అన్వేషించండి

Mardaani 3 OTT : మెచ్యూర్ కానీ అమ్మాయిల కిడ్నాప్ మిస్టరీ - ఓటీటీలోకి రాణి ముఖర్జీ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3

Mardaani 3 OTT Platform : బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3. జనవరిలో ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Rani Mukherjee's Mardaani 3 OTT Streaming : నగరంలో భయంకర బెగ్గర్ మాఫియా, చిన్నారుల కిడ్నాప్, మెడికల్ ఎక్స్‌పెరిమెంట్స్... ఇవన్నీ ప్రధానాంశాలుగా తెరకెక్కిన రీసెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మర్దానీ 3. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన 'మర్దానీ 3' ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం (మార్చి 27) మధ్యాహ్నం నుంచి కేవలం హిందీలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మర్దానీ 3 నిలిచింది. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించగా... రాణీ ముఖర్జీతో పాటు జానకి బోడివాలా, మల్లికా ప్రసాద్, జిషు సేన్ గుప్తా, ఇంద్రనీల్ భట్టాచార్య, నవేద్ అస్లామ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్

అంతకు ముందు వచ్చిన మర్దానీ (2014), మర్దానీ 2 (2019) వంటి విజయాల తర్వాత ఆడియన్స్‌కు ఫుల్ థ్రిల్ పంచింది మర్దానీ 3. ఫస్ట్ రెండు పార్టులను మించి బిగ్ సక్సెస్ అందుకుంది. శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ అదరగొట్టారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లో అద్భుతంగా నటించారు. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించిన ఈ మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

ఫస్ట్ పార్ట్ మహిళల అక్రమ రవాణాపై పోలీస్ ఆఫీసర్ ఉక్కుపాదంను చూపిస్తే... రెండో పార్టులో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే సైకో కిల్లర్‌ను పట్టుకోవడం గురించి చూపించారు. ఇక 'మర్దానీ 3'  స్టోరీ విషయానికొస్తే... చిన్నారుల కిడ్నాప్, బెగ్గర్ మాఫియా వంటి వాటిని చూపించారు. ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్‌పెరిమెంట్స్ గుట్టును సైతం పోలీస్ ఆఫీసర్ ఎలా బయటపెట్టారనేదే కథ.

ఇక మర్దానీ 3 స్టోరీ విషయానికొస్తే... ఢిల్లీలో ఓ రాయబారి కుమార్తె మిస్ అవుతుంది. హై ప్రొఫైల్ కేస్ కావడంతో శివానీ శివాజీ రాయ్ (రాణీ ముఖర్జీ)కి అప్పగిస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన ఆమెకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. కిడ్నాప్ అయ్యింది ఒక్క రాయబారి కుమార్తె మాత్రమే కాదని... ఢిల్లీలో సామాన్యుల కుమార్తెలు కూడా చాలా మంది మిస్ అయ్యారని తెలుస్తుంది. ఈ కిడ్నాప్స్ వెనుక అమ్మ (మల్లికా ప్రసాద్) ఉందని తెలుసుకుంటుంది.

అసలు మెచ్యూర్ కాని అమ్మాయిలనే ఈ ముఠా ఎందుకు టార్గెట్ చేసింది? బెగ్గర్ మాఫియాకు చెందిన ఓ లేడీ డాన్ ఈ కిడ్నాప్స్ చేయించడం వెనుక ఉన్నది ఎవరు? అసలు వరుస కిడ్నాప్స్ వెనుక బలమైన క్రైమ్ ఏంటి? ఈ కేసును శివానీ శివాజీ రాయ్ ఎలా ఛేదించారు? కిడ్నాపర్ల చెర నుంచి బాలికలను కాపాడగలిగిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. కేవలం కిడ్నాప్, బెగ్గర్ మాఫియా మాత్రమే కాకుండా అంతకు మించి కొత్త అంశాలను కథలో జోడించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget