Manmadha Leela: ఆహాలో మన్మథ లీల - పెద్దలకు మాత్రమే!
ఆహాలో అశోక్ సెల్వన్, సంయుక్త హెగ్డే, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన మన్మథ లీల జూన్ 24వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది.
ఆహాలో జూన్ 24వ తేదీ నుంచి ‘మన్మథ లీల’ సినిమా స్ట్రీమ్ కానుంది. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు. అశోక్ సెల్వన్, సంయుక్త హెగ్డే, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా తమిళ వెర్షన్ కూడా ఆహాలోనే స్ట్రీమ్ అవుతుంది.
ఒక యువకుడి జీవితంలో రెండుసార్లు ఒకే తరహా సంఘటనలు జరిగితే వాటి నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనేది మన్మథ లీల కథ. కొంచెం అడల్ట్ టచ్ ఉన్న ఈ సినిమాను యూత్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. మానాడు వంటి సూపర్ హిట్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా ఇది.
ఈ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు త్వరలో నాగచైతన్యతో ఒక సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా నాగచైతన్యకు తమిళనాట డెబ్యూ సినిమా కానుంది. పూజా హెగ్దే ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించనుందని వార్తలు వస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.
Witness the mysterious journey of a man who is stuck in between two worlds, and two different timelines.#ManmathaLeelaOnAHA premieres June 24. #RiyaSuman @smruthi_venkat@SamyukthaHegde@AshokSelvan @Premgiamaren pic.twitter.com/0qgxUxltfg
— ahavideoin (@ahavideoIN) June 16, 2022
View this post on Instagram