By: ABP Desam | Updated at : 01 May 2023 11:01 PM (IST)
డెడ్ పిక్సెల్స్ టీజర్ లాంచ్‌లో అక్షయ్, నీహారిక (Image Credits: DisneyPlusHSTel Twitter)
Dead Pixels Teaser: మెగా సోదరుడు నాగబాబు కూతురు హీరోయిన్‌గా గతంలో సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో కూడా కనిపించారు. ఇప్పుడు తను ప్రధాన పాత్రలో ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో నీహారిక గేమర్‌గా కనిపించనున్నారు. మే 19వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది.
ఇక టీజర్ విషయానికి వస్తే... నీహారిక, అక్షయ్, వైవా హర్ష, సాయి రోనక్ గేమర్లుగా కనిపించనున్నారు. వీరు నలుగురూ కలిసి ఒక ఆన్‌లైన్ గేమ్ ఆడతారు. కానీ నీహారిక మాత్రం గేమ్ పైన అంత ఇంట్రస్ట్‌గా ఉన్నట్లు కనిపించలేదు. ‘గేమ్ అంటే పని లేనప్పుడు ఆడతారనుకున్నా కానీ పనులు మానుకుని ఆడతారా?’ అనే డైలాగ్ కూడా నీహారిక నోటి నుంచి వినవచ్చు.
నీహారికతో పాటు అక్షయ్ లాగుసాని, వైవా హర్ష, సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ ఈ సిరీస్‌లో నటించనున్నారు. ఇక టెక్నికల్ క్రూ విషయానికి వస్తే... ఈ సిరీస్‌కు కథ, స్క్రీన్‌ప్లేలను అక్షయ్ పొల్ల అందించారు. ఆదిత్య మందల దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియా, టమడ మీడియా సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.
మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు
Pareshan Movie OTT Platform : తిరువీర్ 'పరేషాన్' - నయా తెలంగాణ సినిమా ఏ ఓటీటీలో వస్తుందంటే?
టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ - ఈ రోజు మూవీ విశేషాలివే!
Samantha: ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత, ఇవిగో ఆధారాలు!
మాస్ లుక్‌లో మహేష్, ప్రభాస్‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా