అన్వేషించండి

Ghaati OTT: ఓటీటీలోకి అనుష్క 'ఘాటి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

Ghaati OTT Platform: స్వీటీ అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 5న థియేటర్లలోకి రాగా 20 రోజుల్లోపే అందుబాటులోకి రానుంది.

Anushka Shetty's Ghaati OTT Release On Amazon Prime Video: స్వీటీ అనుష్క లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'ఘాటి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా ఈ నెల 26 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. చాలా రోజుల తర్వాత అనుష్క పవర్ ఫుల్ పాత్రలో 'ఘాటి'తో మెప్పించినా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.

ఈ మూవీలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, చైతన్యరావు, జగపతిబాబు, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.

Also Read: యేసుదాస్‌‌కు ప్రతిష్టాత్మక ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు - సాయిపల్లవి, అనిరుథ్ రవిచందర్‌లకు కలైమామణి పురస్కారాలు

'ఘాటి' కథ ఏంటంటే?

ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో ఈ స్టోరీ సాగుతుంది. అక్కడి ఎత్తైన పర్వతాల మధ్య ప్రాంతాల్లో 4 రకాల గంజాయి సాగు చేస్తారు. అరుదైన, నాణ్యత కలిగిన మేలిరకం శీలావతి అక్కడి కొండల్లో మాత్రమే పండుతుంది. ఈ గంజాయి పంటలపై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుంటారు కుందుల నాయుడు (చైతన్యరావు) కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్). అక్కడ ఈ ఇద్దరు సోదరులదే దందా. వేరే ఎవరైనా గంజాయి సాగు చేస్తూ ఈ వ్యాపారంలో చేయి పెడితే వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటారు. ఇక్కడ పండే గంజాయిని ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా వీరికి చేరవేస్తారు.

వీరు ఆ గంజాయిని తమ బాస్ మహావీర్ (జిషు సేన్ గుప్తా)కు పంపుతారు. అయితే, తమ ఘాటిలకు తగిన ఫలితం దక్కడం లేదని ఘాటి తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్ ప్రభు) ఓ కొత్త ఆలోచన చేస్తాడు. ఈ ఇద్దరు సోదరులకు తెలీకుండా ద్రవ రూపంలో గంజాయి తయారు చేస్తాడు. దీన్ని తన మరదలు శీలావతి (అనుష్క)తో కలిసి అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న నాయుడు సోదరులు వారిని అంతమొందించాలని ప్లాన్ చేస్తారు. వారిని తప్పించుకునే క్రమంలో శీలావతి, దేశీరాజులకు ఎదురైన పరిణామాలేంటి? ఘాటిల నాయకురాలిగా శీలావతి ఎలా ఎదిగింది? ఘాటిలను అక్రమాలకు వాడుకుంటున్న నాయుడు సోదరుల ఆగడాలకు ఎలా చెక్ పెట్టింది? ఆమెకు పోలీస్ ఆఫీసర్ జగపతి బాబు ఎలాంటి సహాయం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget