Jetlee OTT : నెల రోజుల్లోపే ఓటీటీలోకి జెట్లీ - కమెడియన్ సత్య కొత్త మూవీ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Jetlee OTT Platform : కమెడియన్ సత్య, మత్తు వదలరా ఫేం రితేశ్ రానా కాంబోలో వచ్చిన రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ జెట్లీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Satya's Jetlee Movie OTT Release Date Locked : కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో వచ్చిన రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ'. మత్తు వదలరా ఫేం రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 1న థియేటర్లలోకి వచ్చి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జెట్లీ ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'అద్భుతమైన యాక్షన్‌తో కూడిన మునుపెన్నడూ లేని విమాన ప్రయాణ వినోదానికి గెట్ రెడీ' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ మూవీలో సత్యతో పాటు వెన్నెల కిశోర్, అజయ్, రియా సింఘా, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ మ్యూజిక్ అందించారు.
View this post on Instagram
Also Read : మంచు మనోజ్ దంపతుల గొప్ప నిర్ణయం - సేవా ట్రస్ట్ ప్రారంభం... ఐదుగురు చిన్నారుల దత్తత
కథ ఏంటంటే?
ప్రముఖ బిజినెస్ మ్యాన్ ప్రజాపతి (అజయ్) ప్రజలు తమ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులను స్కామ్ చేసి దేశం వదిలి దుబాయ్ పారిపోతాడు. దీంతో కేంద్ర హోం మంత్రి మేల్కోటి (శ్రీనివాస్ వడ్లమాని) అతన్ని అరెస్ట్ చేసి తిరిగి దేశానికి రప్పించే బాధ్యతను ఇంటెలిజెన్స్‌కు అప్పగిస్తాడు. స్పెషల్ ఏజెంట్‌గా శివానీ రాయ్ (రియా సింఘా)ను అప్పాయింట్ చేస్తాడు. అయితే, తన ప్రాణాలకు కొంతమంది వల్ల ముప్పు ఉందని గ్రహించిన ప్రజాపతి లొంగిపోతానని చెప్పి ఆ తర్వాత తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు.
అతన్ని చంపాలని కొందరు, ప్రాణాలతో వేరే దేశం తరలించాలని మరికొందరు ప్లాన్ చేస్తారు. దుబాయ్ నుంచి కొచ్చికి స్పెషల్ ఫ్లైట్‌లో ప్రజాపతిని తీసుకొస్తున్న టైంలో ఎటాక్ జరుగుతుంది. ఆ విమానంలోకి గతం మర్చిపోయిన స్థితిలో డాక్టర్ వేదవ్యాస్ (సత్య) ఎలా వచ్చాడు? ఎటాక్ తర్వాత ఏం జరిగింది? వేదవ్యాస్ వల్ల ప్రజాపతి ప్లాన్ ఎందుకు బెడిసికొట్టింది? ప్రజాపతిని చంపాలని చూసిన శత్రువులను వేద వ్యాస్ ఎందుకు అడ్డుకున్నాడు? అసలు వేద వ్యాస్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : అఖిల్ పుట్టినప్పుడు నాగార్జున డిజప్పాయింట్ అయ్యారా - అసలు రీజన్ ఏంటో తెలుసా?
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























