అన్వేషించండి

Ramayana Movie: రణబీర్ ‘రామాయణ్’ లీక్స్ - దశరధుడి పాత్రలో అలనాటి రాముడు, కీలక పాత్రలో లారాదత్త, లీకైన ఫొటోలు చూశారా?

Ramayana Movie: 'రామాయ‌ణ' సెట్స్ నుంచి ఫొటోలు లీక్ అయ్యాయి. సోష‌ల్ మీడియాలో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. దీంతో ర‌ణ్ బీర్ క‌పూర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Photos Leaked From Ramayana Movie Sets: 'రామాయ‌ణ'.. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంది విప‌రీత‌మైన హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాకి సంబంధించిన విష‌యాల గురించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాన‌ప్ప‌టికీ.. ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే ఉంటుంది. హెడ్ లైన్స్ లో క‌నిపిస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఫొటోలు వైర‌ల్ గా మారాయి లారా ద‌త్త‌, అరుణ్ గోవిల్ ఫొటోలు లీక్ అయ్యాయి. వాళ్లిద్ద‌రూ సెట్స్ లో ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ఫొటోలు లీక్.. 

రామాయ‌ణ సినిమా షూటింగ్ ఈ మ‌ధ్య మొద‌లైన‌ట్లుగా కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోలు తెగ వైర‌ల్ అయ్యాయి కూడా. కాగా.. ఇప్పుడు సెట్ లో షూటింగ్ జ‌రుగుతున్న దృశ్యాలు, దాంట్లో లారా ద‌త్త‌, అరుణ్ గోవిల్ కి సంబంధించి క్యారెక్ట‌ర్ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు ట్విట్ట‌ర్ లో తెగ షేర్ చేస్తున్నారు. 'రామాయ‌ణ' సీరియ‌ల్ లో రాముడిగా న‌టించిన అరుణ్ గోవిల్ ఈ సినిమాలో ద‌శ‌ర‌ధుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఆ పాత్ర‌కు సంబంధించి మేక‌ప్ లో ఉండ‌గా ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. దాంట్లో ఆయన పెద్ద కిరీటం పెట్టుకుని వున్నారు. ఇక లారా ద‌త్త కైకేయి పాత్ర‌లో న‌టిస్తోంది. ఆమె ఆ వేషంలో ఉన్న ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. 

ఫ్యాన్స్ ఫైర్.. 

ఇలా ఫొటోలు లీక్ అవ్వ‌డంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలా లీక్ అయితే, ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అస‌లు ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించి షూటింగ్ జ‌రుగుతుంటే.. సెల్ ఫోన్లు అనుమ‌తించ‌కూడ‌దు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ద‌య‌చేసి వీటిని వైర‌ల్ చేయొద్దు అంటూ కొంత‌మంది కామెంట్లు పెడుతున్నారు. 

2025 దీపావ‌ళికి రిలీజ్.. 

'రామాయ‌ణ' సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. కాగా.. రిలీజ్ కి సంబంధించి ఒక వార్త వైర‌ల్ అవుతోంది. అదే రిలీజ్ డేట్. 2025లో దీపావ‌ళికి ఈ సినిమా రిలీజ్ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు ర‌ణ బీర్ క‌పూర్ రాముడిగా నిటిస్తున్నారు. సీత‌గా సాయి ప‌ల్ల‌వి నటిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆలియా భ‌ట్ ని సంప్ర‌దించ‌గా ఆమెకు డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో సాయి ప‌ల్ల‌విని ఫైన‌ల్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే, సాయిప‌ల్ల‌వి ప్లేస్ లో జాన్వీ క‌పూర్ ని ఫైన‌ల్ చేసిన‌ట్లుగా కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక కేజీఎఫ్ స్టార్ య‌ష్ రావ‌ణుడిగా, స‌న్నీ డియోల్ హ‌నుమంతుడిగా, బాబీ డియోల్, విజ‌య సేతుప‌తి కుంభ‌క‌ర్ణ‌, విభీష‌ణుడి పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే, ఈసినిమాకి సంబంధించి.. ఎలాంటి విష‌యాలు కూడా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. 

వ‌ర్క‌వుట్స్ చేస్తున్న ర‌ణ్ బీర్.. 

'రామాయ‌ణ' ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి వ‌స్తున్న వార్త రాముడిగా ర‌ణ్ బీర్ క‌పూర్ నటిస్తునారు అని. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే, ఇటీవ‌ల ర‌ణ్ బీర్ క‌పూర్ సినిమా కోసం వ‌ర్క‌వుట్స్ చేస్తున్న‌ట్లుగా వార్త వైర‌ల్ అయ్యింది. ర‌ణ్ బీర్ క‌పూర్ ట్రైన‌ర్ ఒక ఫొటోను షేర్ చేస్తూ దానికి #headstand #ramayan #newskill #trainingwithnam #prep అంటూ హ్యాష్‌ట్యాగ్ లు పెట్టారు. దీంతో రామాయాణ హ్యాష్ ట్యాగ్ ఉండ‌టంతో ఆ సినిమా కోసం ర‌ణ్ బీర్ వ‌ర్కౌట్ చేస్తున్నార‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. 

Also Read: మోడలింగ్‌ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు - రష్మిక గురించి ఈ విషయాలు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget