అన్వేషించండి

OTT New Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన 23 సినిమాలు, 11 వెబ్ సిరీస్‌లు... ఆ మూడు సినిమాలు, రెండు సిరీస్‌లు అస్సలు మిస్ కావొద్దు

What to watch on OTT this Weekend: ఈ ఏడాది దీపావళి సూపర్ హిట్స్ తో పాటు ఈ వారంలో ఓటీటీల్లో విడుదలైన తెలుగు, తమిళ, హాలీవుడ్, బాలీవుడ్ వెబ్ సిరీస్ లు , సినిమాలేంటో చూసేయండి

ఈ ఏడాది దీపావళి బాక్సాఫీస్ కు ఎప్పుడూ లేనంత జోష్ తీసుకొచ్చింది. దుల్కర్ సల్మాన్ ను వంద కోట్ల క్లబ్  లో చేర్చింది. ఇక, హీరో కిరణ్ అబ్బవరం ను 50 కోట్ల మార్క్ ను దాటించింది.  ఈ వారమే ఓటీటీలో విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ‘లక్కీ భాస్కర్’ సినిమా సీన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటితో పాటు హాలీవుడ్, బాలీవుడ్, తమిళం, తెలుగు మలయాళ వెబ్ సిరీస్ లు, సినిమాలు కూడా ఈ వారం ఓటీటీ ల్లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. అవేంటో చూసేద్దాం...

స్మార్ట్ అండ్ లక్కీ భాస్కర్: సినిమా టైటిల్ కు తగ్గట్టే ఇందులో భాస్కర్ చాలా లక్కీ. కుటుంబం గురించి రిస్క్ తీసుకొని, సాధారణ బ్యాంక్ ఉద్యోగి స్థాయి నుంచి కోటీశ్వరడవుతాడు. జూదం ఆడాడు. గెలిచాడు. కానీ ఎక్కడ ఆపాలో తెలుసుకున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా, హీరో దుల్కర్ సల్మాన్ ను  100 కోట్ల క్లబ్ లో చేర్చింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఈటీవీ విన్ ఓటీటీలో 50 కోట్ల ‘క’: చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ‘క’ తో 50 కోట్ల క్లబ్ లో చేరాడు హీరో కిరణ్ అబ్బవరం. సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఈ వారమే ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది. క్లయిమ్యాక్స్ ట్విస్ట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

ఆహాలో న్యూస్ ప్రెజెంటర్ న్యూ సెన్స్: ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమైన మలయాళ హీరోల్లో టొవినో థామస్ ఒకరు. ఆయన నటించిన ‘2018’, ‘మిన్నల్ మురళి’, ‘అన్వేషిప్పిన్ కండెత్తుమ్’, ‘తల్లుమల’ చిత్రాలు ఆయనకు మంచి గుర్తంపు తీసుకొచ్చాయి. ఆయన హీరోగా నటించిన ‘నారదన్’ అనే మలయాళ సినిమా తెలుగు వెర్షన్ రెండేళ్ల తర్వాత ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అదే ‘నారదన్’. ఇందులో ఆయన ఓ టీవీ జర్నలిస్ట్ గా నటించారు. ఆషిక్ అబు దర్శకుడు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ సినిమా: తమిళ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేమ్) కి చాన్నాళ్ల తర్వాత థియేటరికల్ హిట్ ఇచ్చిన సినిమా ‘అంధగాన్’. శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన ‘అంధాదూన్’(2018) సినిమాకు తమిళ్ రీమేక్ ఇది. కోవిడ్ కారణంగా పలు సార్లు చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాది ఆగస్టు లో థియేటర్లలో విడుదలై, విజయం సాధించింది. ప్రశాంత్, సిమ్రాన్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రశాంత్ తండ్రి, నటుడు, దర్శకుడు త్యాగరాజన్ ఈ తమిళ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా, రెండేళ్ల క్రితం, నితిన్ హీరోగా ‘అంధాదూన్’ తెలుగు వెర్షన్ ను ‘మాస్టర్’ పేరుతో దర్శకుడు మేర్లపాక గాంధీ రీమేక్ చేశారు. 

అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళ సినిమా: కేరళలోని గోపాలపుర అనే పల్లెటూరు లో జరిగే కథగా తెరకెక్కిన చిత్రం ‘పొరట్టు నడమ్’. పొలిటికల్ సెటైర్ గా ఈ సినిమా రూపొందింది. అంత్యాక్షరి గరుడన్ చిత్రాల ఫేమ్ సైజు గోవింద కురూప్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఆహా తెలుగు ఓటీటీలో హెబ్బా పటేల్ సినిమా: కుమారి 24 ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ హెబ్బా పటేల్. ఆ సినిమా సూపర్ హిట్ అయినా తర్వాతి సినిమా లన్నీ ఆమెకు ఫెయిలూర్స్ తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన ‘సందేహం’ అనే సినిమా విడుదలైంది. ఐదు నెలల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. భార్య భర్తల చుట్టూ జరిగే క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సతీష్ పరమవేద. హీరో సుమన్ తేజ్ ఇందులో ద్రిపాత్రాభినయం చేశారు. సుభశ్రీ, శ్వేతా వర్మ కీలక రోల్స్ చేశారు.

ఆహా ఓటీటీలో తమిళ్ లస్ట్ స్టోరీస్: నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ సూపర్ హిట్ అయ్యక, అదే బోల్డ్ కంటెంట్ తరహా లోనే చాలా వెబ్ సిరీస్ లు, షోలు వస్తూనే ఉన్నాయి. ఆ ట్రెండ్ నే  ఫాలో అవుతూ పృథ్వీ ఆదిత్య, వాలిమోహన్ దాస్, హరీశ్ , కార్తికేయన్ ఈ తమిళ వెబ్ సిరీస్ లోని ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆహా లో ఈ వెబ్ సిరీస్ లోని  నాలుగు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. శ్రీరామ్, సోనియా అగర్వాల్, ఇనేయా, ఐశ్వరా దత్త, మైమ్ గోపీ ప్రధాన పాత్రలు పోషించారు.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తమన్నా సినిమా డైరెక్ట్ రిలీజ్: ప్రస్తుతం తమన్నా నటించిన ఏ సినిమాలూ విజయాలకు ఆమడ దూరంలో ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమెకు కాస్త పేరు తెచ్చిన సినిమా రజినీకాంత్ ‘జైలర్’ మాత్రమే. గత ఏడాదే తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తో ‘లస్ట్ సోరీస్ 2’ లోనూ నటించారు.  తాజాగా ఆమె నటించిన ఓ కొత్త హిందీ సినిమా నేరుగా ఓటీటీ లోకి విడుదల అయింది. అదే ‘సికిందర్ కా ముఖాదర్’. తమన్నా కథానాయికగా నటించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ కు బేబీ ఫేమ్ నీరజ్ పాండే దర్శకుడు. తమన్నా కెరీర్ లో నేరుగా ఓటీటీలోకి విడుదలైన సినిమా ఇదే. జిమ్మీ షర్గిల్, అవినాశ్ తివారి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఆశించినంతగా లేదని ఓటీటీ వ్యూయర్స్ రివ్యూలు ఇస్తున్నారు. జీ5 ఓటీటీలో విడుదలైన నరేష్ ఆగస్త్య, మేఘా ఆకాష్‌ల 'వికటకవి' వెబ్ సిరీస్‌ మంచి స్పందన తెచ్చుకుంది.

Also Read: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా

బోర్డర్ ల్యాండ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో

చెస్ట్ నట్ (ఇంగ్లిష్)- అమెజాన్ ప్రైమ్ వీడియో

హార్ట్ బీట్స్ (హిందీ)- అమెజాన్ ప్రైమ్ వీడియో

జీన్ డు బ్యారీ ద కింగ్స్ లవర్ (ఇంగ్లిష్)- అమెజాన్ ప్రైమ్ వీడియో

ద పార్క్ మేనియాక్ (బ్రెజిల్) - అమెజాన్ ప్రైమ్ వీడియో

అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లిష్)- నెట్ ఫ్లిక్స్

ఎ ప్యారిస్ క్రిస్మస్ వాల్జ్ (ఇంగ్లిష్)- నెట్ ఫ్లిక్స్

క్రిస్మస్ ఆన్ విండ్ మిల్ వే (ఇంగ్లిష్)- నెట్ ఫ్లిక్స్

ఇట్వస్ ద టెక్స్ట్ బిఫోర్ ద క్రిస్మస్ (ఇంగ్లిష్)- నెట్ ఫ్లిక్స్

ఎ రాయల్ డేట్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లిష్)- నెట్ ఫ్లిక్స్

బ్రింగింగ్ క్రిస్మస్ హోమ్ (ఇంగ్లిష్)- నెట్ ఫ్లిక్స్

ద ట్రంక్ (కొరియన్ వెబ్ సిరీస్)- నెట్ ఫ్లిక్స్

ద మ్యాడ్ నెస్ (కొరియన్ వెబ్ సిరీస్)- నెట్ ఫ్లిక్స్

ఆసఫ్ (వెబ్ సిరీస్)- నెట్ ఫ్లిక్స్

ఒషి నొ కో (జపనీస్ యానిమె వెబ్ సిరీస్)- నెట్ ఫ్లిక్స్

చెఫ్స్ టేబుల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నెట్ ఫ్లిక్స్

ప్యారాషూట్ (తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలి, మరాఠీ)- డిస్నీ హాట్ స్టార్

బీటిల్స్64 – (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) - డిస్నీ హాట్ స్టార్

కృష్ణం ప్రణయ సఖి – (కన్నడ మూవీ)  సన్ నెక్స్ట్

తప్పంచుకు తిరుగువాడు ధన్యుడు సుమతి (తెలుగు సినిమా) - ఆహా ఓటీటీ

ద మెషీన్ (ఇంగ్లిష్)- సోనీ లివ్

డైవోర్స్ కేలియే కుచ్ భీ కరేగా (హిందీ వెబ్ సిరీస్) – జీ 5

Also Read: వరుణ్ తేజ్ 'మట్కా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... Prime Videoలో ఎప్పుడు చూడొచ్చు అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
First HMPV Case In India: భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
YSRCP vs Nara Lokesh: వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
Maadhavi Latha: నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
First HMPV Case In India: భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
YSRCP vs Nara Lokesh: వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
Maadhavi Latha: నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
CM Revanth Reddy: తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం, అంబులెన్స్ ఢీకొని శ్రీవారి భక్తులు మృతి
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం, అంబులెన్స్ ఢీకొని శ్రీవారి భక్తులు మృతి
Macherla Turaka Kishore Arrested: పినెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ అరెస్ట్, మాచర్లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు
పినెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ అరెస్ట్, మాచర్లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Embed widget