అన్వేషించండి

Nivetha Pethuraj: ఆ వీడియో చూసి అమ్మ తిట్టింది.. వాళ్లతో నీకెందుకు అంది: నివేద పేతురాజు

'ప‌రువు'.. నివేదా పేతురాజ్ న‌టించిన ఈ వెబ్ సిరీస్ జూన్ 14న స్ట్రీమింగ్ కానుంది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు నివేద‌. గ‌తంలో వైర‌ల్ అయిన వీడియో గురించి చెప్పారు ఆమె.

Nivetha Pethuraj About Viral Video: నివేద పేతురాజు, నరేష్‌ అగస్త్య కీలక పాత్రల్లో న‌టించిన వెబ్ సిరీస్ 'ప‌రువు'. జూన్ 14న జీ తెలుగు ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మెగాస్టార్‌ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సిరీస్ ని ప్రొడ్యూస్ చేశారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కింది ఈ సిరీస్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైద‌రాబాద్ లో నిర్వ‌హించింది సినిమా టీమ్. ఈ సంద‌ర్భంగా నివేదా పేతురాజు గ‌తంలో వైర‌ల్ అయిన వీడియో గురించి మాట్లాడారు. త‌న‌కు చాలా కాల్స్ వ‌చ్చాయ‌ని, అమ్మ కూడా ఫోన్ చేసి తిట్టార‌ని చెప్పుకొచ్చారు. ఆమె ఏమ‌న్నారంటే? 

మీరే నాకు స్ఫూర్తి.. 

వెబ్ సిరీస్ లు చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అని, అలాంటిది సుస్మిత గారు ధైర్యం చేశార‌ని అన్నారు నివేద‌. ఈ సంద‌ర్భంగా ఆమె సిరీస్ గురించి మాట్లాడుతు.. "గోల్డ్ బాక్స్, సుస్మిత గారికి చాలా చాలా థ్యాంక్స్. వెబ్ సిరీస్ చేయ‌డం అనేది చాలా క‌ష్టం. ఇలాంటి ఒక స్టోరీని ఎంపిక చేసుకోవ‌డం ఇంకా క‌ష్టం. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. సినిమా ఫీల్డ్ లో, ప‌ర్స‌న‌ల్ గా, చాలా విష‌యాల్లో మీరే నాకు స్ఫూర్తి. దీనికంటే ముందు నేను హిందీలో ఒక వెబ్ సిరీస్ చేశాను. అది నాకు చాలా క‌ష్టంగా అనిపించేది. స్టోరీని అర్థం చేసుకోవ‌డం ఇబ్బంది ప‌డేదాన్ని. క్యారెక్ట‌ర్ నుంచి డీవీయేట్ అయ్యేదాన్ని. కానీ, సిదార్థ‌, రాజ్ మీరు అద్భుతంగా రాశారు. నేను మిమ్మ‌ల్ని గుడ్డిగా న‌మ్మాను. ఔట్ పుట్ చాలా చాలా సూప‌ర్ గా వ‌చ్చింది. ఒక యాక్ట‌ర్ గా ప‌రువులో చేసిన డాలీ క్యారెక్ట‌ర్ ఎప్ప‌టికీ నా ఫేవ‌రెట్" అని చెప్పారు నివేద‌. 

చాలామంది కాల్స్ చేశారు.. 

'ప‌రువు' ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నివేదాకి సంబంధించి ఒక వీడియో గ‌తంలో వైర‌ల్ అయ్యింది. ఆమె కారు డిక్కీని ఓపెన్ చేయ‌మ‌ని పోలీసులు అడిగితే తెర‌వ‌కుండా వాళ్ల‌తో గొడ‌వ పెట్టుకుంది. నిజంగానే నివేదా అలా పోలీసుల‌తో గొడ‌వ ప‌డింది అనుకున్నారు అంద‌రూ. కానీ, అది 'ప‌రువు' ప్ర‌మోషన్స్ కోసం తీసిన వీడియో అని త‌ర్వాత జీ క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోపై స్పందించారు నివేద‌. వీడియో చూసి ఎవ‌రైనా కాల్స్ చేశారా? ఎలాంటి కామెంట్లు పెట్టారు అని అడిగిన దానికి ఆమె చాలా కాల్స్ వ‌చ్చాయ‌ని, త‌న త‌ల్లి కూడా కాల్ చేసింద‌ని చెప్పారు.  

"ఆ వీడియో ఐడియా శ్వేతది. నిజానికి హైద‌రాబాద్ లో చేద్దాం అనుకున్నాం ఆ వీడియో. చెన్నైలో చేయాల్సి వ‌చ్చింది. అనుకున్న‌దానికంటే బాగా వైర‌ల్ అయ్యింది. నేను మాములుగా ఒక వైట్ డ్రెస్ లో ఉన్నాను. క‌నీసం మేక‌ప్ కూడా చేసుకోలేదు. దీంతో అంద‌రూ నిజం అని న‌మ్మేశారు. చాలామంది కాల్ చేశారు. మా అమ్మ కూడా కాల్ చేశారు. పోలీసుల‌తో నీకు ఎందుకు గొడవ? అని అన్నారు. అప్పుడు చెప్పాను ప‌రువు ప్ర‌మోష‌న్ కోసం అది అని అన్నాను. చాలా చాలా కాల్స్ వ‌చ్చాయి. థ్యాంక్యూ జీ టీమ్. నిజానికి నా కార్ డిక్కీలో అంతా ట్రాష్ ఉంటుంది. బాటిల్స్.. అదే వాట‌ర్ బాటిల్స్ ఉంటాయి" అని వీడియోపై స్పందించారు నివేద‌. 

Also Read: మనుషులను చంపి, వారి మాంసాన్ని అమ్మే భార్యభర్తలు - ఈ ఆఫర్ వెజిటేరియన్లకు మాత్రమే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh OTT : ఓటీటీలో ఉస్తాద్ భగత్ సింగ్ - స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
ఓటీటీలో ఉస్తాద్ భగత్ సింగ్ - స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
This Week OTT Movies : మంత్ ఎండ్ ఓటీటీ మూవీస్ సందడి - ఒకే రోజు 13 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి వెరీ స్పెషల్
మంత్ ఎండ్ ఓటీటీ మూవీస్ సందడి - ఒకే రోజు 13 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి వెరీ స్పెషల్
Band Melam OTT : ఆ ఓటీటీలోకి బ్యాండ్ మేళం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి బ్యాండ్ మేళం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Most Cheapest Diesel SUVs: దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
Embed widget