అన్వేషించండి

Game Of Thrones: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఇంకా చూడలేదా? మీకో బ్యాడ్ న్యూస్ - ఈ తేదీ నుంచి ఆ వెబ్‌సీరిస్‌లు కనిపించవు

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత కొంత కాలంగా స్ట్రీమింగ్ అవుతున్న HBO కంటెంట్ ను మార్చి 31 తర్వాత తొలగించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వెలువడింది.. ఇప్పటి వరకు ఆ కంటెంట్ ని చూడకుంటే చివరి అవకాశం

Game Of Thrones, The Last Of Us వెబ్ సీరిస్‌లు చూశారా? ఇంకా చూడకపోతే ఇప్పుడే మొదలుపెట్టండి. ఎందుకంటే.. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో ఇకపై HBO కంటెంట్ కనిపించదట.
 
ఇండియాలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌’ ఓటీటీ పలు హాలీవుడ్‌ సినిమాలను, సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. వాటిలో చాలా వరకు HBO కంటెంట్ ఉంటుంది. చాలా సంవత్సరాలుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌, HBO  మధ్య ఉన్న ఒప్పందం కొనసాగుతూ వస్తోంది. ఆ ఒప్పందం కారణంగా HBO నెట్ వర్క్‌ కంటెంట్‌ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఒప్పందంను రెన్యూవల్‌ చేసుకుంటూ కంటెంట్‌ను కొనసాగిస్తున్నారు. కానీ ఈసారి ఆ ఒప్పందం రెన్యూవల్‌ కాలేదట. దీంతో మార్చి 31 తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఉండే HBO కంటెంట్‌ ను పూర్తిగా తొలగిస్తున్నారట.
 
ఒక వేళ మీరు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌’ (Game of Thrones), ‘ది లాస్ట్ ఆఫ్ అజ్’ (The Last Of Us).. వంటి పాపులర్ వెబ్ సీరిస్‌లను ఇంకా చూడనట్లయితే ఇప్పుడే చూసేయండని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హింట్ ఇచ్చింది. HBO తో ఒప్పందం రద్దు చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆ స్థానంలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు మరింత ఆసక్తికర కంటెంట్‌‌ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 

ఇండియాలోకి HBO Max

HBO Max ఓటీటీ ప్రస్తుతం అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉంది. ఇండియాలోకి కూడా HBO మ్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఓటీటీగా HBO మాక్స్ నిలిచింది. సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు దాదాపుగా రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందట. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ నుంచి HBO కంటెంట్‌ తీసేయడం వల్ల సబ్‌ స్క్రైబర్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా. ఈ లోపే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రత్యామ్నాయం చూస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరో వైపు ఇండియాలో అత్యధిక హాలీవుడ్ కంటెంట్ ఇచ్చే ఓటీటీ లుగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు ఉన్నాయి. 
 
 
ఒకప్పుడు సినీ రంగానికి టీవీ చానెళ్లు గట్టిపోటీ ఇస్తున్నాయని, టీవీ సీరియల్స్ వల్ల థియేటర్లకు ఎవరూ రావడం లేదని గగ్గోలు పెట్టేవారు. అయితే, జనాలకు సీరియల్స్ ముఖం మొత్తేయడం వల్ల మళ్లీ థియేటర్లకు కళ వచ్చింది. అయితే, కరోనా వైరస్ వల్ల ప్రజల ఫోకస్ ఓటీటీలపై పడింది. ముఖ్యంగా వెబ్ సీరిస్‌లను చూసేందుకు అలవాటుపడ్డారు. దీంతో సినీ రంగానికి ఇదో పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అయితే, నటీనటులు, దర్శక  నిర్మాతలు ఓటీటీలను సైతం సొమ్ము చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఓటీటీల వల్ల ప్రధానంగా నష్టపోతున్నది థియేటర్ యాజమాన్యాలే. 

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 8 సినిమాలు స్ట్రీమింగ్... ఈ బ్లాక్ బస్టర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 8 సినిమాలు స్ట్రీమింగ్... ఈ బ్లాక్ బస్టర్స్ డోంట్ మిస్
This Week OTT Releases : నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్
నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్
Hanuman Ansh OTT : మూడు ఓటీటీల్లోకి హనుమాన్ అంశ్ - బ్లాక్ బస్టర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
మూడు ఓటీటీల్లోకి హనుమాన్ అంశ్ - బ్లాక్ బస్టర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Embed widget