NTR Dragon OTT : ఎన్టీఆర్, నీల్ 'డ్రాగన్' బిగ్ ఓటీటీ డీల్! - టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్... కండీషన్స్ అప్లై
NTR Neel Movie : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ 'డ్రాగన్' షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇదే బిగ్ డీల్ అని సమాచారం.

NTR Neel Dragon Movie OTT Deal Confirmed : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... జోర్డాన్‌లో షెడ్యూల్ జరుగుతోంది. బిగ్ స్టార్, బిగ్ కాంబో క్రేజ్ దృష్ట్యా అప్పుడే ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే...
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.125 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ అని చెబుతున్నారు. అయితే, ఈ ఒప్పందం మూవీ టాక్, రెస్పాన్స్ బట్టి ఉంటుందంట. గతంలో ఎన్టీఆర్ 'దేవర' సినిమా కూడా నెట్ ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతోంది.
కండిషన్స్ ఇవే...
గతంలో ఏదైనా మూవీని ఓటీటీలు కొన్నప్పుడు అవి థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోకపోయినా ముందుగా అనుకున్న డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. దీంతో ఓటీటీలకు నష్టం వాటిల్లేది. అయితే, ప్రస్తుతం ఓటీటీ సంస్థలు డిజిటల్ ఒప్పందాలను మూవీ థియేట్రికల్ ప్రదర్శనకు లింక్ చేస్తున్నాయి. దీంతో ఒకవేళ మూవీ బాక్సాఫీస్ వద్ద కొంత మొత్తాన్ని కలెక్ట్ చేస్తేనే ముందుగా అనుకున్న అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా అంచనాలను మించి కలెక్షన్స్ వస్తే ఒప్పుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి రావొచ్చు.
'డ్రాగన్' రూ.500 కోట్లు దాటితే...
ఎన్టీఆర్ 'డ్రాగన్' బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే అనుకున్న డీల్ ప్రకారం చిత్ర నిర్మాతలు 'నెట్ ఫ్లిక్స్' నుంచి రూ.125 కోట్లు అందుకుంటారు. లేకుంటే చెల్లింపులో స్వల్ప తగ్గింపు ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే, అనుకున్న దాని కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే ఒప్పందం కన్నా ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు.
Also Read : ఓటీటీలోకి మలయాళ హిట్ మూవీ 'చథా పచ్చ' - తెలుగులో వచ్చిన వారం రోజులకే స్ట్రీమింగ్
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న 'డ్రాగన్' మూవీలో ఎన్టీఆర్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా న్యూ లుక్‌లో చూడబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ఆయన స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం జోర్డాన్‌లో మూవీ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
























