అన్వేషించండి

OTT Movies: ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న లేటెస్ట్ సినిమాలు ఇవే, రేపు మరిన్ని!

నవంబర్ ఫస్ట్ వీక్ లో ప్రేక్షకులను అలరించడానికి ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఏ ఓటీటీలో ఏ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుందో తెలుసుకుందాం.

చూస్తుండగానే అక్టోబర్ నెల గడిచిపోయి నవంబర్ వచ్చేసింది.. సినీ అభిమానుల కోసం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ వారంలో ఏకంగా డజను మూవీస్ రిలీజ్ కానున్నాయి. మరోవైపు పోటీగా ఓటీటీలలోనూ సరికొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఈ వారం దాదాపు 20కి పైగా సినిమాలు/సిరీసులు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో సందడి చేయబోతున్నాయి. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు క్రేజీ చిత్రాలు ఇప్పటికే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేశాయి. 

'స్కంద':
ఉస్తాద్ రామ్ పోతినేని - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన 'స్కంద' సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు (నవంబర్ 2) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. పాన్ ఇండియా వైడ్ గా సెప్టెంబర్ 28న రిలీజైన ఈ సినిమా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. థియేటర్‌లలో మెప్పించలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

'జవాన్':
కింగ్ ఖాన్ షారుక్‌ ఖాన్‌, డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందిన 'జవాన్' మూవీ కూడా డిజిటల్ వేదిక మీదకు వచ్చేసింది. సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. షారూఖ్ బర్త్ డే స్పెషల్ గా నవంబరు 2వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో కట్ చేసిన సన్నివేశాలను జోడించి, తెలుగు తమిళ్ హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో షారుక్ ద్విపాత్రాభినయం చేశారు. నయన తార హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, 2023లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

'మంత్‌ ఆఫ్‌ మధు':
నవీన్‌ చంద్ర, కలర్స్ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'మంత్‌ ఆఫ్‌ మధు'. శ్రీకాంత్‌ నాగోతి దర్శకత్వంలో ఈ సినిమా అక్టోబరు 6న థియేటర్లలో రిలీజయింది. ఫీల్‌ గుడ్‌ మూవీ అనిపించుకుంది కానీ, పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఓటీటీ 'ఆహా' వేదికగా అలరించడానికి సిద్ధమైంది. రేపు శుక్రవారం (నవంబరు 3) నుంచి స్ట్రీమింగ్‌ కాబోతోంది. దీంతో పాటుగా రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'మగధీర' రీమాస్టర్ వెర్షన్ కూడా ఆహాలో అందుబాటులోకి రానుంది. 

'మ్యాడ్':
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'మ్యాడ్' (MAD). సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా రేపు నవంబరు 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్‌లలో చూడని కుర్రకారు ఈ వీకెండ్‌ లో ఇంట్లోనే కూర్చోని ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.

ఇక వెబ్ సిరీసుల విషయానికొస్తే, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో రూపించిన 'ఆర్య' సీజన్ 3 నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొదటి రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో, మూడో సీజన్ పై జనాల్లో ఆసక్తి నెలకొంది. అలానే ఈ వారం అందరి దృష్టిని ఆకర్షించే వెబ్ సిరీస్ లలో 'స్కామ్‌ 2003' కూడా ఒకటి. ఇప్పటికే సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న పార్ట్-1 మంచి హిట్ అవ్వడంతో, రేపటి నుంచి రెండో భాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు.. 

డిస్నీ+హాట్‌ స్టార్: 
బిహైండ్‌ ది అట్రాక్షన్‌ సీజన్‌ 2 (ఇంగ్లీష్‌) - స్ట్రీమింగ్‌ అవుతోంది
ద త్రీ డిటెక్టివ్స్‌ (జర్మన్‌) - స్ట్రీమింగ్ అవుతోంది

అమెజాన్ ప్రైమ్ వీడియో:
పి.ఐ. మీనా (హిందీ) - నవంబర్ 3
ఇన్‌విన్సిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్) - నవంబర్ 3
ఆర్ యూ ఓకే బేబీ (తమిళ్) - స్ట్రీమింగ్ అవుతోంది

