అన్వేషించండి

Animal Movie: అప్పుడు ‘అన్నపూర్ణి’, ఇప్పుడు ‘యానిమల్’ - రణబీర్ సినిమాకు తప్పని తిప్పలు

Animal Movie: నయనతార హీరోయిన్‌గా నటించిన ‘అన్నపూర్ణి’ మూవీకి ఎదురైన సమస్యే రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’కు కూడా ఎదురవుతోంది.

Animal Movie On Netflix: డిసెంబర్‌లో విడుదలయిన ‘యానిమల్’ సినిమా అన్ని విమర్శలను దాటి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా విమర్శలు ఆగడం లేదు. అంతే కాకుండా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘యానిమల్’కు ‘అన్నపూర్ణి’ తరహాలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. చాలామంది నెటిజన్లు.. ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. ‘యానిమల్’ను ఖండిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్’ స్ట్రీమింగ్ ప్రారంభించుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ రచ్చ మొదలయ్యింది.

మరోసారి కాంట్రవర్సీలు..

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 3 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న మూవీని ఎవరు చూస్తారు అని విమర్శించిన ప్రేక్షకులే ‘యానిమల్’ను చూడడానికి మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లారు. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను అందుకుంది ‘యానిమల్’. అవార్డుల విషయంలో కూడా దూసుకుపోవడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో 19 కేటగిరిల్లో సెలక్ట్ అయ్యింది ఈ చిత్రం. అంతే కాకుండా ఇందులో రణవిజయ్ సింగ్ పాత్రలో నటించిన రణబీర్ కపూర్‌కు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కూడా దక్కింది. ఇంతలోనే మరోసారి మూవీపై కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి.

స్ట్రీమింగ్ ఆపేయాలి..

డిసెంబర్ 26 నుంచి ‘యానిమల్’ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌‌ఫ్లిక్స్.. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా మహిళలపై హింసను ఎంకరేజ్ చేసేలా ఉందని, అమ్మాయిలను అసభ్యకరంగా చూపించారని ఓటీటీ ప్రేక్షకులు అంటున్నారు. అంతే కాకుండా నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘యానిమల్’ను తొలగించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. భార్యను మోసం చేయడం గురించి సినిమాలో చూపించారని, అది అందరినీ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెట్టి నెట్‌ఫ్లిక్స్‌ను ట్యాగ్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

‘అన్నపూర్ణి’ తరహాలోనే..

నయనతార హీరోయిన్‌గా నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రానికి కూడా ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. అందులో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే సీన్స్, డైలాగ్స్ ఉన్నాయని హిందూ కమ్యూనిటీలు ధ్వజమెత్తాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్‌కు వేరే దారిలేక ఈ సినిమాను స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. ఇప్పుడు ‘యానిమల్’ విషయంలో కూడా నెట్‌ఫ్లిక్స్‌కు అదే ఒత్తిడి ఎదురవుతోంది. కానీ ‘యానిమల్’ను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సినిమాను సినిమాలాగా మాత్రమే చూడాలని, అది ఎంటర్‌టైన్మెంట్ కోసం మాత్రమే అని కొందరు ‘యానిమల్’ను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి నెట్‌ఫ్లిక్స్.. ‘అన్నపూర్ణి’ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ‘యానిమల్’ విషయంలో కూడా తీసుకుంటుందేమో చూడాలి.

Also Read: హాలీవుడ్ నటుడితో ‘ఎవడు’ బ్యూటీ డేటింగ్ - సినిమా స్టైల్ ప్రపోజల్, ఇంతకీ ఓకే చెప్పిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
Telangana Caste Survey: తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
New Income Tax Bill: పార్లమెంటులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను బిల్లు - కీలక మార్పులు ఇవే
పార్లమెంటులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను బిల్లు - కీలక మార్పులు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
Telangana Caste Survey: తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
New Income Tax Bill: పార్లమెంటులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను బిల్లు - కీలక మార్పులు ఇవే
పార్లమెంటులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను బిల్లు - కీలక మార్పులు ఇవే
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
Manchu Mohan Babu: మంచు మోహన్ బాబుకు భారీ ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 
మంచు మోహన్ బాబుకు భారీ ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 
Champions Trophy 2025: బుమ్రా నుంచి మిచెల్ స్టార్క్ వరకు ఛాంపియన్ ట్రోఫీ నుంచి తప్పుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే!
బుమ్రా నుంచి మిచెల్ స్టార్క్ వరకు ఛాంపియన్ ట్రోఫీ నుంచి తప్పుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే!
Nithiin: నితిన్ అభిమానులకు డబుల్ బొనాంజా... రెండు నెలల్లో రెండు సినిమాలతో డేరింగ్ స్టెప్
నితిన్ అభిమానులకు డబుల్ బొనాంజా... రెండు నెలల్లో రెండు సినిమాలతో డేరింగ్ స్టెప్
Embed widget