Mirzapur 3 Release Date: 'మీర్జాపూర్ - 3' రిలీజ్ డేట్ వచ్చేసింది - ఈ ఫొటోలోనే తేదీ ఉందట, చెప్పుకోండి చూద్దాం
ప్రైమ్ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. అదే 'మీర్జాపూర్ - 3' రిలీజ్ డేట్. డేట్ ని వెల్లడించకుండా, మీరే కనుక్కోండి అంటూ ప్రేక్షకులకి సవాల్ విసిరింది. మరి ఏంటా సవాల్?
Mirzapur 3 Release Date Hidden In This Poster Lets find: 'మీర్జాపూర్'.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ సిరిస్‌కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సీరిస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే, చాలా గ్యాప్ తర్వాత మూడో సీజన్ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో.. మూడో సీజన్ రిలీజ్ అప్ డేట్ ఇచ్చేసింది. అది ఎప్పుడు అనేది మాత్రం చెప్పకుండా.. ప్రేక్షకులకే సవాల్ విసిరింది. యానిమేటెడ్ ఫొటో ఒకటి పోస్ట్ చేసి రిలీజ్ డేట్ కనుక్కోండి చూద్దాం అంటూ ఒక పజిల్ ని ఇచ్చింది.
జులై 7 అని కొందరు..
అసలే ఇష్టమైన సిరీస్. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. దీంతో అమెజాన్ అలా పోస్ట్ పెట్టగానే ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. అలీ ఫాజల్ తన ఇన్ స్టాలో ఈ పోస్ట్ పెట్టగానే ఎవరికి తోచినట్లుగా వాళ్లు పజిల్ సాల్వ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కొంతమంది జులై 7న రిలీజ్ అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. "యానిమేటెడ్ పోస్టర్‌లో ఏడు క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి, ఏడు పిస్టోల్స్ కనిపిస్తున్నాయి. కాలీన్ భయ్యా సెవెన్ కార్పెప్ట్స్ ఉన్నాయి. అన్ని విషయాల్లో 7 కామన్‌గా ఉండటంతో జులై 7న రిలీజ్ అవుతుంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
7 x 3 = 21 అని మరికొందరు అంటున్నారు..
ఇంకొంతమంది ఫ్యాన్స్ మాత్రం తమలో ఉన్న లెక్కల నైపుణ్యాన్ని బయటికి తీస్తున్నారు. మ్యాథ్స్ ఫార్ములా ప్రకారం 7 x 3 = 21 కాబట్టి జులై 21న రిలీజ్ కాబోతుంది అంటూ అంచనా వేస్తున్నారు. "7 క్యారెక్టర్లు, 7 పిస్టోల్స్, 7 కార్పెట్స్ అంటే 7 + 7 + 7 = 21. అంతే కాకుండా జులై 21 పౌర్ణమి కాబట్టి కచ్చితంగా 21నే రిలీజ్ అవుతుంది" అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇంకొంతమందైతే.. "ఎప్పుడైతే ఏముంది? 'మీర్జాపూర్ సీజన్ - 3' మాత్రం రిలీజ్ అయిపోతుంది అది చాలు" అని అంటున్నారు.
చంద్రుడు.. నంబర్ 7..
ఇక పోస్టర్ ని నిశితంగా పరిశీలిస్తే.. అందులో కామన్ గా 7 కనిపిస్తోంది. దాంతో పాటుగా పౌర్ణమి చంద్రుడు కనిపిస్తున్నాడు. జులై 21న పౌర్ణమి వస్తోంది. ఇక మూడు 7లు కలిపితే.. 21 వస్తుంది కాబట్టి జులై 21న సిరీస్ రాబోతుంది అని అర్థం అవుతుంది. చూడాలి మరి పజిల్ కి ఆన్సర్ ఏం చెప్తారో.
ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ అనే ప్రాంతం నేపథ్యంలో తీశారు ఈ వెబ్ సిరీస్. మొదటి సీజన్ 2018లో అమెజాన్ లో ఈ సిరీస్ రిలీజ్ అయ్యింది. హిందీలో రిలీజైన వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ రావడంతో మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో 'మీర్జాపూర్' సూపర్ హిట్ అయ్యింది. దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ ను 2020 అక్టోబరు 23న రిలీజ్ చేశారు. రెండు సీజన్లు కూడా మంచి హిట్ సాధించడంతో మూడో సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందులో శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు నటించారు. ముఖ్యంగా ఇందులోని మున్నా భాయ్, గోడ్డు భాయ్, గోలు అఖండానంద్ పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి.
Also Read: చాలామంది నా కొడుకును హీరో చేయమన్నారు - తిండి తినకుండా ఫొటోలతో ఆఫీసులు చుట్టూ తిరిగా: నటుడు సురేష్