Manisha Koirala: ఇండస్ట్రీలో ఆడవారి రాత మారింది, ఆ సీన్ కోసం 12 గంటల పాటు మట్టి నీళ్లలో ఉన్నాను - మనీషా కొయిరాల
Manisha Koirala: ‘హీరామండి’లో మల్లికాజాన్ పాత్రలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు మనీషా కొయిరాల. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించినందుకు స్పెషల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేశారు.
Manisha Koirala About Heeramandi: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ గురించే ప్రస్తుతం ప్రేక్షకులంతా మాట్లాడుకుంటున్నారు. స్వాతంత్ర్యం సమయంలో హీరామండి అనే రెడ్ లైట్ ఏరియాలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు భాన్సాలీ. తన డైరెక్షన్‌లో ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపించే సంజయ్ లీలా భన్సాలీ.. ‘హీరామండి’ని కూడా చాలా రిచ్‌గా ప్లాన్ చేశారు. ఇక ఇందులో నటించిన హీరోయిన్స్ కూడా సిరీస్‌ను మరికొందరు ప్రేక్షకులకు దీనిని రీచ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ‘హీరామండి’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మనీషా కొయిరాల.
పెద్ద విషయం..
ఒకప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ చాలామంది ప్రేక్షకులకు క్రష్‌గా మారిపోయారు మనీషా కొయిరాల. కానీ మధ్యలో పలు పర్సనల్ కారణాల వల్ల, అనారోగ్య ఇబ్బందుల వల్ల యాక్టింగ్‌కు దూరంగా ఉంటున్నారు మనీషా. మళ్లీ ‘హీరామండి’తో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. అయితే ఈ వెబ్ సిరీస్‌లో నటించడానికి తాను ఎంత కష్టపడ్డారో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయటపెట్టారు మనీషా. ‘క్యాన్సర్ నుండి బయటపడిన తర్వాత, 50 ఏళ్లు వచ్చిన తర్వాత నా జీవితం పూలబాటగా మారుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. దానికి రెండు కారణాలు.. మొదటిది.. హీరామండి అనేది నా కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది. ఒక 53 ఏళ్ల నటికి ఇలాంటి ఒక పెద్ద వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం రావడం చిన్న విషయం కాదు. నేను సాధారణ పాత్రలకే పరిమితమయిపోకుండా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు మనీషా.
నా వల్ల అవుతుందా.?
‘ఫైనల్‌గా ఇండస్ట్రీలో పనిచేసే ఆడవారికి వారి టాలెంట్‌కు తగిన అవకాశాలతో పాటు గౌరవం కూడా దక్కుతోంది. ఇలాంటి మారుతున్న రోజుల్లో నేను కూడా భాగమయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నా సంతోషానికి రెండో కారణం ఏంటంటే.. ఈరోజు నాకు దక్కుతున్న ప్రశంసలు అన్నీ వింటుంటే షూటింగ్ మొదలయినప్పుడు నాలో ఉన్న అనుమానాలు గుర్తొస్తున్నాయి. షూటింగ్ షెడ్యూల్స్‌ను, భారీ కాస్ట్యూమ్స్‌ను, ఆభరణాలను నా శరీరం తట్టుకోలదా అని అనుకునేదాన్ని. సిరీస్‌లోని ఫౌంటేన్ సీన్.. శారీరకంగా నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. దానికోసం దాదాపు 12 గంటల పాటు వాటర్ ఫౌంటేన్‌లోనే ఉండాల్సి వచ్చింది. అది నా ఓర్పును టెస్ట్ చేసింది. ముందుగా నీళ్లు శుభ్రంగా, వెచ్చగా ఉండేలా సంజయ్ చూసుకున్నారు. కానీ సమయం గడుస్తున్నకొద్దీ అవి అంత శుభ్రంగా లేవు’ అని గుర్తుచేసుకున్నారు.
టెస్ట్ పాస్..
‘నా శరీరంలోని మొత్తం ఆ మట్టి నీళ్లలో మునిగిపోయింది. షూటింగ్ అయిపోయే వరకు చాలా అలసిపోయినా కూడా నా మనసులో మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. నేను ఒక కష్టమైన టెస్ట్ పాస్ అయ్యానని ఫీల్ అయ్యాను. మీ అనారోగ్యం వల్లో, వయసు వల్లో మీ టైమ్ అయిపోయింది అనుకునే అందరికీ చెప్తున్న.. వెనక్కి తగ్గకండి. మీకోసం ఒక కొత్త మలుపు ఎదురుచూస్తు ఉండొచ్చు. మీ ప్రేమకు, అభిమానానికి రుణపడి ఉంటాను’ అంటూ ‘హీరామండి’ కోసం తను పడిన కష్టాలను గుర్తుచేసుకోవడంతో పాటు తనలా బ్రేక్ తీసుకొని మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్న ఎంతోమందికి ధైర్యం చెప్పారు మనీషా కొయిరాల.
View this post on Instagram
Also Read: వివాదంలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ - ఆ పదం వాడినందుకు హైకోర్టు నోటీసులు!