Koffee With Karan: అన్నదమ్ములను డేటింగ్ చేసిన సారా, జాన్వీ - రివీల్ చేసిన కరణ్ జోహార్
సారా, జాన్వీ ఒకానొక సమయంలో వరుసకు అన్నదమ్ములైన ఇద్దరు వ్యక్తులతో డేటింగ్ చేసిన విషయాన్ని రివీల్ చేశారు కరణ్ జోహార్.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7ని హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్స్ ఒక్కొక్కటిగా హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతున్నాయి. తాజాగా కరణ్.. సారా అలీఖాన్, జాన్వీ కపూర్ లను తన షోకి గెస్ట్ లుగా పిలిచారు. ఈ సందర్భంగా వారిద్దరిని తన ప్రశ్నలతో ఆడేసుకున్నారు కరణ్ జోహార్. డేటింగ్ విషయంపై ప్రశ్నించినప్పుడు.. సారా తనకు విజయ్ దేవరకొండని డేట్ చేయాలనుందని చెప్పింది. ఆ సమయంలో కరణ్ జోహార్.. జాన్వీ వైపు చూసి తనకు కూడా విజయ్ అంటేనే ఇష్టం అని అన్నారు. వెంటనే జాన్వీ.. 'పర్లేదు నువ్ డేటింగ్ చేయాలంటే చేస్కో' అంటూ కామెంట్ చేసింది.
ఈ విషయం పక్కన పెడితే.. సారా, జాన్వీ ఒకానొక సమయంలో వరుసకు అన్నదమ్ములైన ఇద్దరు వ్యక్తులతో డేటింగ్ చేసిన విషయాన్ని రివీల్ చేశారు కరణ్ జోహార్. అది విన్న సారా, జాన్వీ సర్ప్రైజ్ అయ్యారు. కరణ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడని జాన్వీ కానీ, సారా కానీ ఊహించలేదు. ఏదో విధంగా టాపిక్ దాటేశారు. కానీ ఈ షో చూసిన నెటిజన్లు ఈ ముద్దుగుమ్మలు డేటింగ్ చేసిన ఆ అన్నదమ్ములు ఎవరా..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఫైనల్ గా ఫొటోలతో సహా ప్రూఫ్స్ చూపిస్తున్నారు. ఇంతకీ సారా, జాన్వీ ఎవరిని డేటింగ్ చేశారంటే.. వారి పేర్లు వీర్ పహారియా, శిఖర్ పహారియా. వీరిద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేకి మనవళ్లు అవుతారు. గతంలో సారా, జాన్వీ.. వీర్, శిఖర్ లతో కలిసి తీసుకున్న ఫొటోలను ఇప్పుడు బయటకు తీస్తున్నారు నెటిజన్లు. ఆ ఫొటోలను బట్టి సారా.. వీర్ పహారియాను, జాన్వీ.. శిఖర్ ను డేటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వకముందు వీరు ఈ ప్రేమాయణాలు నడిపినట్లు సమాచారం.
Also Read: లైవ్ లోనే సుధీర్ కి ఫోన్ - అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మేనేజర్!
Also Read: మాస్ లుక్ లో 'మీటర్', క్లాసీ లుక్ లో 'రూల్స్ రంజన్'
View this post on Instagram
View this post on Instagram