Martin OTT Streaming: రెండు ఓటీటీల్లో పాన్ ఇండియా 'మార్టిన్' స్ట్రీమింగ్ - యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడి సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
Dhruva Sarja's Martin OTT Release: కన్నడ స్టార్ ధృవ్ సర్జా నటించిన పాన్ ఇండియా మూవీ 'మార్టిన్' తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Dhruva Sarja) మేనల్లుడు ధృవ్ సర్జా నటించిన పాన్ ఇండియా మూవీ 'మార్టిన్'. ఈ సినిమా ఇప్పుడు ఒకేసారి రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది (Martin OTT Release). ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అర్జున్ సర్జా కథను అందించారు. మణిశర్మ సంగీతం అందించగా, రవి బస్రూర్ ఈ మూవీకి పవర్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చారు. ఈ సినిమాలో వైభవి శాండిల్య, అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే 'మార్టిన్' మూవీ ప్రస్తుతం రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. అందులో ఒకటి 'ఆహా'. 'మార్టిన్' మూవీ ప్రస్తుతం ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది అంటూ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే అంతలోనే మరోవైపు ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో సహా, ఇతర ప్రధాన భారతీయ భాషలలో స్ట్రీమింగ్ మొదలైంది. అయితే ఆహలో మాత్రం కేవలం తెలుగు వర్షన్ ఒక్కటే ప్రసారమవుతోంది. ఇక మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ మినహా భారతదేశంలోని ఇతర భాషలన్నిటిలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీకి, ఓటిటిలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Experience the thrilling tale of Dhruva, where patriotism meets passion 🔥❤️!
— ahavideoin (@ahavideoIN) November 19, 2024
Watch #Martin now! 🎥👊 ▶️https://t.co/MviUsUzc3u pic.twitter.com/tgi24PYIdm
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే... ఒక పోర్ట్ లో అర్జున్ అనే వ్యక్తి కష్టమ్స్ ఆఫీసర్ గా పని చేస్తాడు. అతను ఒక నీతి, నిజాయితీ, దేశభక్తి ఉన్న ఆఫీసర్. అయితే ఓ ఆపరేషన్ కోసం అర్జున్ పాకిస్తాన్ కి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు తను ఎవరు అన్న విషయాన్ని కూడా అర్జున్ మర్చిపోతాడు. ఈ విషయాన్ని కనుక్కునే క్రమంలోనే తనకు సాయం చేసే వాళ్లంతా చనిపోతున్నారని తెలుసుకుంటాడు. పైగా ఇండియాలో ఉన్న అతని స్నేహితులను కూడా హత్య చేస్తారు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఎంతగానో ప్రేమించిన ప్రీతి అపాయంలో పడుతుంది. మొత్తానికి అతి కష్టం మీద ఇండియాకు తిరిగి వస్తాడు అర్జున్. ఆ తర్వాత అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అసలు ఈ మార్టిన్ ఎవరు? అనే విషయాలు తెరపై చూడాల్సిందే. ఈ మూవీ అక్టోబర్ 11 న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దసరా కానుకగా రిలీజ్ అయిన 'మార్టిన్' అదే సమయంలో రిలీజ్ అయిన సినిమాలు ఇచ్చిన పోటీలో నిలబడలేకపోయింది. ఈ ఏడాది దసరాకు తమిళంలో రజినీకాంత్ 'వేట్టయన్', గోపీచంద్ 'విశ్వం', సుధీర్ బాబు నటించిన 'మా నాన్న సూపర్ హీరో', సుహాస్ 'జనక అయితే గనక', అలియా భట్ లేడి ఓరియంటెడ్ మూవీ 'జిగ్రా' సినిమాలు రిలీజ్ అయ్యాయి.
Also Read: నయన్ వివాదాస్పద డాక్యుమెంటరీకి మహేష్ బాబు రివ్యూ... సూపర్ స్టార్ ఏమన్నారో తెలుసా?