanna OTT Release: హాయ్ నాన్న ఓటీటీ డీల్ క్లోజ్ - డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?

Hi Nanna OTT Release: హాయ్ నాన్న ఓటీటీ డీల్ క్లోజ్ - డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?

Animal OTT Release: 'యానిమల్' ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? అసలు నిజం ఏమిటంటే? 

Animal OTT Release: 'యానిమల్' ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? అసలు నిజం ఏమిటంటే? 

టాప్ స్టోరీస్

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni YSRCP :  మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా  - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Naa Saami Ranga song: నా సామి రంగ - మాసీ & క్యాచీ సాంగ్‌తో వచ్చిన నాగార్జున

Naa Saami Ranga song: నా సామి రంగ - మాసీ & క్యాచీ సాంగ్‌తో వచ్చిన నాగార్జున

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా