Maharaj OTT: డైరెక్టుగా ఓటీటీలోకి ఆమిర్ ఖాన్ కుమారుడి డెబ్యూ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?
Maharaj First Look: అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ కూడా బాలీవుడ్‌లో హీరోగా డెబ్యూ చేసే సమయం వచ్చేసింది. తన మొదటి మూవీ ‘మహారాజ్’కు సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలయ్యింది.
![Maharaj OTT: డైరెక్టుగా ఓటీటీలోకి ఆమిర్ ఖాన్ కుమారుడి డెబ్యూ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే? Maharaj On Netflix Aamir Khan son Junaid Khan debut movie first look release date Maharaj OTT: డైరెక్టుగా ఓటీటీలోకి ఆమిర్ ఖాన్ కుమారుడి డెబ్యూ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/29/3fe60facdc506dead11fa63a03cceaac1716976450128802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maharaj Movie Junaid Khan: బాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతోమంది వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా పరిచయం అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరికొందరు ఆకట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ కుమారుడు సైతం ఇప్పుడు హీరోగా పరిచయం అవ్వడానికి సిద్ధమయ్యాడు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్... ‘మహారాజ్’ అనే సినిమాతో డెబ్యూ ఇవ్వనున్నాడని ఇప్పటికే వార్తలు రాగా ఫైనల్‌గా ఈ మూవీ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకొని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల అవ్వడానికి సిద్ధమయ్యింది.
వాస్తవ సంఘటనల ఆధారంగా...
మిగతా నెపో కిడ్స్‌లాగా యూత్‌ఫుల్ స్టోరీతో కాకుండా తన డెబ్యూ కోసం ఒక నిజ జీవిత సంఘటనను ఎంచుకున్నాడు జునైద్ ఖాన్. జూన్ 14న ‘మహారాజ్’ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దీని గురించి ప్రకటిస్తూ నెట్‌ఫ్లిక్స్... మూవీ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ‘నిజం కోసం ఒక పవర్ ఫుల్ వ్యక్తి, ఒక భయం అంటే తెలియని జర్నలిస్ట్ మధ్య పోరాటం. నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కింది. జూన్ 14న మహారాజ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది’ అంటూ నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. ఇక టైటిల్‌లాగానే ‘మహారాజ్’ పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇది బొంబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అని అర్థమవుతుంది.
డిఫరెంట్ రూట్..
‘మహారాజ్’ పోస్టర్‌లో ఒకవైపు స్వామిజీ పాత్రలో జైదీప్ అహ్లావత్ కనిపిస్తుండగా మరోవైపు జర్నలిస్ట్‌గా జునైద్ ఖాన్ కనిపిస్తున్నాడు. ఇందులో జునైద్ ఖాన్ గెటప్ చూస్తుంటే ఇది ఒక పీరియాడిక్ డ్రామా అని అర్థమవుతుంది. ఇప్పటివరకు బాలీవుడ్‌లో హీరో హీరోయిన్లుగా లాంచ్ అయిన నెపో కిడ్స్... ఎక్కువ శాతం యూత్ ఫుల్ కథలతో లేదా కమర్షియల్ సినిమాలతోనే పరిచయం అయ్యారు. కానీ జునైద్ మాత్రం వారందరికీ భిన్నంగా తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో చూపించే పాత్రను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు జునైద్ ఖాన్ డెబ్యూ గురించే బీ టౌన్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది.
View this post on Instagram
బ్యాక్ టు బ్యాక్..
జునైద్ ఖాన్... తన మొదటి సినిమా ‘మహారాజ్’ కోసం షూటింగ్ చేస్తున్న సమయంలోనే మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం సాయి పల్లవితో ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు ఈ స్టార్ హీరో వారసుడు. ఇక తమిళంలో సూపర్ డూపర్ హిట్‌ను సాధించిన ‘లవ్ టూడే’ అనే యూత్‌ఫుల్ మూవీని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు అమీర్ ఖాన్. తానే నిర్మాతగా తెరకెక్కే ఈ రీమేక్‌లో తన కుమారుడు జునైద్‌నే హీరోగా ఎంపిక చేశాడు. ఈ మూవీలో జునైద్ ఖాన్‌కు జోడీగా శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ నటించనుంది.
Also Read: ఎలాన్ మస్క్ గారూ... 'ఎక్స్' బాస్‌కు 'కల్కి' డైరెక్టర్ స్పెషల్ రిక్వెస్ట్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)