అన్వేషించండి

Best OTT movies: భార్య లేని టైమ్‌లో ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో తిష్ట వేస్తే? ఏ మగాడికి రాకూడని కష్టం ఇది - కథ ఖతర్నాక్ అంతే!

పెళ్లైన మగాళ్లను టార్గెట్ చేయడమే ఆ అమ్మాయిల పని. ఏదో రకంగా ఇంట్లోకి దూరి, రెచ్చగొట్టి బలత్కారం చేస్తారు. వారి ట్రాప్ లో చిక్కి ఓ వ్యక్తి ఎలా బలి అయ్యాడో చెప్పే సినిమా ‘నాక్ నాక్‘.

Knock Knock Movie Explanation: 2015లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘నాక్ నాక్‘ (Knock Knock). ఎలి రోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీను రీవ్స్, లోరెంజా ఇజ్జో, అనా డి అర్మాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం లయన్స్‌ గేట్ ప్రీమియర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘నాక్ నాక్‘ సినిమా ‘డెత్ గేమ్‘ మూవీకి రీమేక్. 

‘నాక్ నాక్‘ మూవీ కథేంటంటే?

ఇవాన్ వెబ్బర్ వాస్తుశిల్పి. పెళ్లై పిల్లలతో సంతోషంగా ఉంటాడు. వీకెండ్‌లో భాగంగా అతడి భార్య, పిల్లలు బీచ్ ట్రిప్‌కు వెళ్తారు. ఆయన భార్య కరెన్ మంచి ఆర్టిస్టు. ఆమె ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేయాల్సిన శిల్పాన్ని తన అసిస్టెంట్ లూయిస్‌కు అప్పగిస్తుంది. అయితే, వర్క్ కారణంగా ఇవాన్ వారితో పాటు ట్రిప్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు.  

ఆ సమయంలో బయట బాగా వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఇద్దరు అమ్మాయిలు జెనెసిస్, బెల్ బాగా తడిసిపోతారు. ఇవాన్ ఇంటి ముందుకు వచ్చి కాలింగ్ బెల్ కొడతారు. పార్టీ కోసం ఇక్కడికి వచ్చామని, ఫోన్ లు తడిసిపోవడంతో అడ్రస్ కనుక్కోలేకపోయామని చెప్తారు. తాము బట్టలు ఆరబెట్టుకుంటామని ఇవాన్‌ను అడుగుతారు. సరే అని అతడు వారిని లోపలికి రమ్మంటాడు. వారికి టవల్స్ తో పాటు, బట్టలు ఆరబెట్టుకునేందుకు డ్రైయర్ ఇస్తాడు. బట్టలు ఆరిన తర్వాత కూడా అతడితోనే సరసాలాడుతూ అక్కడే ఉండేందుకు ప్రయత్నిస్తారు.

కానీ, ఇవాన్ వారిని పంపించేందుకు క్యాబ్ బుక్ చేస్తాడు. క్యాబ్ వచ్చేలోగా ఇవాన్ పై చేతులు వేస్తూ అతడిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, వారి పద్దతి ఇవాన్‌కు నచ్చదు. క్యాబ్ ఇంటి ముందుకు రాగానే, కాసేపు తాము బాత్ రూమ్ ఉపయోగించుకుంటాం అని చెప్తారు. దానికి ఇవాన్ సరే అంటాడు. కానీ, ఎంతకూ బయటకు రారు. అతడు లోపలికి వెళ్లే సరికి దుస్తులు లేకుండా పూర్తి నగ్నంగా కనిపిస్తారు. అతడిని వారు బలవంతం చేస్తారు. క్యాబ్ డైవర్ కు రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఇవాన్‌‌ను బలవంతంగా లొంగ దీసుకుంటారు. వారిచ్చే సుఖానికి.. ఇవాన్ కూడా కాదనకుండా పనికానిచ్చేస్తాడు. 

మరుసటి రోజు ఉదయం ఇవాన్ లేచే సరికి కిచెన్‌లో వారిద్దరు వంట చేస్తుంటారు. వస్తువులన్నింటీని చిందరవందరగా పడేస్తారు. వారిని చూడగానే ఇవాన్‌కు చాలా కోపం వస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని కోప్పడతాడు. కానీ, వాళ్లు ఎంతకీ పట్టించుకోరు. అదే సమయంలో తన ఇంటికి ఓ బంధువు వస్తుంది. ఆమె ఇవాన్ తో కలిసి ఇద్దరు అమ్మాయిలు ఉండటాన్ని చూసి.. నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదని కోపంగా వెళ్లిపోతుంది. ఇవాన్ కోపంతో వారిని వెళ్లిపోవాలని అరుస్తాడు. లేదంటే పోలీసులకు కాల్ చేస్తానని ఫోన్ కలుపుతాడు. వెళ్లిపోతామని చెప్పడంతో వారిని కారు ఎక్కించుకుని వారి దింపమన్న చోట డ్రాప్ చేసి వస్తాడు.

ఇవాన్ ఇంటికి వచ్చి కిచెన్ శుభ్రం చేస్తుండగా, జెనెసిస్, బెల్ మళ్లీ ఇంటికి వస్తారు. అతడి భార్య శిల్పాలలో ఒకదాన్ని బద్దలుకొడతారు. బెల్ అతడిని మంచానికి కట్టేసి శృంగారం చేస్తుంది. ఇంకో అమ్మాయి దాన్ని రికార్డు చేస్తుంది. ఇవాన్ కట్లు తెంచుకుని వారిపై తిరగబడతాడు. కానీ, జెనెసిస్ తన దగ్గరున్న ఫోర్క్ తో అతడిని పొడుస్తుంది. అతడు కింద పడటంతో చైర్ కు కట్టేస్తారు.

అదే సమయంలో లూయిస్ శిల్పాన్ని గ్యాలరీకి తీసుకెళ్లేందుకు వస్తాడు. తాము ఇవాన్ చుట్టాలమని ఆ అమ్మాయిలు లూయిస్ కు చెప్తారు. లోపలికి పిలుస్తారు. అతడు లోపలికి వెళ్లగానే రక్తం కనిపిస్తుంది. ఇవాన్ ఎక్కడో చెప్పాలని, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరిస్తాడు. అదే సమయంలో తనక తీవ్రమైన ఆయాసం వస్తుంది. అతడి ఇన్ హెల్లర్ తీసుకుని ఇద్దరు అమ్మాయిలు దానితో ఆడుకుంటారు. చివరకు లూయిస్ కిందపడటంతో గాయమై చనిపోతాడు. ఆ అమ్మాయిలు లూయిస్ శవాన్ని ప్యాక్ చేసి అతడి కారులోనే పెడతారు. లూయిస్ ను ఇవానే చంపినట్లు సీన్ క్రియేట్ చేస్తారు.

ఆ తర్వాత ఇవాన్‌ను బాగా హింసిస్తారు. చివరకు పెరట్లో గొయ్యి తవ్వి ఇవాన్ తలను మాత్రం బయటకు పెట్టి బాడీ అంతటినీ పూడ్చివేస్తారు. తలపై బండరాయితో కొట్టి చంపేస్తామని బెదిరిస్తారు. కానీ, చంపకుండా వెళ్లిపోతారు. ఇవా‌న్‌తో ఇంటిమేట్ అయిన వీడియోను అతడి ఫోన్ నుంచే ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి అక్కడే పెట్టి వెళ్లిపోతారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఇవాన్ భార్య కరేన్.. ఇంట్లో చెత్తను చూసి ఏం జరిగిందో అనుకుంటుంది. వారి అమ్మాయి జాక్ నాన్న పార్టీ చేసుకున్నారేమో అంటుంది. అక్కడితో సినిమా అయిపోతుంది.     

‘నాక్ నాక్‘ మూవీ ఎక్కడ చూడాలంటే?

ప్రస్తుతం ‘నాక్ నాక్’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే, రెంట్ పే చేసి చూడాల్సి ఉంటుంది.

Read Also: సెక్యులరిజమా? పబ్లిసిటీ స్టంటా?- విశాల్ వీడియోపై నటి కస్తూరి తీవ్ర విమర్శలు

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Embed widget