అన్వేషించండి

This Week Movie Releases: ఈ ఇయర్ ఎండ్ వారాంతంలో సినిమాల సందడి - ఓటీటీ థియేటర్స్‌లో రిలీజయ్యే క్రేజీ మూవీస్ ఇవే

OTT Releases: 2023 చివరి వారంలో ఎన్నో సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా సందడి చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ మొదలుపెట్టగా.. మరికొన్ని డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

2023 మొత్తంలో డిసెంబర్‌లోనే సినిమాల సందడి ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ఇప్పటివరకు డిసెంబర్‌లో విడుదలైన చాలావరకు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. అందుకే డిసెంబర్ చివరి వారంలో కూడా మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అందులో మూడు తెలుగు చిత్రాలే కాగా.. ఒక కన్నడ చిత్రం కూడా ఉంది. 

డెవిల్

కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రమే ‘డెవిల్’. ఇదొక పీరియాడిక్ థ్రిల్లర్. స్వాతంత్ర్యం రాకముందు జరిగిన కథతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అభిషేక్ నామా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలయిన ‘డెవిల్’ టీజర్, ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక డిసెంబర్ 29న ‘డెవిల్’ థియేటర్లలో సందడి చేయనుంది.

బబుల్‌‌గమ్

ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై యాంకరింగ్‌లో మహారాణిగా వెలిగిపోతోంది సుమ. ఇప్పటికీ తనకు పోటీ ఇచ్చే లేడీ యాంకర్ లేదు. అలాంటి సుమకు వారసుడిగా రోషన్ కనకాల వెండితెరపై అడుగుపెట్టనున్నాడు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అయిన ‘బబుల్‌గమ్‌’తో మొదటిసారి హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడు రోషన్. ఈ మూవీ కూడా ‘డెవిల్’తో పోటీపడుతూ డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో వహిస్తున్న ‘బబుల్‌గమ్‌’తో మానసా చౌదరీ హీరోయిన్‌గా పరిచయం కానుంది.

కాటేరా

రెండు తెలుగు సినిమాలతో పాటు ఒక కన్నడ చిత్రం కూడా డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. అదే ‘కాటేరా’. సీనియర్ హీరో దర్శన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించింది. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ‘కాటేరా’పై మూవీ టీమ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వీటితో పాటు రవితేజ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వెంకీ’ కూడా డిసెంబర్ 30న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.

ఓటీటీ‌లో స్రీమ్ అయ్యే సినిమాలివే:

ఇక ఓటీటీ రిలీజ్‌ల విషయానికొస్తే.. అన్నింటికంటే ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఈవారం రిలీజ్‌లు ఎక్కువగా ఉన్నాయి.

  • అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఖో గయే హమ్ కహా’ సినిమా డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. అర్జున్ వరైన్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యూత్ నుంచి ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు అందుతున్నాయి.
  • డిసెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా రెండు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా విడుదల కానుంది.
  • నయనతార హీరోయిన్‌గా నటించిన 75వ చిత్రం ‘అన్నపూర్ణి’ ఓటీటీ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొని ఈ శుక్రవారం స్ట్రీమింగ్‌కు సిద్ధం చేసింది.
  • ‘థ్రీ ఆఫ్ అజ్’ అనే హిందీ మూవీ కూడా శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది.
  • ‘మనీహీస్ట్’లో భాగమైన ‘బెర్లిన్’ వెబ్ సిరీస్ కూడా శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుంది.
  • డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇప్పటికే ‘మంగళవారం’ స్ట్రీమింగ్ మొదలయ్యింది.
  • డిసెంబర్ 29 నుంచి ‘12 ఫెయిల్’ చిత్రం కూడా హాట్‌స్టార్‌లోనే స్ట్రీమ్ అవ్వనుంది.
  • తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కీడా కోల’ డిసెంబర్ 29 నుంచి ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.

‘కీడా కోలా’ ట్రైలర్:

Also Read: బాలీవుడ్‌లో బడా ప్రాజెక్ట్ కొట్టేసిన ‘యానిమల్’ బ్యూటీ! యంగ్ హీరోతో జోడీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
TTD News: గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ ఆరోపణ - ఫేక్ ఫోటోలని టీటీడీ ఆగ్రహం - కేసులు పెడతారా?
గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ ఆరోపణ - ఫేక్ ఫోటోలని టీటీడీ ఆగ్రహం - కేసులు పెడతారా?
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Mass Jathara: మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ డేట్ ఫిక్స్? - సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తారా?
మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ డేట్ ఫిక్స్? - సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తారా?
Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
Embed widget