Funky OTT : ఆ ఓటీటీలోకి విశ్వక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Funky OTT Platform : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' ఓటీటీ ప్లాట్ ఫాం లాక్ అయ్యింది. థియేట్రికల్ రన్ తర్వాత సినిమా ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Vishwak Sen's Funky OTT Platfrom Locked : మాస్ కా దాస్ విశ్వక్ సేన్, 'జాతి రత్నాలు' ఫేం అనుదీప్ కాంబోలో వచ్చిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ'. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'ఫంకీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సినిమాలో విశ్వక్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా... భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
Also Read : ఎన్టీఆర్, నీల్ 'డ్రాగన్' బిగ్ ఓటీటీ డీల్! - టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్... కండీషన్స్ అప్లై
2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఇక ఫస్ట్ డే సినిమాకు ఇండియావ్యాప్తంగా రూ.2.20 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా... రెండో రోజు రూ.2 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓపెనింగ్ డే మొత్తంగా రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్ రూ.1.9 కోట్ల వసూళ్లు సాధించింది.
స్టోరీ ఏంటంటే?
కోమల్ (విశ్వక్ సేన్) ఓ కొత్త దర్శకుడు. మంచి ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థలో ఫస్ట్ మూవీ ఛాన్స్ అందుకుని రూ.4 కోట్లలో మూవీ చేస్తానని చెప్పి ప్రారంభిస్తాడు. ఆ బడ్జెట్ కాస్త రూ.40 కోట్లకు చేరుతుంది. అయినా మూవీ పూర్తి కాదు. దీంతో నిర్మాత (నరేష్) ఒత్తిడికి గురై ఆస్పత్రి పాలవుతాడు. ఇది తెలుసుకున్న నిర్మాత కుమార్తె చిత్ర (కయాదు లోహర్) సినిమా బాధ్యతల్ని తీసుకుంటుంది. బడ్జెట్ పెరగకుండా రూ.కోటితో మూవీ తీయిస్తానని చెప్పి రంగంలోకి దిగుతుంది.
ఈ క్రమంలో చిత్రతో కోమల్ ప్రేమలో పడతాడు. ఆ విషయం ఆమెకు చెప్పాడా? చెప్పినట్లుగానే అనుకున్న బడ్జెట్‌లోనే మూవీ పూర్తైందా? మూవీ కంప్లీట్ అయ్యే లోపు ఇద్దరి మధ్య ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
























