Harikatha Web Series: హరికథలో హత్యలు చేసింది దేవుడా? దేవుడి ముసుగులో హంతకుడా? హాట్‌స్టార్‌లో రాజేంద్ర ప్రసాద్ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Harikatha Web Series Release Date: రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన డిస్నీ హాట్ స్టార్ వెబ్ సిరీస్ ‘హరికథ’. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
సినిమా, వెబ్ సిరీస్... ఇలా ఏదైనా కావచ్చు. కథ, కథనాల్లో మైథాలజికల్ టచ్ లేదా రిఫరెన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ మధ్య రిలీజైన 'కల్కి 2898 ఏడీ', 'హనుమాన్' ఇలా చాలా సినిమాలు మైథాలజీ టచ్‌తో సూపర్ హిట్ అయినవే. తాజాగా వెబ్ సిరీస్‌లు అదే ట్రెండ్ లో నడవడానికి సిద్ధం అవుతున్నాయి. తాజాగా మైథలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. అదే 'హరికథ'
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'హరికథ'
Harikatha Telugu Web Series Release Date: డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందిన వెబ్ సిరీస్ 'హరికథ'. ఇందులో నట కిరీటి డా రాజేంద్ర ప్రసాద్, శ్రీ రామ్, దివి వడ్త్యా, పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి కీలక పాత్రలు పోషించారు. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. మ్యాగీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. లేటెస్టుగా ట్రైలర్ విడుదల చేశారు.
View this post on Instagram
అపరిచితుడా? దేవుడా? ఎవరు?
పాపాలు చేస్తున్న వారికి శిక్షించడానికి పోలీసులు, చట్టాలు, కోర్టులు ఉన్నాయి. కానీ ఆ వ్యవస్థలే చేతులు ముడుచుకు కూర్చుంటే ధర్మాన్ని కాపాడటానికి ఆ దేవుడే దిగి వస్తాడా? లేదా దేవుడి పేరుతో అపరిచితుడు శిక్షిస్తున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘హరికథ’ వెబ్ సిరీస్ చూడాల్సిందే. పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి... ఇలా శ్రీవిష్ణు అవతారాల రూపాల్లో ఉన్న వ్యక్తి హత్యలు చేస్తూ ఉంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్నది దేవుడా? దేవుడి ముసుగులో హంతకుడా? అని పరిశోధించే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ రామ్ నటించారు. రంగస్థల నాటక కళాకారునిగా రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.
Also Read: జీబ్రా రివ్యూ: సత్యదేవ్ వర్సెస్ డాలీ ధనుంజయ... హీరోలు ఇద్దరిలో ఎవరిది పైచేయి? మూవీ హిట్టేనా?
‘ఆహా’లో ప్రసారమైన ‘సేనాపతి’ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘కృష్ణా రామా’ అనే చిత్రంలో, ‘బెంచ్ లైఫ్’ అనే వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఆయన నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ లో హత్యలు చేసేది రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టరా? లేక మరొకరా? అని క్యూరియాసిటీ పెంచేలా ‘హరికథ’ ట్రైలర్ కట్ చేశారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి వడ్త్యాతో పాటు పూజిత పొన్నాడ, రాజేంద్ర ప్రసాద్, శ్రీ రామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిత సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.