By: ABP Desam | Updated at : 22 Sep 2023 05:19 PM (IST)
Photo Credit : Sai Pallavi/Instagram
సినిమా ఇండస్ట్రీ అన్నాక హీరో హీరోయిన్ల పై గాసిప్స్ రావడం సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్లు ఎవరితోనైనా కొద్దిగా క్లోజ్ గా మూవ్ అయితే గాసిప్ రాయుళ్లు వాళ్లకి ఎఫైర్లు అంటగడతూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాక ఈ గాసిప్స్ కి హద్దు పద్దు లేకుండా పోయింది. సెలబ్రెటీల ఫోటోలను తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఇష్టం వచ్చిన కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. గత మూడు రోజుల నుంచి సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందన్న వార్తలు నెట్టింట తెగ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
ఓ డైరెక్టర్ ని సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, అందుకు సంబంధించిన ఫోటో ఇదే అని, వారిద్దరూ దండలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కొందరు షేర్ చేసి వైరల్ చేశారు. దీంతో చాలామంది నిజంగానే సాయి పల్లవి పెళ్ళి అయిపోయిందని నమ్మేశారు. అసలు ఆ ఫోటోలో ఉన్న దర్శకుడు ఎవరరో కూడా పట్టించుకోలేదు? అసలు విషయం ఏంటంటే, ఆ ఫోటో ఓ సినిమా పూజా కార్యక్రమంలో భాగంగా తీసింది. ఆ ఫోటోలో ఉన్న దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. తమిళ ఇండస్ట్రీలో ఓ సినిమాకి పూజా కార్యక్రమం చేస్తున్నారంటే చిత్ర యూనిట్ మొత్తానికి దండలు వేసి.. పండితులు వారిని ఆశీర్వదిస్తారు.
Honestly, I don’t care for Rumours but when it involves friends who are family, I have to speak up.
— Sai Pallavi (@Sai_Pallavi92) September 22, 2023
An image from my film’s pooja ceremony was intentionally cropped and circulated with paid bots & disgusting intentions.
When I have pleasant announcements to share on my work…
అలా చిత్ర బృందం మొత్తం నిలబడి ఉన్న ఫోటోలో కేవలం డైరెక్టర్, సాయి పల్లవి ఫోటోలు కట్ చేసి పెళ్లి ఫోటోగా చిత్రీకరించారు. దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఎట్టకేలకు ఈ న్యూస్ పై సాయి పల్లవి రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.. "నిజం చెప్పాలంటే నేను రూమర్స్ ని పెద్దగా పట్టించుకోను. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితుల జోలికొస్తే నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి పెయిడ్ బోట్స్‌తో ప్రచారం చేయడం పూర్తిగా నీచమైంది" అంటూ తన ట్విట్టర్లో రాస్కొచ్చింది సాయి పల్లవి.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక 'ఫిదా' సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమా తోనే తన నటనతో అందరిని ఫిదా చేసింది. ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'పడి పడి లేచే మనసు' 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్', 'విరాటపర్వం' వంటి సినిమాలతో అగ్ర హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరగా 'గార్గి' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగచైతన్య సరసన మరోసారి జోడీ కట్టనుంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.
Also Read : ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Chitra Shukla Marriage: పెళ్లి పీటలెక్కిన ‘సిల్లీ ఫెలోస్’ బ్యూటీ, పోలీస్ అధికారితో ఏడడుగులు!
Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!
Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?
Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
/body>