అన్వేషించండి

Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!

Korean Web Series: కొరియన్ భాషల్లోని సినిమాలన్నా, వెబ్ సిరీస్‌లన్నా చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అలాంటి వారు కినోటైల్స్ ర్యాంకింగ్‌లో టాప్ స్థానాలను దక్కించుకున్న ఈ సిరీస్‌లపై ఓ లుక్కేయండి.

Top 5 K Dramas: సౌత్ కొరియన్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి కే డ్రామాలకు వచ్చే రేటింగ్, టీఆర్‌పీని బట్టి వాటికి ఒక ర్యాంక్ ఇవ్వడానికి కినోలైట్స్ అనే ఒక ఫారమ్ ఉంటుంది. ఇక ఏప్రిల్ చివరి వారంలో కే డ్రామాలలో దేనికి ఎక్కువ రేటింగ్ లభించిందో తాజాగా ఈ ఫారమ్ బయటపెట్టింది. దీన్ని బట్టి చూస్తే.. కిమ్ సూ హ్యూన్, కిమ్ జీ వాన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీకి మరోసారి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఈవారం కూడా వారు కలిసి నటించిన ‘క్వీన్ ఆఫ్ టియర్స్’కు రికార్డ్ స్థాయిలో టీఆర్‌పీలు వచ్చాయి. 

కే డ్రామా డామినేషన్..

గతవారం కూడా ‘క్వీన్ ఆఫ్ టియర్స్’.. అత్యధిక రేటింగ్‌తో కే డ్రామాలలోనే టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ వారం కూడా ఈ సిరీస్.. తన స్థానాన్ని కాపాడుకుంది. టీవీఎన్‌‌లో ప్రసారమయ్యే ‘క్వీన్ ఆఫ్ టియర్స్’.. హీరోహీరోయిన్ పెళ్లిలో ఎదుర్కునే మనస్పర్థల కథాంశంతో సాగుతుంది. శనివారం, ఆదివారం మాత్రమే టెలికాస్ట్ అయ్యే ఈ సిరీస్.. ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ‘క్వీన్ ఆఫ్ టియర్స్’లోని ఎపిసోడ్ 14కు 21.6 శాతం రేటింగ్స్ లభించాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్తోంది కినోలైట్స్. ఈ సీరిస్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

కెమిస్ట్రీకి మార్కులు..

‘క్వీన్ ఆఫ్ టియర్స్’ తర్వాత కినోలైట్స్ లిస్ట్‌లో రెండో స్థానాన్ని దక్కించుకున్న కే డ్రామా ‘లవ్లీ రన్నర్’. ప్రతీ సోమవారం, మంగళవారం.. ఇది టీవీఎన్‌లో ప్రసారమవుతుంది. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు.. ఇందులో టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన బ్యోన్ వూ సోక్, కిమ్ హై యూన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందుకే ప్రతీవారం తన రేటింగ్‌ను పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది ‘లవ్లీ రన్నర్’.

Also Read: 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడితో హీరోయిన్ పెళ్లి - హల్దీ వేడుకలో అపర్ణా దాస్ సందడి

రికార్డ్ సృష్టిస్తున్న పారాసైట్..

నెట్‌ఫ్లిక్స్‌లో కే డ్రామా సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు విపరీతమైన పాపులారిటీ ఉంది. అందుకే ఇటీవల విడుదలయిన ‘పారాసైట్: ది గ్రే’ అనే సిరీస్‌ను చూడడానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఏప్రిల్ 5న స్ట్రీమింగ్ ప్రారంభించుకున్న ఈ సిరీస్‌లో ఇయోన్ సో నీ, కో క్యో హ్వాన్, లీ యుంగ్ హ్యూన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఆకాశం నుండి రాలిపడే ఒక పారాసైట్.. మనుషులను లోబరుచుకుంటుంది. ఆ తర్వాత మనిషి ఒక వింతజీవిగా మారిపోతాడు. ఇలా డిఫరెంట్ విజువల్స్‌తో తెరకెక్కిన ‘పారాసైట్: ది గ్రే’ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లను విపరీతంగా ఆకట్టుకుని కినోలైట్స్ లిస్ట్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

డిటెక్టివ్ కథ..

కినోలైట్స్ లిస్ట్‌లో 4వ స్థానంలో ఉంది ‘చీఫ్ డిటెక్టివ్ 1958’. ఈ సిరీస్ ప్రతీ శుక్రవారం, శనివారం.. ఎమ్‌బీసీ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. అయితే మిగతా కే డ్రామాలలాగా ఇది రొమాంటిక్ కామెడీ లేదా సైన్స్ ఫిక్షన్ మాత్రం కాదు. ‘చీఫ్ డిటెక్టివ్ 1958’ అనేది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. దీని కథ మొత్తం 1950 కాలంలోనే తిరుగుతుంది. డిటెక్టివ్ పార్క్ యంగ్ హాన్.. కేసులను ఎలా ఛేదిస్తాడు అనేది ఈ సిరీస్ ముఖ్య కథ. 

బయోటెక్ రంగంలో వింతలు..

ఇక కినోలైట్స్ టాప్ 5 కే డ్రామా లిస్ట్‌లో చివరి స్థానాన్ని దక్కించుకుంది ‘బ్లడ్ ఫ్రీ’. ఈ సిరీస్ ప్రతీ బుధవారం.. డిస్నీ ప్లస్‌లో టెలికాస్ట్ అవుతుంది. లిస్ట్‌లో ఉన్న కే డ్రామాలతో పోలిస్తే ‘బ్లడ్ ఫ్రీ’ కాస్త డిఫరెంట్. భవిష్యత్తులో మనుషులు మాంసాన్ని ఎలా తింటారు అనే కొత్త ఆలోచనతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో హాంగ్ హ్యో హూ, యో యీ హూన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కిన సిరీస్ అని చెప్పవచ్చు. బయోటెక్ రంగంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను ‘బ్లడ్ ఫ్రీ’.. ప్రేక్షకులకు తెలిసేలా చేస్తుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఇంటికెళ్లిన 'కెజియఫ్', 'సలార్' డైరెక్టర్ - ఇద్దరి కాంబోలో సినిమా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Embed widget