Coolie OTT: ఓటీటీలోకి 'కూలీ' వచ్చేస్తున్నాడు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Coolie OTT Platform: సూపర్ స్టార్ రజినీ కాంత్ రీసెంట్ మూవీ 'కూలీ' ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

Rajinikanth's Coolie OTT Release On Amazon Prime Video: తలైవా రజినీ కాంత్ రీసెంట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ'. స్టార్ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ నెల 11 నుంచి 'కూలీ' స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ పంచుకుంది. 'దేవా, సైమన్, దాహా గాథతో జోష్ చూసేందుకు రెడీగా ఉండండి.' అంటూ పేర్కొంది.
ఈ మూవీలో తలైవా రజినీ దేవా పాత్రలో అదరగొట్టగా... విలన్ రోల్‌లో సైమన్‌గా నాగార్జున గూస్ బంప్స్ తెప్పించారు. వీరితో పాటే సత్యరాజ్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించగా... బుట్ట బొమ్మ పూజా హెగ్డే 'మోనికా సాంగ్'తో అదరగొట్టారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కళానిధి మారన్ మూవీని నిర్మించారు. ఫస్ట్ 4 రోజుల్లో రూ.380 కోట్లు కలెక్ట్ చేసింది.
get ready to vibe with the saga of Deva, Simon, and Dahaa 🔥#CoolieOnPrime, Sep 11@rajinikanth @sunpictures @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja pic.twitter.com/Erjtef2o0C
— prime video IN (@PrimeVideoIN) September 4, 2025
Also Read: అల్లరి నరేష్ 'ఆల్కహాల్' ఎందుకు తీసుకోరు? - ఈ టీజర్‌లో చూసేయండి... న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చేస్తోంది
స్టోరీ ఏంటంటే?
ప్రభుత్వం నుంచి వైజాగ్ పోర్టు లీజుకు తీసుకున్న కింగ్‌పిన్ లాజిస్టిక్ అధినేత సైమన్ దాని కేంద్రంగా అనేక అక్రమ వ్యాపారాలు సాగిస్తుంటాడు. అతని అక్రమ సామ్రాజ్యాన్ని అక్కడే ఉండి చూసుకుంటుంటాడు దయాల్ (సౌబిన్ షాహిర్). పోర్టులో జరుగుతున్న అక్రమ వ్యాపారాలను ఎవరు బయట పెట్టాలని చూసిన అక్కడికక్కడే ప్రాణాలు తీసేస్తుంటాడు దయాల్. అలా చంపిన వారి శవాలను సాక్ష్యాధారాలు లేకుండా మాయం చేయడం వీరి ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. ఇదే టైంలో రాజశేఖర్ (సత్యరాజ్) కనిపెట్టిన ఓ మొబైల్ క్రిమేటర్ చైర్ గురించి తెలుసుకుంటాడు సైమన్.
దీంతో తనను పని చేయాలంటూ రాజశేఖర్‌ను బలవంతం చేస్తాడు సైమన్. లేకుంటే ముగ్గురు కూతుళ్లనూ చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తన కూతురు ప్రీతి (శ్రుతి హాసన్)తో కలిసి సైమన్ వద్ద పని చేస్తాడు రాజశేఖర్. ఇదే టైంలో రాజశేఖర్ చనిపోతాడు. ఇతని ప్రాణ మితుడు దేవా (రజినీకాంత్) ఈ విషయం తెలుసుకుని తన మిత్రుడిది హత్య అని తెలుసుకుని హంతకుల కోసం వేట సాగిస్తాడు. ఈ క్రమంలో పోర్టులో జరిగే అక్రమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటాడు. అసలు దేవా ఎవరు? రాజశేఖర్ ఎలా చనిపోయాడు? ప్రీతి ఎందుకు దేవాని అసహ్యించుకుంటుంది? సైమన్ చేసే వ్యాపారం ఏంటి? దీనికి దాహాకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















