అన్వేషించండి

Aham Reboot: డైరెక్ట్‌గా ఓటీటీలోకి సుమంత్ 'అహం రీబూట్' - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్క‌డంటే?

Aham Reboot: సుమంత్ హీరోగా న‌టించిన 'అహం రీబూట్' డైరెక్ట్ గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమాని తెర‌కెక్కించారు. మ‌రి ఈ సినిమా ఎక్క‌డ, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అంటే?

Hero Sumanth's Aham Reboot Movie Direct Ott Release Streaming Date: సుమంత్ హీరోగా తెర‌కెక్కిన సినిమా 'అహం రీబూట్'. ఎట్ట‌కేల‌కు రిలీజ్ అవుతుంది. అయితే, థియేట‌ర్ల‌లో కాదు.. డైరెక్ట్ గా ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది ఈ సినిమా. షూటింగ్ మొద‌లైన దాదాపు రెండేళ్ల తర్వాత సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి తెర‌కెక్కించాడు. మ‌రి ఈ సినిమా విశేషాలేంటి? ఏ ఓటీటీలోకి వ‌స్తుంది? ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. 

స్ట్రీమింగ్ ఎక్క‌డ‌, ఎప్పుడంటే?

సుమంత్ న‌టించిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ 'అహం రీబూట్' ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జులై 30న ప్రేక్ష‌కులకు అందుబాటులోకి రానుంది ఈ సినిమా. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ట్రైల‌ర్ రిలీజ్ చేసింది ఆహా. ఆ ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. 

ఆర్జేగా సుమంత్.. 

హీరో సుమంత్.. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ్ స్టోరీలు చేశాడు. అయితే, ఇప్పుడు 'అహం రీబూట్'‌లో స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో సుమంత్ ఆర్జేగా క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీని రేడియో థీమ్‌తో తీశారు. ఇక ట్రైల‌ర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.   

ఆర్జే సుమంత్ కి ఒక అమ్మాయి నుంచి ఫోన్ వ‌స్తుంది. ఆ అమ్మాయి చాలా భ‌య‌ప‌డుతూ.. "ప్లీజ్ కాపాడండి.. నేను కిడ్నాప్ అయ్యాను అనుకుంటా" అంటూ ఇంగ్లీష్ లో చెప్తుంది. "న‌న్ను కాపాడండి. ఫోన్ క‌ట్ చేయొద్దు. ప్లీజ్.. ప్లీజ్.. చీక‌టి రూమ్ లో ఉన్నాను నాకు భ‌యం వేస్తుంది" అంటుంది. అప్పుడు సుమంత్ ఆమెకు ధైర్యం చెప్తాడు. "ఏమీ కాదు ఎలాగైనా కాపాడ‌తాను" అంటాడు. "ఫోన్ స్విచాఫ్ అయిపోతే ప‌రిస్థితి ఏంటి" అంటూ భ‌య‌ప‌డుతూ చెప్తున్న‌ట్లు ట్రైల‌ర్ లో ఉంది. దీంతో ఆ అమ్మాయిని హీరో కాపాడ‌తాడా? లేదా? అస‌లు అమ్మాయి ఎవ‌రు? కిడ్నాప్ ఎందుకు చేశారు? త‌నేనా ఇంకా ఎవ‌రైనా ఉన్నారా? అస‌లు ఆమె రేడియోకి ఎందుకు ఫోన్ చేసింది? అని ఇంట్రెస్ట్ క‌లిగించారు ట్రైల‌ర్ తో. దీంతో ఇవ‌న్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

మొద‌లైన మూడేళ్ల త‌ర్వాత‌.. 

‘అహం రీబూట్’ సినిమా 2021లో మొద‌లైంది. కాగా.. 2022 లో దీని ఫ‌స్ట్ పోస్ట‌ర్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు జ‌నాల్లో. కార‌ణం ఏంటో తెలియ‌దు కాని సినిమా మొద‌లైన దాదాపు మూడేళ్ల‌కు రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఓటీటీలో. ఇక ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మించారు. ప్రశాంత్ సాగర్అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి శ్రీరామ్ మద్దూరి సంగీత దర్శకుడు. వరుణ్ అంకర్ల సినిమాటోగ్రఫీ అందించారు. చూడాలి మ‌రి సుమంత్ ఆర్జేగా ఎంత‌లా మెప్పిస్తాడు అని.  

Also Read: కాకుడా... ఓటీటీలోకి పిల్ల దెయ్యంతో వందకోట్లు కొట్టిన దర్శకుడి కొత్త సినిమా

టాప్ హెడ్ లైన్స్

OTT Latest Movie: బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
Sshhh Season 3 OTT : ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి
ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget