Raakaasaa Release : 'మ్యాడ్' హీరో హారర్ ఫాంటసీ 'రాకాస' - ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లలో...
Raakaasaa Release Date : యంగ్ హీరో సంగీత్ శోభన్ హరర్ ఫాంటసీ 'రాకాస' ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. దాదాపు 350కు పైగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Sangeeth Sobhan's Raakaasaa Movie Big Release In Overseas : 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హారర్ ఫాంటసీ 'రాకాస'. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
350కి పైగా థియేటర్లలో...
'రాకాస' మూవీ ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ఈ మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. US, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో 350కి పైగా థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. 'రాకాస' గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1.8 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది. ఇదొక విజువల్ వండర్‌గా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉండనుంది. ఏప్రిల్ 2నే ఓవర్సీస్‌లో మూవీ రిలీజ్ కానుంది.
ప్రస్తుతం మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఎడిట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ వంటి వాటిపై వర్క్ జరుగుతోంది. గతంలో విడుదల చేసిన పోస్టర్, గ్లింప్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. మూవీలో కామెడీతో పాటు కొత్త పాయింట్‌ను చూపించనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
Also Read : ఎన్టీఆర్, నీల్ 'డ్రాగన్' బిగ్ ఓటీటీ డీల్! - టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్... కండీషన్స్ అప్లై
మానస శర్మ దర్శకత్వం వహించిన మూవీలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక జంటగా నటించారు. వీరితో పాటే వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంగీత్ శోభన్‌తో మానస శర్మ తీసిన ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మించారు. ఇప్పుడు మళ్లీ ఈ టీం కలిసి వస్తోంది. గతం కంటే భిన్నంగా డిఫరెంట్ రోల్‌లో సంగీత్ కనిపించనున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది.
ఇక 'రాకాస' చిత్రాన్ని Z స్టూడియోస్ సమర్పిస్తుండగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని దక్కించుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Also Read : 'ఫంకీ' రెండో రోజు కలెక్షన్స్... నెగిటివ్ టాక్‌తోనూ స్టడీగా విశ్వక్ సేన్ సినిమా - ఇండియా నెట్ ఎంతంటే?
























