అన్వేషించండి

Nayattu Telugu OTT Release: తెలుగులోకి మలయాళ బ్లాక్ బస్టర్ 'నాయట్టు' - ఆహా ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే?

Chunduru Police Station OTT Release Date: మలయాళ బ్లాక్ బస్టర్ 'నాయట్టు'ను తెలుగు ప్రేక్షకుల ముందుకు 'చుండూరు పోలీస్ స్టేషన్'గా తీసుకు వస్తోంది ఆహా. రిలీజ్ ఎప్పుడంటే?

నాయట్టు... 2021లో థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమా. 'నాయట్టు' అంటే వేట అని అర్థం. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఆదికేశవ' సినిమాలో విలన్ రోల్ చేసిన జోజు జార్జ్ గుర్తు ఉన్నారా? 'నాయట్టు' సినిమాలో ఆయన ఓ మెయిన్ లీడ్. ఇంకా కుంచకో బోబన్, నిమిషా సజయన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాయట్టు' కేరళలో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది ఆహా. 

తెలుగులో 'చుండూరు పోలీస్ స్టేషన్'గా...
Nayattu In Telugu: 'నాయట్టు' చిత్రాన్ని తెలుగులో 'చుండూరు పోలీస్ స్టేషన్'గా డబ్బింగ్ చేశారు. ఏప్రిల్ 26న... అంటే ఈ శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలియజేసింది ఆహా ఓటీటీ.

మలయాళంలో విమర్శకుల ప్రశంసలతో పాటు విశేష ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్న పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించింది ఆహా ఓటీటీ. ఆ కోవలో ఇప్పుడు 'నాయట్టు' సినిమాను తీసుకు వస్తోంది. ఒక పోలీస్ వెంట మరొక పోలీస్ పడితే... లాకప్ డెత్ తర్వాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కానిస్టేబుల్ ను పట్టుకోవడానికి మరొక పోలీస్ ప్రయత్నిస్తే ఏం జరిగింది? అనేది చిత్ర కథ. 

Also Read: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!


ఏప్రిల్ 8, 2021లో కేరళలో 'నాయట్టు' విడుదల అయ్యింది. థియేటర్లలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత తెలుగులో డబ్బింగ్ కావడం, ఓటీటీలో విడుదలకు రెడీ కావడం విశేషం. మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం వహించడంతో పాటు రంజిత్, పీఎం శశధరన్ తో కలిసి నిర్మించిన 'చుండూరు పోలీస్ స్టేషన్'కు విష్ణు విజయ్ సంగీతం అందించారు.

Also Read: బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్... ఎర్త్ డే రోజున చెన్నైలో ఓ అందాల భామ ఏం చేసిందో చూశారా?


తెలుగులో రీమేక్ అయిన 'నాయట్టు'... 
శ్రీకాంత్ నటించిన సినిమా చూశారా?
మలయాళ సినిమాలు ఫాలో అయ్యే ప్రేక్షకులకు 'నాయట్టు' గురించి తెలుసు. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసినట్టు ఎంత మందికి తెలుసు? శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ నటించిన 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా ఉంది కదా! అది 'నాయట్టు'కు రీమేక్. 

మలయాళంలో జోజు జార్జ్ నటించిన పాత్రను తెలుగులో శ్రీకాంత్ పోషించారు. ఆ సినిమాలో నిమిషా విజయన్ చేసిన క్యారెక్టర్ తెలుగులో శివానీ రాజశేఖర్ చేశారు. ఇంకా రాహుల్ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులోనూ మంచి విజయం సాధించింది. తెలుగులో సినిమా చూసిన వాళ్లు మాతృక ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటే... 26వ తేదీ నుంచి ఆహా లాగిన్ అయితే చాలు. 'చుండూరు పోలీస్ స్టేషన్' చూడొచ్చు.

Also Read: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?

టాప్ హెడ్ లైన్స్

418 Movie OTT : రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Crazy Kalyanam OTT : ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
Crime Thriller OTT : అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Gelupu Movie OTT : లైఫ్‌లో 'గెలుపు' కిక్ ఇస్తుంది... కానీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
లైఫ్‌లో 'గెలుపు' కిక్ ఇస్తుంది... కానీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget