అన్వేషించండి

GV Prakash’s Rebel: ఓటీటీలోకి వచ్చేసిన మమితా, జీవీ ప్రకాష్ మూవీ - థియేట‌ర్‌లో రిలీజైన రెండు వారాల‌కే!

Rebel: ఈ మ‌ధ్య కొన్ని సినిమాలు.. రిలీజైన వెంట‌నే ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. త‌క్కువ టైంలోనే ప్రేక్ష‌కుల‌ను ఓటీటీల్లో అల‌రిస్తున్నాయి. ఈ సినిమా రిలీజైన రెండు వారాల‌కే ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది.

GV Prakash & Mamitha Baiju’s Rebel arrives on OTT within two weeks of theatrical release: 'ప్రేమ‌లు' హీరోయిన్.. ఇప్పుడు ఈమె క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో కూడా ఎంతోమంది మ‌న‌సు దోచుకుంది ఈ భామ‌. రాజ‌మౌళి లాంటి ప్ర‌ముఖుల మ‌న్న‌న‌లు పొందింది. ఇక ఇప్పుడు ఈమె న‌టించిన త‌మిళ్ సినిమా 'రెబ‌ల్' రిలీస్ అయిన విషయం తెలిసిందే. ఇక అంతేకాకుండా మ్యూజిక్ తో మెస్మ‌రైజ్ చేసిన జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాలో న‌టించారు. థియేట‌ర్ల‌లో ఇటీవ‌ల‌ రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అయితే, స‌ర్ ప్రైజింగ్ గా అది ఓటీటీలోకి వ‌చ్చేసింది. థియేట‌ర్ లో రిలీజైన రెండు వారాల‌కే ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. 

స్ట్రీమింగ్ ఎక్క‌డంటే? 

'రెబ‌ల్' సినిమా.. మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్రకాశ్, ప్రేమ‌లు హీరోయిన్ మ‌మిత బైజు న‌టించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీల్లోకి అందుబాటులోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్ తో ఈ సినిమా అందుబాటులో ఉన్న‌ట్లు టీమ్ ప్ర‌క‌టించింది. 

ట్రైల‌ర్ నుంచే మంచి అంచ‌నాలు.. 

తమిళ స్టార్ హీరో ధనుష్ ‘రెబల్’ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైల‌ర్ నుంచే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న ‘రెబల్’లో జీవీ ప్రకాష్ మాస్ యాక్షన్ తో అదరగొట్టారు. పంచెకట్టు, చేతిలో కత్తితో సరికొత్తగా కనిపించాడు. ట్రైలర్ అంతా ప్రేమ, క్యాంపస్ రాజకీయాలు, కొట్లాటల చుట్టూనే తిరుగుతూ కనిపించింది. దీంతో ఈ సినిమా కోసం అంద‌రూ వెయిట్ చేశారు.

ఇక ఇప్పుడు ఇంత త్వ‌ర‌గా అందుబాటులోకి రావ‌డంతో సినిమా ల‌వ‌ర్స్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రేమ‌లు సినిమా త‌ర్వాత ఆ హీరోయిన్ కి కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఆమె కోసం యూత్ సినిమా చూసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక ‘రెబల్’ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ నిర్మించారు. జీవీ ప్రకాష్ సరసన మమిత బైజు హీరోయిన్‌గా నటించారు. కరుణాస్, సుబ్రమణి శివ, షాలు రహీం సహా పలువురు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో. ఈ సినిమాకు జీవీ ప్రకాషే సంగీతం అందిస్తున్నారు.   

భారీ చిత్రాలతో జీవీ ప్రకాష్ ఫుల్ బిజీ

ఎన్నో మంచి పాట‌లు కంపోజ్ చేసిన జీవి ప్ర‌కాశ్.. ఈ సినిమా ద్వారా న‌టుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘తంగళన్’, కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’, అక్షయ్ కుమార్ ’సర్ఫీరా’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, నితిన్ ‘రాబిన్ హుడ్’, సూర్య హీరోగా నటిస్తున్న ఓ కొత్త సినిమాతో పాటు పలు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలకు ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ఇడిముజక్కం’, ‘13’, ‘కాల్వన్ అండ్ డియర్’ చిత్రాల్లో నటిస్తున్నారు.  

Also Read: రణబీర్ ‘రామాయణ్’ లీక్స్ - దశరధుడి పాత్రలో అలనాటి రాముడు, కీలక పాత్రలో లారాదత్త, లీకైన ఫొటోలు చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Dinga Dinga: జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Embed widget