నెట్ ఫ్లిక్స్: 
నైద్: మూవీ (ఇంగ్లీష్) - స్ట్రీమింగ్ అవుతోంది
ఆల్‌ ది లైట్‌ వి కెనాట్‌ (సిరీస్‌) - స్ట్రీమింగ్‌ అవుతోంది
సిగరెట్‌ గర్ల్:సిరీస్‌ (ఇండోనేషియన్‌) - స్ట్రీమింగ్‌ అవుతోంది
లాక్డ్ ఇన్ (హాలీవుడ్) - స్ట్రీమింగ్ అవుతోంది
వింగ్ ఉమెన్: ది వే ఆఫ్ స్కార్పియన్ (ఫ్రెంచ్) - స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లూ ఐ సమురాయ్‌ (జపనీస్‌ సిరీస్‌) - నవంబరు 3
డైలీ డోస్‌ షైన్‌ (కొరియన్‌ సిరీస్‌) - నవంబరు 3
సెల్లింగ్‌ సన్‌ సెట్‌ సీజన్‌ 7 (ఇంగ్లీష్‌) - నవంబరు 3
స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 3
ది టేలర్‌ సీజన్‌ 3 (టర్కిష్‌) - నవంబరు 3
ఫెర్రీ: ది సిరీస్ (డచ్ వెబ్‌ సిరీస్) నవంబరు 3

Also Read: మంచు విష్ణుకు ప్ర‌మాదం - హెల్త్ అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Cabinet Ministers: బిహార్ కేబినెట్ అప్‌డేట్.. 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎం కోసం హోరాహోరీ
బిహార్ కేబినెట్ అప్‌డేట్.. 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎం కోసం హోరాహోరీ
Telangana Group 2 Cancel: 2015 తెలంగాణ గ్రూప్ 2 రద్దు చేసిన హైకోర్టు.. రీవాల్యుయేషన్‌కు 8 వారాలు గడువు
2015 తెలంగాణ గ్రూప్ 2 రద్దు చేసిన హైకోర్టు.. రీవాల్యుయేషన్‌కు 8 వారాలు గడువు
Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్  - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
Bihar CM Oath Ceremony: నవంబర్ 20 అమావాస్య రోజు బిహార్ ముఖ్యమంత్రిగా 'నితీష్' ప్రమాణ స్వీకారం? రాష్ట్రంలో ఏం జరగబోతోంది!
నవంబర్ 20 అమావాస్య రోజు బిహార్ ముఖ్యమంత్రిగా 'నితీష్' ప్రమాణ స్వీకారం? రాష్ట్రంలో ఏం జరగబోతోంది!
Advertisement

వీడియోలు

Maoist Commander Hidma Encounter in AP  | ఏపీలో భారీ ఎన్‌కౌంటర్ | ABP Desam
KL Rahul about IPL Captaincy | కెప్టెన్సీపై కేఎల్ రాహుల్  సంచలన కామెంట్స్
CSK Releasing Matheesha Pathirana | పతిరనా కోసం KKR తో CSK డీల్ ?
Kumar Sangakkara as RR Head Coach | రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర
South Africa Captain Temba Bavuma Record | తెంబా బవుమా సరికొత్త రికార్డ్ !
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Cabinet Ministers: బిహార్ కేబినెట్ అప్‌డేట్.. 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎం కోసం హోరాహోరీ
బిహార్ కేబినెట్ అప్‌డేట్.. 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎం కోసం హోరాహోరీ
Telangana Group 2 Cancel: 2015 తెలంగాణ గ్రూప్ 2 రద్దు చేసిన హైకోర్టు.. రీవాల్యుయేషన్‌కు 8 వారాలు గడువు
2015 తెలంగాణ గ్రూప్ 2 రద్దు చేసిన హైకోర్టు.. రీవాల్యుయేషన్‌కు 8 వారాలు గడువు
Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్  - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
Bihar CM Oath Ceremony: నవంబర్ 20 అమావాస్య రోజు బిహార్ ముఖ్యమంత్రిగా 'నితీష్' ప్రమాణ స్వీకారం? రాష్ట్రంలో ఏం జరగబోతోంది!
నవంబర్ 20 అమావాస్య రోజు బిహార్ ముఖ్యమంత్రిగా 'నితీష్' ప్రమాణ స్వీకారం? రాష్ట్రంలో ఏం జరగబోతోంది!
Coffee in India : ఫిల్టర్ కాఫీ వెనుక ఆసక్తికరమైన కథ.. ఇండియాలో కాఫీకి అదే ప్రధాన కారణం
ఫిల్టర్ కాఫీ వెనుక ఆసక్తికరమైన కథ.. ఇండియాలో కాఫీకి అదే ప్రధాన కారణం
Telangana News:
"ప్రతి మహిళా సంఘానికో బస్‌- నెలకు 69వేలు అద్దె వచ్చేలా ప్లాన్" మరో సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం 
ED entry in IBOMMA Case: ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
Maoist Dev Ji: మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
Embed widget